"మా ఫ్రెండ్ కి పెద్ద యాక్సిడెంట్ జరిగింది, అదృష్టవంతుడు దగ్గర్లో గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోవడం వల్ల బతికిపోయాడు". ఇది ఓ రైటర్ పేల్చిన జోక్, ఇది వాస్తవం. గవర్నమెంట్ హాస్పిటల్ లోని డాక్టర్ కూడా తమవారి ట్రీట్మెంట్ కోసం చచ్చిన వారు చేస్తున్న చోటుకి తీసుకురారు. ఎందుకంటే పేషంట్స్ కంటే ఎక్కువ సమయం హాస్పిటల్ లో వారే గడుపుతారు కదా.. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మార్పులకు మొదటి ఉదాహరణగా నిలుస్తుంది.
ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలంటే ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు చుస్తే సరిపోతుంది.. తెలంగాణ ప్రభుత్వం సొంత రాష్ట్ర ఆవిర్భావం తరువాత ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుంది. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి అందంగా, పరిశుభ్రంగా మాత్రమే కాదు సర్వీస్ విషయంలోనూ ఉన్నతస్థాయి ప్రమాణాలను పాటిస్తోంది. ఇంతకు ముందు డాక్టర్లు, నర్సులు లేక ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితుల నుండి 60 నుండి 100 వరకు స్పెషలిస్ట్ లను నియమించబోతున్నారు. 90 మంది ఉన్న నర్సుల నుండి మరో 50 మందిని నియమించి 140కు విస్తరించనున్నారు.
ఎక్కువమందిని నియమించడం మూలంగా డాక్టర్లకు, నర్సులకు మొదలైన ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తగ్గి పేషంట్స్ కు ఆత్మీయతతో కూడిన ట్రీట్మెంట్ ను అందించవచ్చు. టెస్ట్ ల కోసం ఇక్కడ డయగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే అవసరం మైతే ప్ర్తెవేట్ సెంటర్లో సైతం ప్రభుత్వ ఖర్చులతో టెస్ట్ లు చేయిస్తున్నారు. ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాయకుల చొరవ గురుంచి ఖమ్మం జిల్లా నుండి ఎన్నికైన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారు, ఎమ్.ఎల్.ఏ పువ్వాడ అజయ్ కుమార్ గారు, మరియు కలెక్టర్ లోకేష్ కుమార్ గారి ప్రత్యేక కృషితో అద్భుతమైన మార్పులు సంభవిస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో కూలి పనిచేసే సోదరులు కూడా పుట్టబోయే బిడ్డ, తల్లి భద్రత కోసం ప్ర్తెవేట్ హాస్పిటల్స్ లో చేరుతున్నారు, మిగిలిన అనారోగ్య కారణాల కన్నా గర్భం సమయంలో ఎక్కువ జాగ్రత్తలు పాటిస్తారు. ఖమ్మం హాస్పిటల్ లో ప్రతి నెల 800 కాన్పులు జరుగుతున్నాయి ఇదొక్క ఉదాహరణ చాలదా వారికి ఏ స్థాయిలో నమ్మకం పెరిగిందోనని. అన్ని బ్లాకులు, డిపార్ట్మెంట్లు కంప్యూటరీకరణ జరిగాయి. ప్రత్యేక ఐ.సి.యూ, ఆపరేషన్ థియేటర్లు, మాతా శిశు కేంద్రం 250 బెడ్స్ తో అత్యంత ఆధునికరణతో మార్పులు చేశారు. ఓ ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కు పేషేంట్స్ చూడడానికి వస్తే బంధువులు కూడా భయం భయంగా ఉండేవారు వీళ్ళ రోగాలు మాకెక్కడ వస్తాయో అని కాని ఖమ్మంలో ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. గర్వంగా మరి ముఖ్యంగా ఇక నుండి అనవసరంగా ప్ర్తెవేట్ హాస్పిటల్స్ లో మోసానికి గురి అయ్యాము ఇక నుండి ఇక్కడికే రావాలని నిర్ణయించేసుకున్నారు.
ప్రశాంతమైన చెట్లతో కూడిన పచ్చని వాతావరణం, పేషంట్ల బంధువుల కోసం క్యాంటీన్, షెల్టర్ గదులు, లగేజ్ భద్రత కోసం లాకర్లు, చిల్డ్రన్ పార్క్, డయాలసిస్, ఎమర్జన్సీ సర్వీస్, 100 పడకలతో ప్రత్యేక ట్రామా కేర్ సెంటర్, అన్నిటి కంటే ముఖ్యంగా ప్రతిరోజూ 2,000 ఔట్ పేషంట్స్ తో ఖమ్మం హాస్పిటల్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఉత్తమ హాస్పిటల్ గా వెలుగుగొందుతూ భారతదేశమంతటికి ఒక రోల్ మోడల్ గా నిలుస్తుంది.