Presenting the Life Lessons That We Need To Learn From Lord Shiva!

Updated on
Presenting the Life Lessons That We Need To Learn From Lord Shiva!

త్రినేత్రం (Third Eye) కనిపించేవన్ని నిజాలు కావు నిజాలన్ని కనిపించవు . ఒక్కోసారి కళ్ళముందు జరిగింది కూడ నిజం కాదు మానవ నేత్రంతో కాదు మనోనేత్రం మనసుతో చూడాలని శివుని ముడోకన్ను ద్వారా నేర్చుకోవాలి.

s10

శరీరం పై బూడిద (Shiva smears Ash on body) ఈ విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణి చివరికి మట్టిలో కలిసిపోతుంది, ఈరోజు మనం ఎంత అందంగా ఉన్నామో అని అద్దంలో చూసుకుంటూ మురిసిపోయినా రేపు కనికరం లేని చితిమంటల అగ్నికి ఆహారం కాక తప్పదు అని ఏది మనకు శాశ్వతం కాదు అని గ్రహించాలి.

Screenshot_41

నీలకంఠం (Blue Throat) అమృతం కోసం పాలను చిలుకుతుంటె వచ్చిన విషం వల్ల ఏ ఒక్కరికి హాని కలగకుండా ఆ విషాన్ని గొంతులో దాచుకుంటాడు. శివుడు మహా త్యాగి. అలాగే మనం కూడ ఎదుటి వారికి వీలైనంత సహాయం చెయ్యాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి సాద్యమైనంత వరకు ఎదుటివారి గురుంచి చెడు చెప్పకూడదని నీలకంఠుడి ద్వారా అర్దంచేసుకోవాలి.

637695343

పులిచర్మం (Wearing Tiger skin) పులికి ఆకలేస్తే గడ్డి తినదు అది ఎక్కడ Compromise కాదు. అలాగే ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు దాన్ని సాదించేంత వరకు రాజీపడకూడదు, వెనకడుగు వేయకూడదు.

Lord Shiva-Wallpapers-hara (7)

పద్మాసనం (Padmasana, Meditation) మనం చూస్తున్న చాలా Photos లో శివుడు పద్మాసనంలోనె కనిపిస్తారు. శివుడు 1000 సంవత్సరాల పాటు ఆపకుండా Meditation చేయగలరు అలా ఉంటునే ప్రతి ప్రాణి యోగ క్షేమాలు గమనిస్తాడు. Meditation అనేది సకల మానసిక ఆందోనలను అదుపుచేసి Discipline లైఫ్ అందిస్తుంది.

shiva-rishikesh

నెలవంక (Crescent Moon) చంద్రశేఖరుని నెలవంక లా సాద్యమైనంత వరకు ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా మనం ఆనందంగా ఉంటు ఇంకొకరి జీవితంలో వెలుగుల నింపాలి.

3278596_orig

మెడలోని పాము (Snake Around The Neck) శివుని మెడలోని పాము వాసుకి లో పంచభూతాలు ఉంటాయి. భూమి, ఆకాశం, నీరు, గాలి, నిప్పు. ఈ ఐదు కారణాల వల్లనే మనం బ్రతుకుతున్నాం. ఈ భూమి కేవలం ప్రాణులు బ్రతకడం కోసమె. మనలో లేనిదేది లేదు శక్తి అంతా మనలోనె ఉంది, మనం అనుకుంటే ఏదైనా సాదించగలం. మన శక్తిని పరిపూర్ణంగా ఉపయోగించుకొని ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి.

942896238

అర్ధనరీశ్వరుడు (Ardanaarishwar) పార్వతీదేవి మీదున్న అనిర్వచనీయమైన ప్రేమతో తన శరీరంలో సగభాగానిచ్చాడు. మనతో జీవితాన్ని పంచుకుంటున్న మన Better half కి Respect ఇస్తు నేనే గొప్పా అని కాకుండా మనం ఇద్దరం ఒక్కటె We Are Equal అని భాదలో, కష్టాలలో, Success లో కూడా Credit ని ఇద్దరు పంచుకోవాలి.

67dc222434316ee11d95b4c9d51d7f0c

తల పై గంగా (Ganga) గంగా ఏ ఒక్కక్షణం ఆపకుండా నిరంతరం తలనుండి జాలువారుతూ ప్రవహిస్తుంది. అలాగే మన మెదడు లోని మంచి ఆలోచనలను ఎప్పుడు ఆపకుండా మన మేదస్సును, తెలివి తేటలను విరామం లేకుండా ఈ ప్రపంచానికి అందివ్వాలని శివ గంగా ద్వారా తెలుసుకోవాలి.

krishna-lord-demon-all-php-file-a-shivite-prayes-to-siva-4298035.2