కిరణ్ – రేయ్,ఇంకా పడుకోలే?? ఈ టైం లో ఎం చేస్తున్నావ్ రా? ఎవరికి ఫోన్ చేస్తున్నావ్? గౌతమ్ – ఒక్కసారి నిధిని చూడాలని ఉందిరా, ఒక్కసారి తనతో మాట్లాడాలి.. కిరణ్ – పిచ్చిగాని పట్టిందా నీకు, ఇప్పుడు నిధిని కలవడం ఏంటి ఈ టైంలో మాట్లాడడం ఏంటి? అసలు నీకు బుర్ర పనిచేస్తుందా? అసలు నిధిని ఇప్పుడు కలవాలనే ఆలోచన ఎందుకొచ్చింది? గౌతమ్ - లేదురా కలవాలిరా? నేను తనని ఎంతగా ప్రేమించానో చెప్పాలిరా తనని ఎంత మిస్ అయ్యానో తనకి చెప్పాలి తన గురించి నేను రాసుకున్నవి అన్నీ తనకి చదివి వినిపించాలి. కిరణ్ – నీకు నిజంగానే పిచ్చి పట్టింది ? అసలు ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా ఇది టైం కాదు.ఇప్పుడు నువ్వు చెప్పడం అనవసరంరా? రేయ్ నువ్ ఆ ఫోన్ ఆపు ఫస్ట్ ఈ రాత్రి పదకొండు గంటలకి అక్కడ పెళ్లికూతురుగా ఉన్న పిల్ల దగ్గరికి పోయి ఐ లవ్ యు అని చెప్తావా? గౌతమ్ - ప్లీజ్ రా నన్ను అర్ధం చేస్కోర. ఒక్కసారిరా,ఒకే ఒక్కసారి తనతో మాట్లాడాలి. హలో నిధి. ఒక్క 5మినిట్స్ మీ ఇంటి terrace మీదకి రావా. ప్లీజ్ నీతో మాట్లాడాలి నిధి – గౌతమ్??ఇప్పుడు పైకి రావాలా? నీకేమైంది? చూడు ఇంట్లో చుట్టాలు అందరూ ఉన్నారు. ఈ టైం లో నన్ను టెన్షన్ పెట్టకు. నేను ఎక్కడికీ రాను గౌతమ్ – ప్లీజ్ నిధి ఒక్క 5 మినిట్స్ఏ,ఎక్కువ టైం తీస్కోను,నీకేం ప్రాబ్లం లేకుండా చూస్తా,ప్లీజ్ ఒకే ఒక్క సారి నీతో మాట్లాడి వెళ్ళిపోతా ప్లీజ్ నిధి – గౌతమ్ have you lost your mind. నీకసలు తెలుస్తుందా అసలు ఇక్కడ ఎం జరుగుతుందో?? నీకు గుర్తుందా రేపు ఏంటో?? గౌతమ్ – అయ్యో నిధి నాకన్నీ తెలుసు,నన్ను అర్ధం చేస్కో నిధి ,జస్ట్ ఐదు నిముషాలు మాత్రమే,నాకోసం ఇది కూడా చేయలేవా, ఒక్క ఐదు నిముషాలు నిధి . నిధి – సరే జస్ట్ ఫైవ్ మినిట్స్, ఒక పావుగంట తరువాత వస్తాను. మళ్ళి చెబుతున్నా,ఐదు నిముషాలు మాత్రమే. గౌతమ్ – హ థాంక్స్ నిధి, నీకే ప్రాబ్లం రానివ్వను. అరేయ్ కిరణ్ నిధి వస్తా అంది రా పద వెళ్దాం. కిరణ్ - ఎమన్నా చేస్కో, నేనైతే కిందనే ఉంటా.
గౌతమ్ – థాంక్స్ నిధి వచ్చినందుకు. చాలా థాంక్స్ నిధి – నీకేమైంది అసలు, బుద్ది ఉందా కొంచమైనా, ఈ టైంలో ఒక అమ్మాయికి అదీ పెళ్ళికూతురిగా ఉన్న అమ్మాయికికి కాల్ చేసి కలవాలి అంటావా. are you mad గౌతమ్.
గౌతమ్ – అవును, నిజంగా నాకు బుద్దిలేదు. నాకు ఆ బుద్దే ఉంటె నువ్వంటే నాకు ఇష్టం అని నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని ఎప్పుడో చెప్పేవాడ్ని, ఇలా ఇక్కడ ఇలాంటి సిటుయేషన్ వచ్చే దాక ఆగేవాడ్ని కాదు. నిధి నాకు పిచ్చే. నువ్వంటే పిచ్చి, నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని నీక్కూడా తెలుసు అని అనుకున్నాను, నీక్కూడా నేనంటే ఇష్టమే కావచ్చు అనుకున్నాను అందుకే నా నిధే కదా, మళ్ళి చెప్పడం ఎందుకులే అని ఆగిపోయనే తప్ప చెప్పలేక కాదు. చూడు నిధి నీ గురించి రాసుకున్నవి, నీకు ఎదురుగా వచ్చి చెప్పలేనివి అన్నీ ఇదిగో ఇలా రాస్కోని నా గుండెల్లో ఉన్న నీకు చదివి వినిపించేవాడ్ని . నువ్వు మూడు నెలలు జాబ్ ట్రైనింగ్ మీద వేరే ఊరు వెళ్తేనే నిన్ను వొదిలి ఉండలేక దాదాపు పిచ్చేక్కినట్లు అయ్యింది. నువ్ కనిపిస్తే నా కళ్ళలో ఎదో వెలుగోచ్చేది, నువ్ నా పక్కన ఉంటె అన్నీ ఉన్నట్టే అనిపిస్తుంది, నువ్ కాసేపు కనిపించకపోతే మాట్లాడకపోతే నన్ను నేనే మిస్ ఆవుతున్నా అనే భావన . నిధి నా జీవితం లో జరిగిన అద్భుతం నువ్వు,నాకు మా అమ్మా నాన్న తర్వాత నువ్వే నిధి, నువ్వు ఎదురుగుగా ఉన్నావ్ అనే ఆనందంతో ఇప్పుడు కూడా ఎం మాట్లాడుతున్ననానో నాకే తెలిట్లేదు. ఇంకా ఏవేవో చెప్పాలని ఉంది కాని ఇది టైం కాదు, వినేంత టైం నీకు కూడా లేదు, ఇది తీస్కో నిధి, ఈ డైరీ లో అంతా నీ గురించే రాసా, తరువాత ఎప్పుడైనా చదువుకో. వెళ్ళు నీకు లేట్ ఆవుతుంది. థాంక్స్ నిధి అడగగానే వచ్చినందుకు.
నిధి – అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావ్ గౌతమ్. ఇప్పుడా చెప్పేది. Get lost Gowtam.Leave me. వెళ్ళిపో ప్లీజ్. కిరణ్ – ఎం జరిగిందిరా నిధి ఏడుస్తూ వెళ్ళింది, చెప్పినవా??ఇప్పుడు కళ్ళు సల్లపడ్డయా నీకు, నడువ్ మరుసటి రోజు పెళ్లి మండపంలో పెళ్లి ముహూర్తానికి ఇంకొన్ని నిమిషాలే ఉన్నాయి,నిధిని తీసుకొస్తున్నారు పెళ్లి పీటలమీదకి,నాకు తెలుస్తుంది తన కళ్ళు నాకోసం వెతుకుతున్నాయ్ అని, తన చేతుల్లో వణుకు నాకు కనిపిస్తుంది. చుట్టూ అంత మంది ఉన్నా తను నాకోసమే వెతుకుతుంది అని నాకు అర్ధం అయ్యింది . ముహూర్తానికి ఇంకో పది నిమిషాలే ఉంది. ఒక్కసారిగా నిధి తల పైకి ఎత్తి చుట్టూ ఓసారి చూసింది. మెల్లిగా పక్కకి జరిగి “ ఓయ్ .....ఓయ్...... అసలు రాత్రి నువ్వెందుకు వచ్చావ్ ఎందుకు చెప్పావ్ అదంతా. ఎలాగు ఇవాళ మన పెళ్లి జరుగుతుంది కదా, రాత్రి ఆ టైములో వచ్చి చెప్పడం ఎందుకు, పెళ్ళయ్యాక చెప్పోచుగా? లేదా చెప్పకపోయినా ఎం కాదుగాఎందుకు చెప్పావ్ అదంతా నువ్వు.”
గౌతమ్ - “తన సొంత అక్క ఇంటికి కూతురిని కోడలిగా పంపితే తన జీవితం బాగుంటుంది అని మీ నాన్న ఒక నమ్మకం తో మన పెళ్లి చేస్తున్నారు. వాళ్ళ మీద గౌరవం తో నువ్వు నేనూ కూడా సరే అన్నాం. వాళ్ళ మీద నాకెంత గౌరవం ఉందొ అంత కంటే ఎక్కువ ప్రేమ నాకు నీమీద ఉంది, నీతో పెళ్ళికి సరే అనడానికి అదే అసలు కారణం, నీకు కూడా నేనంటేఎక్కడో అక్కడ కొంచెం ఫీలింగ్ ఉందేమో అనే నమ్మకం. ఇక నిన్న ఎందుకు చెప్పనంటావా పెళ్ళిలో అందరూ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు, నాక్కూడా నీకు ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలనిపించింది, కాని నీకివ్వడానికి నాదగ్గర పెద్దగా ఏమి లేదు,అందుకే ఎప్పటినుండో నీ మీద ఉన్న ప్రేమని చెప్పి నన్నే నీకు బహుమతిగా ఇచ్చేసా. చాలా సార్లు నీకు ప్రపోస్ చేద్దాం అనిపించింది కానీ మరీ డ్రమాటిక్గా ఉంటుందేమో అని ఆగిపోయా. నిన్న మాత్రం కొంచెం ధైర్యం చేసి చెప్పేసా.”
నిధి – నాకు ఎంతో ఇష్టమైన బహుమతినే ఇచ్చావ్, జీవితాంతం గుర్తుండిపోతుందిలే.