This Guy's Heart-Felt Letter To His Childhood Love Will Hit You Right In The Feels!

Updated on
This Guy's Heart-Felt Letter To His Childhood Love Will Hit You Right In The Feels!

Contributed By Vasu Nama

గుండె నిండా బాధ.. కంటి నిండా నీళ్లు.. మాట్లాడలేని మనసు.. పైగా ఒంటరిగా నేను ఇక్కడ లేని శబ్దం నాకు వినిపిస్తుంది.. ఇక్కడ లేని గాలి నన్ను తాకుతుంది.. నాకు జంటగా నువ్వు ఉండలేవ ఒక్క క్షణం.. ఆ క్షణము చాలు బతికేస్తా ఒక యుగం..

నిన్ను చూడాలని నా రెండు కళ్ళు నీకోసం వెతుకుతూ మాట్లాడుకుంటాయి.. నీతో మాట్లాడాలని నా పెదాలు ఏడుస్తూ ఉంటాయి..

నీ స్పర్శే నా ఆలోచన.. నీ ఊపిరి నా గమ్యం.. నీ ప్రేమే నా జీవితం.. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా ఒక్క నిమిషమ్.. బతుక లేక చస్తున్న ప్రతి క్షణం..

అమ్మని ప్రేమిస్తున్న.. నిన్ను ప్రేమిస్తున్న.. ఎవర్ని ఎక్కువ అంటే అమ్మ అనే చెప్తాను.. నిన్ను కూడా అమ్మలగా చూస్కుంటా..అని కూడా చెప్తాను..

నీతో పోటీపడిన విషయాలు ఎన్నో.. నీకు పోటీగా నిల్చున్న సందర్భాలు మరెన్నో.. నిన్ను గిచ్చిన సమయాలు ఎన్నో.. ను నన్ను ముక్కు పట్టి లాగి కొట్టిన పండుగలు ఎన్నేనో..

అప్పటికి తెలియదు అది ప్రేమే అని.. తెలిసిన ఏమి చేయలేని వయసే అది.. అందుకు అంటారు ప్రేమ ఒక వింత మాయే అని..

ఆ మాయ లో నీకు తెలియకుండా చేసాను చాలా.. నీ వెనుకే తిరిగాను సైకిల్ మీద హీరోలా.. ఇప్పుడు గుర్తొవస్తే నవ్వొస్తుంది చాలా చాలా..

నీ అంత అందం చూడలేదు ఎప్పుడు.. నిన్ను చూసాక ఆగింది గుండె చప్పుడు..

నిన్ను చూస్తూ ఉండిపోయే వాడిని.. ప్రేమ లోకంలో విహరిస్తూ ఉండే వాడిని.. ఏమని చెప్పగలను..ఎంతని చెప్పగలను.. చెప్పటానికి మాటలు సరిపోవు..రాయటానికి పేజీలు సారిపోవు.. అలానే ఉండిపోతే బాగుండు అనిపించింది..

నన్ను విడిచి వెల్లవాని తెల్సి.. పరిగెట్టనూ నీ దగరికి.. చెప్పాను ధైర్యం చేసి.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేసరికి.. పొమ్మన్నావు అమ్మ వస్తుందని.. వెలిపోయాను తెలిసి తెల్సి..

అప్పటికి అర్థం కాలేదు..ఎందుకు వెళ్ళిపోయాను అని.. ఆలోచిస్తే తెలిసింది నిన్ను గౌరవింఛాను అని..

చేసాను కొన్ని ీతప్పులు.. చెయ్యను మరి ఇంకెప్పుడు..

నాలో నన్ను వెతుకున్నాను..ఎక్కడికి వెళ్లినా..ఏది చేసినా..ఏమి చూసిన..నాలో నన్ను వెతుకున్నాను.. ప్రతిక్షణం నీ ధ్యాసే..నీ తపనే.. ఎప్పుడు మొదలైందో తెలీదు.. నిన్ను తలుచుకుంటూ..ఆలోచిస్తూ. ఏమెమో చేసేవాడిని..కథలు ఉహించుకోవడం మొదలైంది.. సినిమాల మీద పిచ్చి పెరిగింది.. ఏది ఏమైనా..నువ్వు.. సినిమా అని డిసైడ్ అయ్యేను.. ను నేర్పించిందే ఇది అంత..నిన్ను చూసి నేర్చుకుందే ఇది అంత..

మన అలోచన లో తేడా ఉండొచ్చు మనం చేసి అనుబవ్వాలో కాదు..

ఎక్కడో ఏదో ఆశ..నువ్వు కావాలని.. ఎక్కడో ఏదో నమ్మకం..నీతో మాట్లాడు తను అని..

ప్రతిదీ ఒక కారణం వల్లే జరుగుది అంటారు..అది ఎందకో జరుగుతుందో ఎపుడు జరుగుతుందో ఎవరికి తెలియdhu.. Inka undhi

ఐ లవ్ యు ఫరెవర్ -- శ్రీ (నీ జడ అంటే నాకు చాలా ఇష్టం)