Contributed by Sai Kartheek
ఆ ప్రయాణం గురించి ఎలా చెప్పాలో అర్థం కావట్లే. ఎక్కడ్నుంచి మొదలెట్టాలి. ముగించే విషయం మీద మాత్రం మంచి పట్టుంది. మొదట ఆ ప్రాంతం గురించి చెప్పగానే ఓ మామూలు చోటు, అన్ని చొట్టుల్లాగే, అంత గొప్ప ఏముంది అని ఆలోచించలేదు, ఆ ప్రయత్నం కూడా లేదు. కానీ ఈ నగర కాలుష్యం నుండి దూరంగా, ఏడికైన పోవాలి, అని అనుకున్నాను.. నిజంగా ఏ ఊరు ఎక్కడ, ఏ జిల్లా, ఏ రాష్ట్రం, ఎంత సమయం, ఎంత దూరం అంతా వెతికి కనుక్కునే ఓపిక లేదు అప్పుడు. మనాలికి వెళ్ళాక తెలిసింది లడఖ్ ట్రిప్ అంటే ఓ చోటు కాదు, ఓ ప్రయాణం. మన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు గమ్యం అనే సినిమాలో రాసిన పాటలో ఉన్న సాహిత్యానికి అర్ధం అప్పుడు నాకర్ధం అయ్యింది, అదే అండి ' గమనమే నీ గమ్యమైతే బాట లోనే బ్రతుకు దొరుకు'. నాలుగు వందల అరవై కిలోమీటర్ల ప్రయణం ద్విచక్ర వాహనాలపై. మొదలైంది మా లడఖ్ ప్రయాణం. నడుపుతూ గంట అయ్యింది. చుట్టు చెట్లు అంత బానే ఉంది. సుమారు రెండు కొండలు దాటిన తరవాత అనుకుంటా, నా ముందు ఓ పెద్ద కొండ, కాదు కొండ కాదు ఓ పెద్ద పర్వతం. మట్టితో నిండి ఉంది. కొలిస్తే ఎంత దూరం పొడవో కూడా చెప్పలేను. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ పర్వతం అంచు చూసినప్పుడు మేఘం దాన్ని తాకుతూ, దాటుకు పోతుంది. ఎందుకో తెలీదు గుండె బరువెక్కింది. త్రివిక్రమ్ గారు చెప్పినట్టు ఎదైనా గొప్ప పని చేసినప్పుడు, లేదా పెద్ద తప్పు చేసినప్పుడు మాత్రమే అలా ఉంటది. చేతులు మెల్లగా వణకటం మొదలైనాయి. భయం వల్ల కాదు చలి వల్ల. ఊపిరతిత్తులకు ఎదో అడ్డువచ్చినట్టు చాలా ఇబ్బంది పడ్తుంది. ఏకాగ్రత అంతా రహదారి మీదే. ఇదే చదువులో చుపించితే rank వచ్చేది. అది వేరే విషయం లెండి ఇప్పుడు. దారంతా కొండలు, రకరకాల కొండలు, రాతి కొండలు,మట్టి కొండలు, ఇసుక కొండలు, మంచు కొండలు అబ్బో ఇంకా చాలా రకాలు. కుడివైపు కొండ ఉంటే ఎడమ వైపు లోతు, ఎడమ వైపు కొండ ఉంటే కుడి వైపు లోతు. Bike నడిపినంత సేపు shirt జేబు కాడ ఉండవలసిన గుండె jeans జేబు కాడకొచ్చింది. ఇవే ఎక్కువనుకుంటే దారి మధ్యలో నదులు, రహదారి పైనే. చేపలు, పాములు లేవు కానీ లోతు మోకాలి దాకా ఉంటాయి, అలాంటివి ఓ ఆరేడు ఉంటాయి. అన్ని దాటి పోతుంటే వాన. హ్మ్మ్ వాన అంటే మన హైదరబాద్లోని వానాల సురుక్ సూరుక్ అని పడి పోదు. ఎదో పగబట్టిందాన్లా పడితే ఆగదు. మంచు నీళ్ళు కదా చల్లగా సమ్మగా ఉంటది అనుకోండి, కానీ ఎక్కువ సేపు ఉంటే జలుబు జెలగ పట్టినట్టు పట్టుకుంటాది. ప్రయాణం మొత్తం రెండ్రోజులు, అంటే దారిలో ఎక్కడైనా ఒక చోట తల ముడుచుకోవలి. అది ఎక్కడైనా సరే. మంచు పర్వతాల మధ్యనే, అది కూడా ఎదో హోటల్ బంగ్లా అనుకునేరు, ఓ గుడిసెలో, గోడ తోడు లేని ఇటకలతో కట్టని ఓ పూరి గుడిసెలో. చీకటి కిటికీ తెరిసిన తరువాత, ఏమైందో తెలియదు. అందరికీ తలనొప్పి,జ్వరాలు చిట్టలింటికి వచ్చినట్టు వచ్చేశాయ్. కొలతేసే సామగ్రి లేదు గానీ, అనుభవించాము గనక చెప్తున్నాం సుమారు సున్నాను దాటి మైనస్సు లోకి పోయింది. సరే అన్ని ఇన్ని పడ్తున్నుణం, తిండి చక్కగుంటే బాగుండే అని అనుకునే లోపు, అక్కడ దొరికేవి కేవలం maggi, ఆమ్లెట్ , మోమో లు అది కూడా అన్ని చోట్ల కాదు. దొరికిందే తినాలి. అది తినే బతకాలి, బండి నడపాలి. కష్టాల, నష్టాల మధ్య ఎలాగో చేరం గమ్యానికి. ఉన్నటుండి మర్చిపోయా, దారిలో మట్టి తుఫాను కూడా పలకరించింది. కానీ అన్ని దాటి, తిరిగి మళ్లీ అదే దారిలో రావాలని తెలుసు. కానీ ఎదో ధైర్యం నిండింది గుండెలో. ఒక్క దెబ్బ కూడా తాకలే, లేదు తాకనివ్వలేదు. అక్కడ దొరికే స్వచ్ఛమైన నీరు లాగే మనుషులు కూడా. కోపం రాదే ఎవ్వరికీ ఎలా? కొండలు దాటుతూ దాటుతూ పోతుంటే ఎదో గట్టి సంబంధం ఉన్నట్టు, నా ఒక్కడికే కాదు ప్రతి మనిషికి. కళ్ళు మూసి చూస్తే, ఎదో చెప్తాయి అవి ప్రతి సారి, ఎదో పెద్ద రహస్యం అన్నట్టు. పోటీ పడాలి అనిపిస్తది వేగంతో వాటిని దాటుతూ. వాటిని వాటేసుకోవలనిపిస్తది ఎక్కుతూ. వాసన చూడాలనిపిస్తుంది గుండెతో, ఊపిరితిత్తులు మొత్తం నిండేల. మనసురాలేదు అప్పుడు వాటిని వదిలి రాడనికి. కానీ ఏం చేస్తాం. వీడ్కోలు తెలిపి తిరిగొచ్చేసా, మళ్లీ వస్తా అని చెప్పి. చాలా బలంగా, దృఢంగా నా రోజూ వారి పనుల్లో మళ్లీ నిమగ్నమయ్యా. కానీ అవే గుర్తొస్తున్నాయి. అడికే నన్ను రమ్మంటున్నయి. వెళ్తా మళ్లీ వెళ్తా.