Meet Ande Sri, The Nature Poet Who Composed The State Song Of Telangana!

Updated on
Meet Ande Sri, The Nature Poet Who Composed The State Song Of Telangana!
ఒక రాష్ట్రమంతటికి ఐక్యతా భావాన్ని నింపె స్పూర్తి గీతాన్ని రాయాలంటే అతను ఎంత చదువుకుని ఉండాలి ! మూడు కోట్ల పైచీలుకు తెలంగాణా ప్రజల నరనరాన ఉత్తేజ పరిచే రాష్ట్ర పాట ఏ స్థాయిలో ఉండాలి! అంతటి స్థాయిలో ఉన్న గేయాన్ని రాసింది ఏ మాత్రం చదువుకోని ఒక వ్యక్తి అంటే మీరు నమ్ముతారా..! అవునండి ఈ పాటను రాసింది పాఠశాలలో పాఠాలు నేర్వని అందెశ్రీ(కలం పేరు). అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య, వరంగల్ జిల్లా, జనగాం వద్ద మద్దూర్ మండలం రేబర్తి అనే ఒక మారుమూల గ్రామంలో జన్మించారు. అందెశ్రీ ఒక అనాధ, పుట్టగానే కన్న తల్లి వీది రోడ్డు పక్కన ఒదిలేసి వెళ్ళిపోయింది పుట్టినప్పటి నుండి అత్యంత హృదయ విధారకమైన జీవితంలో పెరిగాడు.. కన్నోల్లు ఎవరో తెలియనప్పుడు కంటికి దారలు పెట్టుకుని ఏడిచాడు.. ఒక భూస్వామి దగ్గర బుక్కెడు బువ్వ కోసం ఆవూల కాపరిగా పనిచేశాడు. చిన్నతనంలో పిల్లలందరూ ఆటలు పాటలు, అమ్మ నాన్నల అలనా పాలనలో ఉంటే అందెశ్రీ కి మాత్రం చిన్నతనంలోనే వైరాగ్యంలో మునిగిపోయి ఉండేవాడు ఆ దుఖంలోనే నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వ లేదయ్యో అంటు పాడుకున్నాడు. ఇదంతా గమనించి శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహరాజ్ ఇతని పాటలు విని చేరదీశాడు.. "అందెశ్రీ" అని అతనే కలం పేరు పెట్టి నీలో గొప్ప కవి దాగున్నాడు అని ప్రోత్సహించారు. అతను చేయలేని పనులులేవు రైతు కూలీగా, తాపీ పనులు, కూలీ పనులు ఇలా పొట్ట కూటి కోసం చిన్న తనంలోనే తన్ను తానే నమ్ముకున్నాడు, తన కష్టాన్నే నమ్ముకున్నాడు. 22 సంవత్సరాలు కూలీ పని, 10 సంవత్సరాలు భూస్వామి దగ్గర పనిచేశారు ఇదే అతను చదువుకున్నది కేవలం అతను జీవితాన్నే ప్రపంచాన్నే చదువుకున్నారు.. ఇలా కష్ట పడుతూనే పెరిగి పెద్దవాడై జానపద పాటలు, మంచి సినిమాలకు పాటలే కాదు ఒక రాష్ట్ర గేయాన్నే రాసేంత స్థాయికి ఎదిగారు.. ఎక్కడ ఆవుల కాపరి ఎక్కడ అమెరికా డాక్టరేట్.. ఆయన అందుకున్న కొన్ని గౌరవాలు 2007లో కోటి దర్శకత్వం వహించిన "గంగ" సినిమాలోని వెళ్ళి పోతున్నావా... పాటకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది అవార్ఢును అందుకున్నారు. ప్రఖ్యాత కాకతీయ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. తెలంగాణా ఉద్యమ గీతాలు, భక్తి, ప్రేమ గీతాలు అని ప్రతి ఒక్క రకమైన పాటలు అందించారు. భారతదేశ నాల్గొవ అత్యున్నత పురస్కారం అయిన "పద్మశ్రీ" అవార్ఢు తెలంగాణా ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. అమెరికా లోని అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ వారు గౌరవ డాక్టరేట్ ను అందించి "లోక కవి" బిరుదునిచ్చి సన్మానించారు. జ్ఞాన్ పీఠ్ అవార్ఢు గ్రహీత రావూరి భరద్వాజ్ పేరుతో ఇచ్చె రావూరి భరద్వాజ సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు. ఎర్ర సముద్రం సినిమా కోసం రచించిన మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల తెలుగు విషయం రెండో సంవత్సరం సిలబస్ లో చేర్చారు. వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారిచే దాశరథి సాహితీ పురస్కారం. డబ్బుకోసం పేరుకోసం ఏనాడు ఆయన రాయలేదు దిక్కు మొక్కులేని అనాధల ఆకలి కేకల నుండి ప్రజల బాధల ఇతివృత్తాలు కదిలించిన సందర్భంలోనే పాటలను అందించారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి చాలా సంవత్సరాలకు ముందే 2002లోనే తెలంగాణా గీతాన్ని అందించారు దానిని చూసిన కే.సి.ఆర్ తెలంగాణా రాష్ట్రం రాగానే ఈ గీతాన్నే రాష్ట్ర గీతంగా ప్రకటించాలని ఆనాడే నిశ్ఛయించారు. మొదట 11 చరణాలతో ఉన్న పాటను 4 చరణాలకు కుదించారు. అందెశ్రీ అందించిన రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లీ నీరాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ - జై జై తెలంగాణ పొతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గొలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్ మినార్ జై తెలంగాణ - జై జై తెలంగాణ జానపద జన జీవన జావలీలు జాలువారే కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ - జై జై తెలంగాణ సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణువనువు ఖనిజాలే నీ తనువుకు సింగారం సహజమైన వన సంపద సక్కనైన పూవుల పొదసిరులు పండే సారమున్న మాగాణి కరములీయ జై తెలంగాణ - జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి. పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే స్వరాష్టమై తెలంగాణ స్వర్ణయుగం కావాలె జై తెలంగాణ జైజై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ