ఉదాహరణకు శివ సినిమాలో సైకిల్ చైన్, మగధీర లో రెండు చేతులు తాకుతున్నప్పుడు మెరిసే మెరుపు, ఎవడే సుబ్రమణ్యంలో బూస్ట్ బాక్స్.. ఇలా ప్రతీ సినిమాలో ఒక్క ప్రాపర్టీ, ఒక్క సంఘటన సినిమా అంతటిని మళ్ళీ గుర్తు చేస్తుంది.. కరీం కు ఇలాంటి ప్రాపర్టీస్, సంఘటనలతో కూడిన ఒక డిజైన్ చేసి సినిమా గొప్పతనాన్ని మరింత లోతుగా విశ్లేషించడమంటే మహా ఇష్టం. రైటర్ అక్షరాల రూపంలో వివరిస్తే మినిమల్ డిజైనర్ ఇదిగో ఇలా explain చేస్తుంటారు. తిరుపతి మదనపల్లికి చెందిన కరీం మిగిలిన డిజైనర్స్ కన్నా చాలా భిన్నం ఎందుకో తెలుసుకుందాం..
ఎందుకు మిగిలిన వారికన్నా కరీం భిన్నం: ఇప్పుడు క్రింద మీరు చూడబోతున్న రంగస్థలం మినిమల్ ను ఒక్కసారి తీక్షణంగా పరిశీలిస్తే 'రంగస్థలం సినిమా అంతా వార్మ్ కలర్స్ ఎక్కువ యూజ్ చేశారు. ఊరిని మోసం చేసినందుకు, అన్నను చంపినందుకు రివేంజ్ తీసుకునే లైన్ తో రంగస్థలం సినిమా సాగుతుంది. కనుక వార్మ్ కలర్స్ ఎక్కువ యూజ్ చేశారు, అలాగే ఈ నగరానికి ఏమయింది సినిమా అంతా ఎల్లో, బ్లూ కలర్స్ ఎక్కువ వాడారు.. ఇలా సినిమాలో కథకు అనుగూణమైన రంగులు ఎలా ఉపయోగించుకున్నారో కథను విశ్లేషించే మినిమల్స్ లోనూ అదే కలర్స్ వాడి కథ కోసం అలాంటి జాగ్రత్తలే తీసుకున్నాడు'.
కరీం కథను వివరించే శైలి: ఒక్కసారి కరీం వేసిన పెళ్లిచూపులు మినిమల్ ను చూడండి. 'టూ బ్రోకెన్ హార్ట్స్ కనిపిస్తాయి. ఒక హార్ట్ విజయ్, తన నేచర్ అంతా ఆ హార్ట్ లో ఉంటుంది. వంట చేస్తుంటాడు, తిరుగుతాడు, తాగుతుంటాడు. మరొక బ్రోకెన్ హార్ట్ వచ్చేసి రీతూ. సినిమాలో రీతూ చాలా డెడికేటెడ్, ఎప్పుడు తనకాళ్ళ మీద తను బ్రతకాలి, పైకెదగాలి డబ్బు సంపాదించాలి ఇలా ఉంటుంది తన మనస్తత్వం. ఇద్దరూ ప్రేమలో అంతకు ముందు విఫలం అయ్యారు. ఈ బ్రోకెన్ హార్ట్స్ రెండింటిని కలిపేది ఫుడ్ ట్రక్. వీరిద్దరి బ్రోకెన్ హార్ట్స్ కు బ్యాండేజ్ లాంటిది ఆ ఫుడ్ ట్రక్. అందుకే ఆ రెండు బ్రోకెన్ హార్ట్స్ మధ్యలో బ్యాండేజ్ లా ఫుడ్ ట్రక్ పెట్టారు.. అలా కథను వివరించడం జరిగింది. కరీం నాన్న గారు సివిల్ ఇంజినీర్. తన కొడుకు కూడా ఇంజినీర్ ఐతే చూడాలని తన కోరిక. కరీం ముందుగానే "నాకు బీటెక్ ఇష్టం లేదు అని చెప్పినా గాని జాయిన్ చేయించారు. ఒక సంవత్సరం తరువాత వీడికి నిజంగానే బీటెక్ ఇష్టం లేదు, పూర్తిచేయ్యలేడు అని కరీం కు నచ్చిన కోర్స్ లోనే జాయిన్ చేయించారు". ప్రస్తుతం విజువల్ మీడియాలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. ఒక షార్ట్ ఫిల్మ్ తీసి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డు తీసుకున్నాక నాన్నకు కూడా కరీం మీద నమ్మకం పెరిగింది. చూద్దాం.. ఇంత మంచి మినిమల్స్ డిజైన్ చేసిన కరీం ఫ్యూచర్ లో ఇంకెంత గొప్ప సినిమాలు తీయబోతున్నాడో.. కరీం మినిమల్ డిజైనర్, రైటర్ డైరెక్టర్ మాత్రమే కాదు మంచి ఆర్టిస్ట్ కూడా. మినిమల్స్ తో పాటుగా తను గీసిన బొమ్మలు కూడా చూడండి.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
22.