The Mantra At The End Of 'Khaleja' Has A Deep Meaning, Here's What It Means

Updated on
The Mantra At The End Of 'Khaleja' Has A Deep Meaning, Here's What It Means

ఖలేజా, ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా సార్లు మాట్లాడుకున్నాం. దైవత్వానికి త్రివిక్రమ్ గారు ఇచ్చిన నిర్వచనం ఈ సినిమా. మహేష్ బాబు ని అంతకుముందు కానీ ఆ తరువాత కానీ, ఈ సినిమాలో లా చూడలేదు. అందుకే ఈ సినిమా మనకు అంత ప్రత్యేకం. ఈ సినిమాలో చాలా మంచి సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయి.

అన్నిటికన్నా క్లైమాక్స్ లో రావురమేష్ అప్పుడే పుట్టిన పసిపాప చూపిస్తూ "ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం" అన్న తరువాత సినిమాని ముగిస్తూ ఒక మంత్రం వస్తుంది. ఆ మంత్రం లో ఈ సినిమా అర్ధం మొత్తం దాగుంది.

పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదద్యతే | పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాతిష్యతే || ఓం శాంతి :శాంతి : శాంతి :

ప్రతి పదార్థం: అద: - అది పూర్ణం - అనంతం ఇదం - ఇది పూర్ణం - అనంతమైనది పూర్ణాత్ - అనంతనుంచి (కంటికి కనిపించని ఈ అనంతం నుంచి) పూర్ణం - అనంతం (గోచర ప్రపంచమంతా) ఉదచ్యతే - ఉద్భవిస్తోంది పూర్ణస్యపూర్ణమాదాయ - అనంతం నుంచి అనంతం తీసివేస్తే పూర్ణ ఏవ - అనంతమే అవతిష్యతే - మిగిలి వుంటుంది ఓం - ఓం శాంతి: - శాంతి

ఈ మంత్రం "ఈశావాస్యోపనిషత్తు" అనే ఉపనిషత్తు కి మూల మంత్రం. ఈశావాస్యోపనిషత్తు గురించి మరింత తెలుసుకోవడానికి click here.

భావం: ఆ దేవుడు పరిపూర్ణుడు, ఆయనచే సృష్టింపబడిన ఈ లోకం పరిపూర్ణమయినది. కావున పూర్ణంతో ఇంకో పూర్ణాన్ని కలిపినా, వేరుచేసిన, గుణించిన, పూర్ణమే మిగులుతుంది. అలా ఈ ప్రపంచమంతా భగవంతుడి స్వరూపమే అని ఉపనిష్యత్తు లో ని ఆ శ్లోకం అర్ధం. వేదమంత్రాలన్నీ ఓం శాంతిః అంటూ ముగుస్తాయి. మూడు సార్లు శాంతి అని ఎందుకు ముగుస్తాయంటే నిత్యజీవితములోని మూడు ఆటంకాల నుండి బయటపడటానికి. ఆ మూడు ఏమంటే 1.ఆద్యాత్మికం: శారీరక, మానసిక అనారోగ్యాలు మొదలగునవి 2.ఆదిభౌతికం: ఇతర జీవరాసులవలన, ఇతర మానవులవలన కలుగు బాధలు 3.ఆధిదైవికం: ప్రకృతి వలన అంటే వరదలు, భూకంపాలు, పిడుగులు, అగ్ని ప్రమాదాలు మొదలగునవి. ఈ మూడు రకాలైన బాధల నుండి తప్పించుకోవడానికి మూడు సార్లు శాంతి అని పలుకుతాము.

శూన్యం లో ఏం లేదు అని కొందరు అనుకుంటారు. మొత్తం శూన్యం లోనే దాగుంది అని కొందరు అనుకుంటారు. ఎవరు దృక్పథం వాళ్ళది. ఈ సినిమాలో కూడా సీతారామరాజు point of view లో తను nothing. పాలి ప్రజల point of view లో he is everything అనంతం,పరిపూర్ణుడు, దేవుడు. అలా ఆ రెండు point of views ని చాలా చక్కగా చెప్పే మంత్రం ఇది.

Khaleja