This Guy's Love Proposal To His Girl Is Very Poetic and Relatable

Updated on
This Guy's Love Proposal To His Girl Is Very Poetic and Relatable

Contributed By Nagaraju Durisetti

నల్లని సాయంత్రాన ఓ పార్క్ వైపు సాగింది నా నడక. చల్లని గాలి జోల తో రమ్మని పిలిచింది ఓ బెంచి పడక. తెల్లని నా మనసు ఆగలేకపోయింది బెంచి పై విశ్రాంతిని ఇడక. మెల్లని నా కన్నులు మూసిన ఆ క్షణం మదిలో నా ఎద మల్లిక. నల్లని పొడవాటి మెత్తని కురుల ఆమె జడ అల్లిక, ఒంపులు గా చుట్టుకొని ప్రవహించే రెండు సెలయేర్ల కలయిక. ఆమె కుడి చెంప మీద దిష్టిచుక్క లా పుట్టుమచ్చ కాటుక, ఆ పక్కనే ఉన్న పై పెదం మీద ఇంకొక నల్లమచ్చ ప్రతీక.

సన్నటి వెయిస్ట్ చైన్ ను నడుముకి చుట్టుకున్న ఆకుపచ్చ కోక, మెరిసేటి నెక్లెస్, బుట్టజోడులు ను ధరించిన ఆ ప్రేమ చిలుక... ఎన్నాళ్ళకు చేరుతుందో వరించిన నా గుండె గూటికింక. నా జీవితపు రేయిలో ..ఆమె దీప్తినిచ్చే ఓ సొంపుల నెలవంక. నాలో సంతోషపు వేడుక ఆమె చూసినప్పుడు నేనున్న నేలవంక లేలేత తామరపూరెమ్మ ముఖం కలిగిన ఆమెకై నా ప్రేమ కుత్తుక లోలోనే మనసులో ఇలా పలికింది ఆమెతో ప్రతిపాదన గీతిక

స్వచ్ఛమైన మనసుతో నడుచుకునే సరళమైన నీ నడవడిక తిరుమల లక్ష్మీదేవి లా నీవు నడిచే నిరాడంబరమైన నడక స్వాంతముతో విద్యను నేర్చుకునే సమయంలో నీ ఓపిక తిరునాళ్ళలో జన సందడి లా నీ ముఖం పై చిరునవ్వు దీపిక వికసించిన ఆ చిరునవ్వుకు అలవోకగా వాడిపోయే నా అలక హేతువు పాట పాడాయి ఎదగడానికి నా ఈ ప్రేమ మొలక దూరమవుతావని ప్రేమను తెలుపుతున్న నీకు నుసలక

నీ రాకకు... కలలా మిగిలిన నా కలం కదిపింది ఓ మాట నీ చూపుకు... పలుకాగిన నా గొంతు పలికింది ఓ పాట నీ చప్పట్లకు... పరుగాగిన నా గెలుపు ఆడింది ఓ ఆట నీ మెప్పొప్పుల కై …అందుకే అలసిపోని నా ఈ ప్రేమ వేట

నా ఆందోళనరేయిని తరిమే ప్రేమగెలాక్సీ లో నున్న స్వాతి నువ్వే నేను ప్రాణంగా ప్రేమించే తొలి మరియు తుది ఇంతి నా ఆశఆశయాలను పెంచేస్తుంది నువ్వు తోడుంటావన్న భ్రాంతి

నా జీవితపు ఆటకి నువ్వు తోడొస్తే...నేను గెలుస్తానన్న ధ్రృతి ఆ నీ తోడులో నాకు ప్రతీ గెలుపు మరచిపోలేని ఓ స్మృతి

నీతో కలిసి ఏడడుగులు వేయడానికి……. నీ జీవితపు ఒడిలో ఏడుజన్మల ప్రేమనిద్ర పోవడానికి... నీ మెడలో నా తోడు అనే తాడు ముడివేయడానికి... నీ చింతచీకటిలో ఆనందపు వెలుగులు నింపడానికి... నీ బతుకు నేలపై చిరునవ్వుల వర్షం కురిపించడానికి... కష్టం అనే దారిలో ఎన్ని అడుగులైన వేస్తా. కాలం అనే పయనంలో ఎన్ని జన్మలైన ఎదురుచూస్తా. కన్నీళ్లు రానివ్వక నీ జీవితపు మెడలో ఆనందపు దండ చేరుస్తా కొవ్వొత్తి లా కరిగిపోతూ నా జీవితాన్నంత ధారపోస్తా. నీ అల్లరి ఆటలను ను, భాధ్యతైన నిన్ను నేలతల్లి లా భరిస్తా. ఎంత ఎత్తుకైన ఎదిగి మీ అమ్మానాన్నల్ని మన ముడికి ఒప్పిస్తా కొంతైనా నా ఒంటరి ప్రేమ పోరాటానికి తోడు రా కాస్తా…. ఒప్పుకుంటే…. .. నీ జీవితంపాటు ఉత్సాహపు వాడ లో నేను వేడుకలు చేస్తా.. ఆనందపు పూలదారిని నీ పాదాల కింద పరుస్తా… ఒప్పుకున్నవెంటే…..ఈ నాలుగేళ్లపాటు నీవు కన్న కలలకి అడ్డురాక..నా లక్ష్యం వైపు పయనిస్తా.. నీ గమ్యాలకు ఆటంకం కాక..నీతో పలకరించడం ఆపేస్తా దూరంగా ఉంటూనే...నీ విజయాలకోసం నిత్యం ప్రార్థిస్తా.. నాలుగేళ్ల తర్వాత జీవితాంతం నావెంట వచ్చే నీకై, వేచిచూస్తా. ఒప్పుకోకుంటే……నా జీవితంపాటు నేను బాధతో కన్నీటి వర్షంలో తడుస్తా.. నువ్వు వస్తావన్న కలలో హాయిగా కన్నుమూస్తా..

ఈ భావోద్వేగాల పదాల బరువు మూట ఓ కవి కలం నుండి కదిలిన ప్రేమ మాట ఓ గాయకుడి గళం నుండి పలికిన ప్రేమ పాట ఓ క్రీడాకారుడు గెలుపు కోసం ఆడుతున్న ప్రేమ ఆట ఈ రాణి కోసం ఓ రాజు వేసిన వజ్రాల ప్రేమ బాట ప్రేమ అలలా ఉప్పొంగుతున్న ఈ పదాల తోట.. ఆగిపోయాయి నా కన్నులు తెరుచుకున్న ఆ చోట……….