Contributed By VR Karna Madduluri
అవును నేను పిరికోడినే
అవును నేను పిరికోడినే . . . నాకు భయం..., చాలా భయం... ఎక్కడ నిన్ను కోల్పోతానో అన్న భయం... ఎక్కడ నీకు దూరం అయిపోతానో అన్న భయం... దూరంగా బ్రతకాల్సి వస్తుందేమో అన్న భయం... ఎక్కడ నువ్వు నా సొంతం కాకుండా పోతావేమో అన్న భయం... ఎక్కడ నా మీద చిరాకు పడాతావేమో ., ద్వేషం పెంచుకుంటావో అన్న భయం... ఎక్కడ ఇష్టం లేదంటావో అన్న భయం... ఎక్కడ నా వల్ల నీకు ఇబ్బంది కలుగుతుందేమో అన్న భయం...
ఎక్కడ నా ఈ భయం ఇంకా పెరిగిపోతుందేమో అన్నభయం... ఎక్కడ ఓడిపోతానో అన్న భయం.... నీ చుట్టూ పోగేసుకున్న ఆశలు నెరవేరవేమో అన్న భయం... నీ గురుంచి నేను కన్న కలలు ఎక్కడ నిజం కవేమో అన్న భయం ... నాలో ఉన్న ఇష్టాన్ని మాటల్లో చెప్పలేనేమో అన్న భయం... ఆకాశమంత ప్రేమను ఈ అక్షరాలలో పెట్టలేనేమో అన్న భయం... ఎప్పటికీ నా ప్రేమ నీకు అర్ధం కాదేమో అన్న భయం...
నా ఆనందం నువ్వైపోయావు . . , నువ్వు లేవంటే నా సంతోషం లేదు . . . నాలో నువ్వు పూర్తిగా నిండిపోయావు . . , నువ్వు రావంటే నేను బ్రతికుండి ప్రయోజనం లేదు . . . నా భయం పేరు ప్రేమ !