All You Need To Know About The Famous Keesaragutta Shiva Temple!

Updated on
All You Need To Know About The Famous Keesaragutta Shiva Temple!

మన హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్న అతి గొప్ప దేవాలయాలలో కీసరగుట్ట కూడా ఒకటి. హైదరాబాద్ నుండి సుమారు 40కిలోమీటర్ల దూరంలో ఈ కోవెల కొలువై ఉంది. ఈ దేవాలయంలో పరమశివుడు శ్రీ రామ లింగేశ్వరస్వామిగా పూజలందుకుంటున్నారు. ఏ గుడినైనా ఆ ప్రాంతం పేరుతోనే పిలుస్తుంటాం, దేవాలయం గుట్ట మీద ఉండడంతో దీనిని మొదట కేసరిగిరి అని ఆ తర్వాత కీసరగుట్టగా పిలవడం జరుగుతుంది. ఈ కీసర ప్రదేశం అటు ఆధ్యాత్మికంగా ఇటు చారిత్రకంగా కూడా గొప్ప ప్రదేశం. చారిత్రకంగా ఐతే 4వ శతాబ్ధం నుండి 7 వరకు విష్ణుకుండిన రాజ్యానికి చెందిన సైనిక స్థావరాలను ఇక్కడే ఏర్పాటుచేసేవారని చరిత్రకారులు చెబుతారు. ఇక్కడికి కేవలం దైవదర్శనం కోసం అని మాత్రమే కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో అలా మమేకం అవ్వడం కోసం కూడా భక్తులు దర్శిస్తారు.

1958326_1414758695438282_1843063195_n
Temple_at_Keesaragutta,_AP_W_IMG_9127
1901129_1414756882105130_1450089114_n
Keesara_Gutta_Temple_Hyderabad_1222

ఆలయ చరిత్ర ప్రకారం త్రేతాయుగంలో సీతమ్మను ఎత్తుకెళ్ళిన రావణుడిని భీకర యుద్ధం తర్వాత శ్రీరాముడు వదించడం జరిగింది. రావణుడిని చంపినందుకు శ్రీరాముడికి బ్రహ్మహత్య పాపం చుట్టుకునే అవకాశం ఉందని మహార్షులు వివరించిన తర్వాత శ్రీరాముడు శివలింగాలను వివిధ ప్రాంతాలలో ప్రతిష్టిస్తూ ఉంటారు. ఒక సందర్భంలో కీసరకు సీత, శ్రీరాముడు, లక్ష్మణ, ఆంజనేయస్వామి వారు వచ్చారు. ఇక్కడి ప్రకృతి రమణీయతకు పరవశించిన శ్రీరాముడు ఇక్కడ కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్టించాలని తపించారు. వెంటనే శ్రీరాముడు ఆంజనేయ స్వామి వారిని కాశికి వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని ఆదేశించారు.

16730301_1275596189187404_2183795070463913575_n
dvtwaa
14721733_1137406356341700_2492818486381904350_n
14718666_1137406129675056_6085268081283670988_n

కాశికి వెళ్ళిన హనుమంతుడు శివుడి అనుగ్రహం ద్వారా 101లింగాలను తీసుకున్నాడు. ఐతే ఇక్కడ లింగాన్ని ప్రతిష్టించడానికి ముహుర్తం దాటిపోవడంతో శ్రీరాముడు పరమశివుడిని లింగం కోసం ప్రార్ధిస్తాడు. సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమై అక్కడికక్కడే లింగంగా మారిపోతాడు. ఆ శివలింగాన్నే శ్రీరాముడు ఇక్కడ ప్రతిష్టించారని చారిత్రక కథనం. శివలింగ ప్రతిష్టాపన జరిగిన తర్వాత 101 శివలింగాలతో ఇక్కడికి చేరుకున్న హనుమంతుడు విషయం తెలుసుకుని తన తోకతో 101 శివలింగాలను విసిరేశారట ఆ లింగాలే ఈ ప్రాంతంలో అక్కడక్కడ పడ్డాయని, ఆ లింగాలను ఇప్పటికి ఈ ప్రాంతంలో దర్శించుకుంటారు భక్తులు. తాను తీసుకువచ్చిన లింగాలు నిరూపయోగంగా మారాయని బాధపడుతున్న హనుమంతుడిని శ్రీరాముడు ఓదారుస్తూ ఈ క్షేత్రం నీ పేరు మీదుగానే "కేసరి గిరి" గా మారుతుందని చెప్పారట. ఇక్కడికి కేవలం కొన్ని ప్రత్యేకమైన పండుగలలో అని మాత్రమే కాకుండా ప్రతి సెలవు రోజులలో కూడా వేల సంఖ్యలో భక్తులు దర్శిస్తారు. మహాశివరాత్రికి మాత్రం ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కార్తీకమాసం, శ్రావణమాసం, దేవి శరన్నవరాత్రులు కూడా కన్నుల పండుగగా జరుగుతాయి.

14595777_1137406063008396_1759114958149140647_n
14102581_564717073715125_4857140353442396758_n
10981866_830958203612965_8667968171371592479_n
10407871_10202731850589941_3456806948044206225_n