All That You Need To Know About The Konaseema Temple That May Have Been Founded By Lord Narada Himself!

Updated on
All That You Need To Know About The Konaseema Temple That May Have Been Founded By Lord Narada Himself!

మన తెలుగురాష్ట్రాలలో పచ్చని ప్రకృతి రమనీయతకు చిరునామాగా ముందు వరుసలో అరకులోయ ఉంటే ఆ తర్వాతి స్థానం మన కోనసీమ ఉంటుంది. అందుకేనేమో అరకు తర్వాత కోనసీమలోనే ఎక్కువ సినిమా షూటింగ్స్ జరుగుతాయి.. ఇంకొంతమంది గోదావరి జిల్లా వాసులైతే తమ కోనసీమ భూతల స్వర్గం అంటూ ఆ ప్రాంతంపై వారికున్న మమకారాన్ని చాటుకుంటారు. కోనసీమ అంటే కొబ్బరిచెట్లు, గోదావరి తీరం, కల్మషం లేని ప్రేమనిండిన మనుషులు మాత్రమే కాదు పుణ్య దేవాలయానికి కూడా నిలయం ఆ గొప్ప దేవాలయమే కోనసీమ తిరుపతిగా పిలుచుకునే వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ గుడి రాజమండ్రి నుండి దాదాపు 40కిలోమీటర్ల దూరంలో ఉంది.

img_64756832305908
maxresdefault

కేవలం దేవాలయంలో మాత్రమే కాదు ఆ దేవాలయానికి చేరుకునే మార్గం కూడా మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఈ దేవాలయం 300 ఏళ్ళకు పైగా పురాతనమైనది కాని ఇక్కడ వెలసిన స్వామి వారు వేల సంవత్సరాల క్రితమే వెలిశారని చరిత్ర. వేల సంవత్సరాల క్రితం లోక కళ్యానార్ధం నైమిశారణ్యంలో సత్రయాగం జరిపారు.. ఈ యాగాన్ని పరిసమాప్తి చేయడానికి రక్తచందన వృక్షంలోని కొంత భాగాన్ని స్వామి ఆకారంలా తీర్చిదిద్ది యాగాన్ని ముగించారు. ఆ తర్వాత దానిని ఒక జీవనదిలో విడిచిపెట్టారు. అది అలా ప్రయాణిస్తూ వాడపల్లిలోకి చేరుకుందట. కొంతకాలానికి స్వామి వారు ఒక వృద్ద బ్రహ్మణుడి కలలో కనిపించి కృష్ణగరుడ వాలిన చోట వెతికితే చందన పేటిక దొరుకుతుందని అందులో ఉన్న నన్ను వెలికితీసి దేవాలయాన్ని నిర్మించండి అని స్వప్నంలో తెలిపారు. ఆ తర్వాత కృష్ణగరుడ ఉన్న ప్రాంతంలో వెతకగా ఆ చందనపేటికలో శంఖు, చక్ర, గదలతో స్వామి వారి దర్శనం కలిగింది.

25_big
tbetbe

ప్రజలు మహదానందంతో ఉన్న ఆ ప్రదేశానికి మహర్షులతో పాటు నారద మహర్షి కూడా చేరుకుని ధర్మాన్ని పరిరక్షించడానికి స్వామి వారు ఇలా అవతరించారని అక్కడివారికి తెలియజేసి సాక్షాత్తు నారద మహర్షుల వారే స్వామివారిని ఇక్కడ ప్రతిష్టించారని పురాణ గాధ. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజు వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతాయి. కేవలం గోదావరి జిల్లాల భక్తులు మాత్రమే కాకుండా తెలుగురాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తారు. ఏటా జరిగే బ్రహ్మోత్సవాలతోపాటు నిత్యం వేలాదిమంది భక్తులు దర్శిస్తుంటారు. ఇక్కడున్న మరో ప్రత్యేకత వరుసగా ఏడు శనివారాల పాటు ఈ స్వయంభూ వేంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తే కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

maxresdefault-2
rer

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.