చెప్పులు కుట్టుకున్న అబ్రహం లింకన్ అగ్రరాజ్యమైన అమెరికాకు 16వ రాష్ట్రపతి. లింకన్ అమెరికా రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు అక్కడే ఉన్న కొంతమంది ఆయనను చూస్తు ఒకనాడు చెప్పులు కుట్టుకునే వాడు అంటు గేలిచేస్తు వెకిలిగా నవ్వుతున్నారు.. అది విన్న లింకన్... అవును.. నా తండ్రి ఒక చెప్పులు కుట్టుకునేవాడు తనే కాదు నేను కూడా నా పొట్టకూటి కోసం అదే వృత్తి చేశాను నా వృత్తి నాకు దైవంతొ సమానం ఇప్పటికి నేను నా నేలను మర్చిపోలేదు, నా వృత్తిని మర్చిపోలేదు మీ చెప్పులు ఎప్పుడు తెగిపోయినా ఏ భేషజం లేకుండా నాకు ఇవ్వండి నేను బాగుచేస్తాను అని నవ్వుతు ప్రేమగా బదులిచ్చాడు.. ఇది ఆయన వ్యక్తిత్వం అమెరికాకు ఎంతోమంది రాష్ట్రపతులు మారినా ఇప్పటికి ఆయనే వారికి ఆరాధ్యుడు.. లింకన్ ఒక విదేశీయుడైనా అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన ఆయన జీవితం ప్రపంచానికి స్పూర్తిదాయకం. అలాంటి అబ్రహం లింకన్ తన కుమారుడికి రాయకుండా ఉపాధ్యాయునికి రాసిన లేఖ ఇప్పుడు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులందరికి ఎంతో అవసరం, ముఖ్యం.
గౌరవనీయులైనా ఉపాధ్యాయులకు ...
1. గెలుపుకి పొంగిపోకుండా ఓటమికి కుంగిపోకుండా అన్ని పరిస్థితులలోను స్థితగా ఉంటు ఏ కష్టాలు వచ్చినా ఆ సమయంలోను హాయిగా నవ్వుకోవడం ఎలాగో నేర్పించండి.
2. గగనంలో ఎగిరేపక్షులు, సూర్యుని వెలుగులో తిరిగె తేనెటీగలూ పచ్చని చేలపై పూసే పువ్వుల అంతుచిక్కని రహస్యల గురుంచి ఆలోచించుకోడానికి కూడా సమయం కల్పించండి.
3. అనుకోకుండా దొరికిన ఐదు డాలర్ల కన్నా కష్టపడి సంపాదించిన ఒక్క డాలర్ అయినా ఎంతో విలువైనదని నేర్పండి.
4. ఈర్ష్య, ద్వేషాల నుండి దూరం చేయండి మనస్పూర్తిగా వచ్చె నవ్వులోని మర్మాలను చెప్పండి.
5. తెలివితేటలతో డబ్బును సంపాదించవచ్ఛు కాని వ్యక్తిత్వాన్ని మాత్రం ధనార్జన కోసం అమ్ముకోకూడదని నేర్పించండి.
6. ప్రతి ఒక్కరు చెప్పేది విని దానిలోని నిజాన్నే ఎలా నేర్చుకోవాలో అర్ధం అయ్యేలా బోధించండి.
7. తన నమ్మింది నిజమని బలంగా విశ్వసిస్తే అందుకోసం ఎంతవరకైనా పోరాడటం నేర్పించండి.
8. ఆప్యాయంగా మాట్లాడండి కాని అతిగా గరాభం చేయకండి. ఎందుకంటే నిప్పుల కొలిమిలో మాత్రమే ఉక్కుకు ఒక ఆకారం వస్తుంది.