This Short Poem About How A Common Man Living With A False Image Is Spot On

Updated on
This Short Poem About How A Common Man Living With A False Image Is Spot On

Contributed By Vasudeva Sri Vamsi పురుగులం పేడపురుగులం పేడని తెలిసీ కంపుని మరిచీ , బ్రతుకుని లాగే పురుగులం..

సత్యం తెలియక పురుగులమనుకొను మిణుగురులం ... సత్యసాధనకు విచక్షణున్నా అసత్యమే ఇక మన గమ్యం..

చదువబద్దం , సంపాదనబద్దం , పైకి కనబడే బ్రతుకు అబద్దం.. నువ్వు అబద్దం , నేను అబద్దం , నిజమనుమాటే నేడు అబద్దం..

బయటకు క్షేమం , లోపల క్షామం ఎక్కడికక్కడ మాయప్రపంచం.... ఇస్తాచూడు , సాక్ష్యం నేడు , ఐనాకూడా నమ్మడు ఎవడు ..

పుస్తకముంటే మస్తకముండదు మస్తకముంటే బ్రతుకికసాగదు.. పుస్తకాలలో ఉంటాయన్నీ , వాస్తవానికవి సూన్యం అన్నీ...

నిత్యం జరిగే చుట్టూ తిరిగే అవస్తవాల, అభూతకల్పన అసత్య అనిత్య జీవన పయనం... చదువు సంధ్య , గాలి నీరు నిప్పు ఐపోయే వ్యాపారం.. చుట్టుపక్కలా నక్కల ఊళల మధ్య బ్రతకడం ఒక విన్యాసం.. ఎంత చదివిన ఎన్ని చూసిన మంచిచెడులకిక లే వ్యత్యాసం....

నిత్యం స్వార్ధం లోక వినాశం , నేను నాదని కొట్టుకు చస్తాం... చుట్టూ జరిగే దాష్టికి ఘోరం , కనపడకుండా ముసుగులు వేస్తాం

కోరలుజాచిన పాముల మధ్యన , నమ్మించే ఈ నక్కల మధ్యన , మానవరూపపు మాయజాలపు మర్మపు చేష్టల చదువరుల మధ్యన . ముసుగుల మధ్యన , మోసం మధ్యన ఏమి తోచని మిధ్యకు మధ్యన.

ఇన్నిటినింకెదిరించి బ్రతకగల ఓర్పు నేర్పు ఎక్కడిది... అబద్దాల మధ్య ఒక అబద్దంగా మిగిలే బ్రతుకే ఇక్కడిది