భారతదేశం బ్రిటీష్ వారి బానిస పంజరం నుండి స్వేచ్ఛా జీవితంలోకి అడుగుపెట్టి ఇప్పటికి దాదాపు 70 సంవత్సరాలయ్యింది. ఎంతోమంది రాజకీయ నాయకులను ఎన్నుకుని మమ్మల్ని, మా బతుకుల్ని బాగుచేయండిరా బాబు అని వాళ్ళకు అవకాశం ఇస్తుంటే వాళ్ళు చేసే ఘనకార్యం ఏంటో మనందరికి తెలుసు. 70 సంవత్సరాల స్వేచ్ఛా భారతదేశంలో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడని రాజకీయ నాయకుడు ఎవరు..? అంటే మనకు వెళ్ళమీద లెక్కపెట్టుకునేంత మంది కూడా రాకపోవచ్చు. అలాంటి నీతివంతమైన, శక్తివంతమైన రాజకీయ నాయకులలో మొదటి గొప్ప నాయకుడు మన "భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి గారు".
చిన్నప్పటి నుండి లాల్ బాహదూర్ శాస్త్రి గారికి తనంటే తనకు చాలా ఇష్టం, అభిమానం ఎక్కువ. ఇక తన వల్ల కాదు అన్నప్పుడే సహాయం కోసం మిగితా వాళ్ళని బ్రతిమలాడేవారు. చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు గంగానదిని ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు దాటిలి. "అలా దాటడానికి పడవ ప్రయానానికి డబ్బులేకుంటే తన షర్ట్ ని విప్పి పుస్తకాలను ఆ చొక్కాలో ఒక ముటకట్టి ఆ షర్ట్ ని తన భూజానికి కట్ఠుకుని కొంత దూరంలో ఉన్న ఒడ్డును చేరుకోవడానికి అలా ఈత కొడుతూ స్కూల్ కి వెళ్ళేవాడు. నిజానికి ఆ పడవ నడిపే వ్యక్తిని బ్రతిమలాడితే ఉచితంగానే తీసుకెళ్ళేవాడు కాని శాస్త్రి గారికి కాస్త అభిమానం ఎక్కువ. నాకు దాటే శక్తి ఉండగా ఎందుకు బ్రతిమలాడటం అని ప్రాణాలకు తెగించి బడికి వెళ్ళేవాడు.
చిన్నప్పటి నుండి అదే నీతి నిజాయితీతో చదువుతూనే బాలగంగాధర్ తిలక్, మహాత్మగాంధీ వంటి స్వాతంత్ర్య సమరయోధుల స్పూర్తితో బ్రిటీష్ వారిపై ఎన్నో ఉద్యమాలు చేశారు, 17 సంవత్సరాలకే జైలుకి వెళ్ళారు. శాస్త్రి గారు బ్రిటీష్ వారిపై జరిపిన పోరాటంలో దాదాపు 10సంవత్సరాల పాటు(వివిధ సంధర్భాలలో) జైలునే గడిపారు అది వారి ఓర్పుకి నిదర్శనం. ఎన్నో పోరాటాలు, ఎంతోమంది వీరుల ప్రాణ త్యాగల ఫలితంగా మన దేశం స్వేచ్ఛా గాలిలోకి విహరించింది. ఇక ఏముంది.. అంతా మనదే.. సాధించాం అని సంభరపడిపోలేదు శాస్త్రి గారు. దేశంలోని ప్రతి సమస్య తీరిపోయినప్పుడే నిజమైన పండుగ అని దీనికి "Perfect Platform అధికారం" అని నమ్మి రాజకీయాలలోకి ప్రవేశించారు. భారతదేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రు (1947-1964) మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారికి ప్రధాన మంత్రిగా అవకాశం వచ్చింది. ఈ దేశాన్ని విప్లవాత్మకంగా మార్చేంతటి శక్తి ఒక్క శాస్త్రికే ఉందని ఆయననే ఎన్నుకున్నారు.
అప్పటికే ఆయన ప్రధాన మంత్రిగా భాద్యతలు తీసుకునే సమయానికి దేశం అత్యంత దయనీయ స్థితిలో ఉంది. దేశంలో ఆహార కొరతతో తినడానికి తిండికూడా లేని రోజులవ్వి. కాని వీటికి బెదరకుండా గ్రీన్ రివల్యూషన్ పేరుతో వ్యవసాయంలో ఎంతో ప్రగతిని తీసుకువచ్చారు. ఈ దేశానికి నాయకుల కన్నా రైతులు, సైనికులే అవసరం అని "జై జవాన్ - జై కిసాన్" అంటూ నినదించారు. అప్పటివరకు దేశం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలెన్ని ఉన్నాఇవన్నీ లాల్ బహదూర్ శాస్త్రి తీర్చగలరని భారతీయులందరికి ఒక నమ్మకం, భరోసని కల్పించారు ఆయన పాలనతో..
ఒకసారి శత్రుదేశంతో యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధ సామగ్రి ఇతర అవసరాల కోసం డబ్బు అవసరం వచ్చింది(అప్పటికి మన దేశ ఆర్ధిక పరిస్తితి అంతంత మాత్రమే). ఇందుకోసం దేశమంతటా Funds అభ్యర్ధిస్తే ఎంతోమంది వేలరూపాయలలో దానాలు చేశారట. మన మహానటి సావిత్రి గారైతే తన నగలన్ని ఇచ్చేశారట..(ఒక గొప్ప నాయకుడి పిలుపుతోనే ఇది సాద్యం). తనవంతుగా ప్రతిరోజు ఒకపూట భోజనం ఖర్ఛుతో పాటు, తన జీతాన్ని కూడా దేశ రక్షణకై త్యాగం చేసిన మహానుబావుడు లాల్ బహదూర్ శాస్త్రి.. ఒక మంత్రి కనుసైగా చేస్తే లక్షల్లో డబ్బులు సమర్పించుకుంటారు అదే ఒక దేశ ప్రధానమంత్రి ఐతే..? కాని శాస్త్రి గారు ఒక్కరూపాయి కూడా అవినీతికి పాల్పడలేదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రూ.5000 లోన్ తీసుకుని ఒక కార్ కొనుక్కున్నారు(ప్రభుత్వ కారులో తిరగడం ఇష్టంలేక తన సొంత ఖర్చుతో వాడుకునె కార్ ఉండాలని). కాని ఆ లోన్ తీర్చకుండానే ప్రధానిగా ఉన్నప్పుడే ఆయన చనిపోయారు. ఆ బ్యాంక్ వారు లోన్ రికవరికై భార్య లలిత గారిని సంప్రదిస్తే ఆ మొత్తాన్ని చాలా నెలలు వాయిదా పద్దతులలో చెల్లించారట. ఇప్పటికి ఆ కార్ వారి కుటుంబీకుల వద్ద ఉంచుకున్నారట వారి జ్ఞాపకార్ధం. ఇలాంటి నిజాయితీ ఉదాహరణలు ఆయన జీవితంలో చాలానే ఉన్నాయి, నిజానికి ఆయన జీవితమే ఒక నిజాయితి.. ఆయన బ్రతికిన బ్రతుకే ఈ దేశానికి ఆదర్శం.