This Mobile App Made By Telugu People Will Help You Learn Almost Anything

Updated on
This Mobile App Made By Telugu People Will Help You Learn Almost Anything

నృపతుంగ B.Com చదువుతుంది. పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తూ ఉంది. బీకాం ఎకానామిక్స్ లో కాస్త వీక్, ట్యూషన్ వెల్దామనుకుంటే కాలేజ్, జాబ్, అయ్యి రాత్రి ఇంటికి వచ్చేసరికి 10 అవుతుంది, ట్యూషన్ 9 కే ఐపోతుంది.. కోటేశ్వర రావు గారు యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్. సాయంత్రం ఇంటికి రాగానే ఖాళీగానే ఉంటారు. పోనీ ఇష్టం కొద్దీ ట్యూషన్ చెబుదామంటే ఇంటి దగ్గర్లో స్టూడెంట్స్ తక్కువ.. ఆయన మరో దగ్గరికి వెళ్లి ట్యూషన్ చెప్పలేరు.

ఇప్పుడున్న పరిస్థితులలో అత్యంత విలువైనది "సమయం". డబ్బు సహాయం చేయడం, లేదంటే మరొకటి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు కానీ వీటన్నిటి కన్నా టైమ్ వెలకట్టలేనిదని, దానిని సరైన విధంగా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరి తపన. ఎకనామిక్స్ లో వీక్ ఐన నృపతుంగ కు, ఎకనామిక్స్ టీచింగ్ లో నిష్ణాతుడైన కోటేశ్వరరావు గారికి తీరిక సమయంలోనే వీరిద్దరికి ఆన్ లైన్ క్లాస్ అరేంజ్ చేశారు "లెవెల్ యాప్" వారు. ఫలితంగా టైమ్ ఇద్దరికి సద్వినియోగమైంది.

నర్సరీ నుండి సి.ఏ, సివిల్స్ వరకు: లెవల్ యాప్ లో నర్సరీ నుండి పీజీ, సీఏ, సివిల్స్ కోచింగ్ ఇంకా సంగీతం, డ్రాయింగ్స్, ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇలా రకరకాల కోర్సుల్లో క్లాసులు తీసుకోవచ్చు అది కూడా మనకు నచ్చిన సమయంలో.. ఈ ఐడియాతో వారు ఎదుగుతూ మరెందరినో ఎదగడానికి ఉపయోగపడుతున్న వారు అశ్విత, శ్రీకాంత్, సాయి ఇంకా సుచిత్ర. వీరికీ ఐడియా రావడానికి కూడా వీరికి ఎదురైన సమస్యే కారణం. బీటెక్ లాస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మంచి ట్యూటర్ కోసం చాలా శ్రమపడాల్సి వచ్చింది. ఆ తర్వాతి కాలంలో ఈ సమస్య సమాజంలోని అన్ని రకాల కోర్సులు చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఫేస్ చేస్తున్నారని తెలిసింది. రొటీన్ జాబ్ ల కన్నా, మనకు మనమే బాస్, మన ఫ్రీడమ్ మన చేతుల్లోనే ఉండాలని 2016లో ఈ స్టార్టప్ ను స్టార్ట్ చేశారు.

టీచర్స్ ఎంపికలో: లెవెల్ యాప్ లో ప్రస్తుతం 800కు పైగా టీచర్స్, 3000మందికి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ ఎవ్వరైనా మెంబర్షిప్ తీసుకోవచ్చు, మెంబర్షిప్ తీసుకునే ముందు స్టూడెంట్స్ డెమో క్లాస్ అటెండ్ అవ్వొచ్చు ఆన్ లైన్ లో, టీచర్ గా క్లాసులు ఇవ్వాలనుకుంటే మాత్రం మూడు డెమో క్లాసులు, టీచర్ గా వారి అనుభవం, వారిలో టీచింగ్ లో క్రియేటివిటీ, ఓపిక మొదలైన అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే టీచర్ ను ఆహ్వానిస్తారు. ప్రతి క్లాస్ 'కోర్స్' ని బట్టి ఫీజు ఉంటుంది ఇది కూడా అందరికి అందుబాటులోనే..(గ్రూప్ క్లాస్ కు మరింత తక్కువ)

వీడియో రికార్డింగ్, ప్రతి స్టూడెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్: ఇంటర్నెట్ వచ్చిన దగ్గరి నుండి దాని వయసు పెరుగుతున్న కొద్ది ఎందరివో జీవితాలు మారిపోతున్నాయి. లెవల్ యాప్ లో శ్రీకాకుళం జిల్లాలోని ఒక కుగ్రామం నుండి ఓ వ్యక్తి ఆన్ లైన్ క్లాసులు అటెండ్ అవుతున్నాడు. అదే క్లాసుల కోసం హైదరాబాద్ కు రావాలంటే కోచింగ్ ఫీజు, రూమ్ రెంట్, ఇంకా రకరకాల ఖర్చులు ఇవన్నీ తనకు మిగులుతున్నాయి. ప్రతి క్లాస్ ను వీడియో రికార్డ్ చేసుకొని అవసరం అయినప్పుడు మళ్ళీ చూసుకోవచ్చు. అలాగే స్టూడెంట్ కు ఎంత వరకు అర్ధం చేసుకోగలుగుతున్నాడు, ఎలా నేర్చుకుంటున్నాడు మునపటికి ఇప్పటికి ఎలా చేంజ్ అయ్యాడు మొదలైన అన్ని అంశాలను వివరిస్తూ ప్రోగ్రెస్ కార్డ్ కూడా ఇస్తారు. ఫలానా ప్లేస్ లో ఉండడం వల్ల ఫలానా కోర్స్ చదువుకోలేకపోతున్నాను అనే నూన్యత ఇక నుండి ఉండదు. నేర్చుకోవడానికి బౌండరీలు లేవు.. మన రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోని వివిధ నగరాలతో పాటు, విదేశీయులు కూడా మెంబర్షిప్ తీసుకున్నారు. అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ళు వారి పిల్లలకు తెలుగు నేర్పించడం కోసం ఇక్కడున్న తెలుగు టీచర్స్ దగ్గర క్లాసులు తీసుకుంటున్నారు. అలాగే ఫ్రెంచ్, స్పానిష్ మొదలైన భాషల కోసం అక్కడి లోకల్ స్పీకర్స్ దగ్గర మనవాళ్ళు కోచింగ్ తీసుకుంటున్నారు.

విద్యార్థుల ఆత్మీయ కలయిక: సుచిత్ర, అశ్విత, సాయి శ్రీకాంత్ లలో ఉన్న మరో గొప్ప లక్షణం గవర్నమెంట్ స్కూల్ లో చదువుకుంటున్న పిల్లలకు సహాయం చెయ్యడం, కార్పొరేట్ స్కూల్ లో చదువుకుంటున్న పిల్లలను గవర్నమెంట్ ఇంకా తండా స్కూల్స్ లో చదువుకుంటున్న పిల్లల్ని కలిపే ఒక వినూత్నమైన కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. కొంత సమయం కార్పొరేట్ స్కూల్ పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ లో చదువుకుంటున్న పిల్లలు కలుసుకోవడం వల్ల వాళ్ళ బౌండరీలు దాటి ఒకరి గురుంచి మరొకరికి తెలియవచ్చింది. ఆ మధ్య meridian school విద్యార్థులు వాళ్ళ టీచర్స్ చెప్పకపోయినా ప్రత్యేకంగా కొన్ని ఫుడ్ ఐటమ్స్ తో పాటు తయారుచేసిన క్రాఫ్ట్స్ ను బహుమతిగా ఇచ్చారు. పిల్లలలో ఉబికివస్తున్న ఈ ప్రేమకు ఇరువురి టీచర్స్ ఆశ్చర్యపోయారు.. లెవెల్ యాప్ కోసం నలుగురు వారి సమర్థతను బట్టి పనులను విభజించుకున్నారు. సుచిత్ర టెక్నాలజీని మెరుగుపరిస్తే, శ్రీకాంత్ మార్కెటింగ్, అశ్విత బిజినెస్ డెవలప్మెంట్ అనాలిసిస్.. ఇలా వారి వారి పనులను సమిష్టిగా నిర్వహిస్తున్నారు. స్టూడెంట్స్ యే కాదండి టీచర్స్, స్టూడెంట్స్ ఇచ్చే ఫీడ్ బ్యాక్ వల్ల మేము కూడా ఎంతో నేర్చుకుంటున్నామని వినమ్రంగా చెబుతుంటారు ఈ స్నేహితులు.

For more details : https://levelapp.in