This Conversation Of A couple About Their Life Together Is Relatable

Updated on
This Conversation Of A couple About Their Life Together Is Relatable

Contributed by Rupesh Nasika One Sunday in 2016 :- విజయవాడ,పెనమలూరుకి దగ్గరలో....... ఒక పక్క తమలపాకు తోట, ఒక పక్క కాలీఫ్లవర్ పంట. మొదటిసారి మనం కలుసుకున్నాము. నేను వేసుకొని వచ్చిన scooty నేర్పించు అని అడిగావు. ఎవరు లేని ఆ place లో క్షణం క్షణంని memorable గా చేస్తున్న time లో, ఎక్కడ నుండి వచ్చారో గానీ పోలీస్ వాళ్లు,నీకు భయంని నాకూ tensionni add చేశారు. వాళ్ల ముందు నేను చేసిన acting, the best అని ఇప్పటికి అంటావు.

One Monday in 2017 :- Last three days నుండి, నీ phone switch off లో ఉంది. చాలా సార్లు call చేశా. Finally Monday నీ నుండి call వచ్చింది. Call lift చేసి చాలా కోపంతో ని మీద అరుస్తూ వున్నా, నా eyes నుండి ఎందుకు కన్నీరు వచ్చాయని నాకూ తెలీదు. దానికి కారణం నీపైన ఉన్న ప్రేమ అనుకుంటా.

One Tuesday in 2018 :- Morning నాకూ call చేసి నిద్ర distrub చేస్తే చాలా కోపం వస్తుంది అని నీకు తెలుసు. ఐన సరే ఆ రోజు మార్నింగ్ ఫోన్ చేశావ్. Lift చేయగానే 1st time నిన్ను బాగా తిట్టేసా. ఏడుస్తు ఒకే మాట అన్నవ్, నీకు fever తగ్గిందని చెప్పు నేను పడుకుంటా అని. నాకూ fever అని, నీకు last night అంతా నిద్ర పట్టలేదు. నేను తిడతా అని తెలిసి నాకూ call చేసి ఎలా ఉంది అని అడిగావ్. అప్పటివరకు ఉన్న అనుమానాలను అన్ని ఒక్క దెబ్బకు పోయి,మన relation మీద కొత్త నమ్మకం వచ్చింది.

One Wednesday in 2020 :- మన పెళ్ళి జరిగి నెల రోజులు అవుతుంది. సొంత apartment గృహప్రవేశం, తరువాత ముహూర్తం లేక ఇంకా కొంచెం construction మిగిలి ఉండగానే జరిగింది. వ్రతము జరిగినా రోజు అదే ఇంట్లో దంపతులు నిద్ర చేయాలి. Construction కానీ windows, doors,చల్లటి గాలి, దూరంగా చంద్రుడు, దగ్గరలో నువ్వు, మనం చెప్పుకునే మాటలు. ఇంతకన్నా ఏమీ కావాలి అనిపిస్తుంది.

One Thursday in 2021:- Morning నిన్ను చూడగానే ఎందుకో చాలా అందంగా కనిపించావు. అదే విషయం నీకు చెప్తే ఏం అన్నావో తెలుసా..? నా hand తీసుకుని నీ stomach మీద పెట్టి, పుట్టేది ఆడపిల్ల ఐతే pregnancy time లో తల్లి అందంగానే ఉంటారంటా అని. ఆ మాట వినగానే, ఎంతో సంతోషంగా అనిపించింది. That is the one of the best day in our life.

One Friday in 2022 :- నీ విషయంలో ఎంతో ధైర్యంగా ఉండే నేను, ఎందుకో మన పాప విషయంలో ధైర్యంగా ఉండలేకపోతున్నా. పాపకి వచ్చింది జ్వరమే ఐన నాకూ అసలు ఏం అర్ధం కావటం లేదు. హాస్పిటల్లో నా భుజం మీద పడుకున్న నీకు తెలీదు, నేను ఒక తండ్రిగా ఎంతా భయపడుతున్నానో. ఈ రోజుకి కూడా ఒక కొత్త నిర్ణయం తీసుకునే ముందు మా నాన్నకి చెప్పే నేను, నా కూతురు గురించి tension పడుతున్నాన? నమ్మలేకపోతున్న.నువ్వు నా జీవితంలోకి వచ్చాక కాలం చాలా fast గా సాగుతుంది.

One Saturday in 2019 :- Time ఉదయం 6 అవుతుంది. మీ వాళ్లు relatives ఇంటికి వెళ్లారు, ఒక్క దానివే పడుకోడం నీకు భయం అని, మూడు సంవత్సరాల క్రితం మొదలు అయినా మన ప్రేమ కథ మొదటి రోజు నుండి futureలో మనం ఎలా ఉంటామో రాత్రి నుండి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న నీకు చెప్తున్నా నీ ప్రేమికుడు. Hello... Helloooo.... బజ్జూన్నావా...! సారే బజ్జో, good night... I Love you... Bye