Meet The Man Behind The Memorable Lyrics Of Several Tollywood Chartbusters!

Updated on
Meet The Man Behind The Memorable Lyrics Of Several Tollywood Chartbusters!

సినిమాలోని కథని, హీరో హీరోయిన్ల వ్యక్తిత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకొని ఆ పాత్రల తాలుకు భావాన్ని సరిగ్గా రాయగల శ్రీమణి చిన్న వయసులోనే చాలా జీవితం చూశారు. తనకు ఎనిమిది సంవత్సరాలున్నప్పుడే తండ్రిని, పన్నెండు సంవత్సరాలున్నప్పుడు తల్లిని కోల్పోయారు. సరిగ్గా డబ్బులుంటేనే మన చుట్టాలు పట్టించుకోరు అలాంటింది తల్లిదండ్రులు చనిపోయాక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు కాని శ్రీమణి అమ్మమ్మ పిన్ని గార్లు అలా కారు ఉన్నంతలో చాలా బాగా చూసుకున్నారు. పుస్తకాలు బాగా చదివే అమ్మమ్మ దగ్గర శ్రీమణి పెరగడం వల్ల చిన్నతనం నుండే చలం, దేవులపల్లి కృష్ణశాస్త్రీ, శ్రీపాద సుబ్రమణ్యం, రామాయణం, మహాభారతం లాంటి మంచి సాహిత్య విలువైన పుస్తకాలు చదవడం మూలంగా పాటలు రాయాలన్న ఆలోచన సులభంగానే వచ్చేసింది.

"పాగోలు గిరీష్" ఇది శ్రీమణి అసలు పేరు. తనకి ఈ పేరు ఎలా వచ్చిందంటే.. 'శ్రీ' అనే అక్షరం తనకెంతో ఇష్టం, అమ్మ పేరు నాగమణి, ఆ 'మణి'తో ఈ 'శ్రీ' కలయికతో శ్రీ మణిగా పేరు పెట్టుకున్నారు. 9వ తరగతి నుండే సినిమా పాటలకు పేరడి పదాలు జోడిస్తు రాసేవారు, స్పూర్తిదాయకమైన వాక్యాలు, చిన్న చిన్న నిడివి ఉన్న పాటలు తనే ట్యూన్ కంపోజ్ చేస్తూ రాసేవారు. అదే లక్ష్యంగా డిగ్రీ స్థాయికి వచ్చేసరికి తను రాసిన కావ్యాలు, పాటలు, రచనలు అన్ని కలిపి ఒక బుక్ గా రాసుకొని హైదరాబాద్ వచ్చేశారు. అందరిలాగానే సకల సినీ కష్టాలు అనుభవించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు సినిమా అవకాశాల కోసం వెతుకులాటలు, సాయంత్రం 5గంటలనుండి రాత్రి 11వరకు పిజ్జా డెలవరీ బాయ్ గా ఉద్యోగం.. ఇది కొన్ని సంవత్సరాల వరకు లక్ష్యం వరకు శ్రీమణి నడచిన దారి.

ఇండస్ట్రీలో పరిచయాలతో మొదట కొన్ని చిన్న సినిమాలకు రైటర్ గా, ఘోస్ట్ రైటర్ గా చేశారు కాని సుకుమార్ 100%లవ్ లో రాసిన అహో బాలు, దటీజ్ మహాలక్ష్మీ, A Square B Square పాటలతో "పెన్ను పట్టుకున్న ఒక రాకెట్ లా ప్రేక్షకులకు, సినీ ప్రముఖులందరికి శ్రీమణి కలంకు ఉన్న కన్ను పవర్ తెలిసింది". అ సినిమా తర్వాత నాని సెగ(తమిల్ డబ్బింగ్) సినిమాలో ఒక దేవత, వర్షం ముందుగా, పాదం విడిచి లాంటి సాంగ్స్ తో మరింత పాపులర్ ఐపోయారు. హీరో ఇంట్రడక్షన్ పాటలోని Energyని ఎంతగా రాయగలరో ఇద్దరి ప్రేమికుల మధ్య భావాలను కూడా అంతే స్థాయిలో రాయగలరు అదే స్థాయిలో ఐటం సాంగ్స్ తో ప్రేక్షకులను మైమరపించగలరు. ఇంత చిన్న వయస్సులోనే ఇంతలా Variations చూపిస్తున్న శ్రీమణి మన తెలుగు ఇండస్ట్రీకి నూతనంగా దొరికిన పదాల గని.

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.