Everything You Need To Know About The Most Graceful Actress In Telugu Cinema!

Updated on
Everything You Need To Know About The Most Graceful Actress In Telugu Cinema!

మొదట మన తెలుగులో వాణిశ్రీ గారే అన్ని రకాల పాత్రలు చేసిన నటిమణిగా కీర్తిపొందింది.. ఇటు దసరా బుల్లోడు లో పల్లెటూరు అమాయిక అమ్మాయిలా, జీవిన జ్యోతిలో మతిస్థిమితం లేని మహిళగా, గోరంత దీపంలో విధవరాలిగా, చిరంజీవి లాంటి మెగాస్టార్ కు ధీటైన ప్రతినాయకురాలిగా, సీతారత్నం గారి అబ్బాయి సినిమాలో భావావేశం ఉన్న కన్న తల్లిగా ఇలా అన్ని రకాల పాత్రలలో ఎన్నో అవార్ఢులను ప్రేక్షకుల నుండి రివార్ఢులను అందుకున్నారు. అగస్టు 3 1948లో నెల్లూరులో జన్మించిన వాణిశ్రీ బంగారు పంజరం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇప్పటికి తెలుగు, తమిళ, కన్నడ, మళయాలి, హిందీ ఇలా ఎన్నో బాషాలలో నటించారు. భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు శ్యాం బెనగల్ తెలుగులో తీసిన అనుగ్రహం సినిమాతో వాణిశ్రీ ఇంత గొప్పగా నటించగలదా అని విమర్శకుల ప్రశంసలందుకున్నారు. వాణిశ్రీ భరతనాట్యం అద్భుతంగా నర్తించగలదు ఆ నాట్య ప్రదర్శనను చూసిన కన్నడ డైరెక్టర్‌ హుణుసూరు కృష్ణమూర్తి "నాది ఆడ జన్మ"(కన్నడ) సినిమా ద్వారా అవకాశం కల్పించారు. తనలో ఉన్న గొప్ప లక్షణం పాత్ర నచ్చితే రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించడం. అలా ఎన్నో సినిమాల విషయంలో పారితోషకం తక్కువైనా చేశారు.. ఈ జనరేషన్ లో అల్లు అర్జున్‌ డాన్స్‌ ,రవితేజ, సిద్ధార్థ, మహేశ్‌బాబు నటనను అభిమానిస్తున్న కళాభినేత్రి వాణిశ్రీ గారికి జన్మదిన శుభాకాంక్షలు..

1. Jeevana Jyothi

jeevana jyothi

2. Aaradhana

aaradhana

3. Prem Nagar

Prem Nagar

4. Evandi Aavidocchindi

hqdefault (1)

5. Gorantha Deepam

gorantha deepam

6. Atthaku Yamudu Ammayiki Mogudu

athaku yamudu