This Couple From Hyderabad Makes Cool T-shirts That Glow In Dark

Updated on
This Couple From Hyderabad Makes Cool T-shirts That Glow In Dark

హైద్రాబాద్ లో నివాసముంటున్న మహాలక్ష్మి, అయ్యప్ప దంపతులకు ఒక్కడే అబ్బాయి. బాబు వేసుకునే డ్రెస్ ప్రత్యేకంగా ఉండాలని మహాలక్ష్మి గారు తపన పడేవారు. ఇందుకోసం రకరకాల షాప్స్ తిరిగారు కాని ఎక్కడా వారి ఆశకు ఒక సమాధానం దొరకలేదు. మహిళలకు అంటే రకరకాల డిజైనింగ్ డ్రెస్ లు ఉంటాయి, అబ్బాయిలకు అలాంటి అవకాశం లేదు. ఐనా కాని ఏదైనా బాబుకు కొత్త రకమైన డ్రెస్ తయారుచేయాలి అనే ఆలోచనలోంచి పుట్టిందే ఈ ఎల్.ఈ.డి షర్ట్.

మొదటి తరం మనిషి శరీరానికి ఏది కప్పుకోలేదు. ఆలోచన పెరుగుతున్న కొద్ది, జ్ఞానం ఒకరినుండి మరొకరికి అందుతున్న కొద్ది శరీరాన్ని దుస్తులతో కప్పుకోవడం దగ్గరినుండి వేసుకునే దుస్తులలో ఫ్యాషన్ మారిపోతూ వస్తుంది. ఎల్.ఈ.డి ఫ్యాషన్ రేపటి మార్కెట్ ను శాసించబోతుందని బహుశా మహాలక్ష్మి అయ్యప్ప గారు ఊరికే ఐన ఊహించి ఉండరు. ఎల్. ఈ.డి. షర్ట్ డిజైనర్లు వీరిద్దరే, సృష్టించబడిన ప్రాంతం వారి ఇల్లే. మొదట షాప్ లో కొన్న మామూలు టీషర్ట్‌ కు ప్యానల్‌ని అమర్చి దానికి రక్షణగా ఉంచడానికి మరో క్లాత్ ను అతికించారు. దీనికి 500 ఎమ్‌ఏహెచ్‌ రీఛార్జబుల్‌ బ్యాటరీని జతచేసి ఎల్‌ఈడీ లైట్లు వెలిగేలా చేశారు.. షర్ట్ వేసుకున్నప్పుడు శరీరానికి ఏ ఇబ్బంది అసౌకర్యం కలగకుండా కండెక్టివ్‌ వైర్‌తో ఇబ్బంది కలగకుండా టీషర్టులో కలిసిపోయేలా చూసుకున్నారు. అద్భుతంగా పనిచేసింది. వేసుకున్న వారి బాబు కూడా సంతోషపడ్డాడు.

మనకు నచ్చినట్టుగానే ఎల్.ఈ.డి షర్ట్స్ చాలామందికి నచ్చుతుందనే నమ్మకంతో పెద్ద ఎత్తున ఎల్.ఈ.డి షర్ట్స్ తయారుచెయ్యాలని ఒక నిర్ణయానికి వచ్చారు. వీరికి మార్కెట్ మీద, వ్యాపారం మీద అనుభవం లేకపోవడంతో మొదట ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 20 లక్షల వరకు పైగా ఇన్వెస్ట్ చేశారు. ఆ ఇబ్బందులు వినియోగదారుల దగ్గరికి చేరవెయ్యడం వరకే ఉన్నాయి. ఎప్పుడైతే కస్టమర్స్ కి నచ్చాయో మౌత్ పబ్లిసిటీ ద్వారా ఒకరి స్నేహితులు మరొక స్నేహితులతో చర్చించడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అమలాపురం(మహాలక్ష్మి), రాజమండ్రి(అయ్యప్ప) నుండి కలుసుకున్న ఈ దంపతులు ఇప్పుడు ఎల్.ఈ.డి షర్ట్స్ ను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఢిల్లీ ముంబయి, నోయిడా, కోల్‌కతా, చెన్నై లతో పాటు అమెరికా, పోలండ్‌ లండన్‌, సౌదీ, సింగపూర్‌, మలేషియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

మనకు నచ్చిన టెక్స్ట్, ఎప్పుడంటే అప్పుడు: మామూలు షర్ట్స్ మీద ఏది రాసి ఉంటే ఎప్పటికీ అదే ఉంటుంది. ఎల్.ఈ.డి షర్ట్స్ మీద అలా కాదు. షర్ట్ కొన్న తర్వాత గూగుల్ ప్లే స్టోర్ లో వీరి యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోవాలి, అందులో సూచించినట్టుగా కొన్న షర్ట్ ను యాప్ తో లింక్ చేసుకోవాలి. ఫోన్ లో మనం ఏదైతే టెక్స్ట్ అనుకున్నామో ఆ టెక్స్ట్ షర్ట్ మీద వెలుగుతాయి. మెసెంజర్ లో వాడుకునే ఎమోజీలు, నాయకుల కోటేషన్స్ ఇంకా మనకు నచ్చిన టెక్స్ట్ ను షర్ట్ మీద ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. అంతే కాకుండా ఫిట్ గా ఉండాలనుకునే వారి కోసం వీరు ఈ మధ్యనే మరో షర్ట్ ను తయారుచేశారు. మనం ఎన్ని అడుగులు వేశాము.? ఎన్ని క్యాలరీలు ఖర్చు అయ్యాయి.? లాంటి సమాచారం అంతా వేసుకున్న షర్ట్ ద్వారా ఫోన్ లో చూసుకోవచ్చు. వీటి ధర రూ.1,200 నుండి మొదలవుతుంది.

అక్షరాలు ఒక్కచోట మాత్రమే కాదు ఇలా మారుతూ ఉంటాయి కూడా: 1.

2.

మరిన్ని పూర్తి వివరాల కొరకు వారి వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. www.broadcastwear.com