Presenting "Kaalam Cheppina Katha" Episode 7 - Chandrayan 1!

Updated on
Presenting "Kaalam Cheppina Katha" Episode 7 - Chandrayan 1!

రాత్రి 9:30 నిమిషాలకు పద్మజ గారి పెరట్లో..

బబ్లూ: అమ్మ ఆకాశం లో ఎన్ని నక్షత్రాలు వుంటాయి.. అమ్మ: మనుషులకు ఉన్న ఆశలన్నీ.. బబ్లూ: ఏంటి??? అమ్మ: మనము లెక్కబెట్టలేని అన్ని వుంటాయి.

బబ్లూ: అన్ని నక్షత్రాలు ఎలా వున్నాయి ఆకాశం లో.. ఎందుకు రాత్రి మాత్రమే వస్తాయి.. ఉదయం ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి??? అమ్మ: వాటికి సూర్యుడు అంటే భయం అందుకే ఉదయం వెళ్ళిపోతాయి.. మళ్ళి సూర్యుడు వెళ్ళిపోయాక వస్తాయి. బబ్లూ: ఓహో.. మరి చంద్రుడు అంటే భయం లేదా?? అమ్మ: చంద్రుడు అవి బెస్ట్ ఫ్రెండ్స్ అందుకే భయపడవు బబ్లూ: అవునా.. చంద్రుడిలో కుందేలు కనిపిస్తుంది.. అక్కడికి ఎలా వెళ్ళింది?? అమ్మ: (నవ్వుకుంటూ) అది కుందేలు కాదు.. అక్కడ వుండే కొండలు, కుందేలు లాగ కనిపిస్తున్నాయి.. బబ్లూ: చంద్రుడు మీద కొండలు ఉంటాయా?? అంటే అక్కడ కూడా మనుషులు వుంటారా?? అమ్మ: మనుషులు ఉండరు కాని కొండలు నీళ్ళు ఇసుక ఇవన్నీ వుంటాయి.. బబ్లూ: నువ్వు అక్కడికి వెళ్ళవా?? అమ్మ: లేదే..

బబ్లూ: మరి నీకెలా తెలుసు అవన్నీ ఉంటాయని. అమ్మ: అక్కడికి ఇంత వరకు ఒకే ఒక్క మనిషి వెళ్ళాడు అది కూడా నిజమో కాదో ఎవరికీ తెలీదు అతని పేరు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్. బబ్లూ: అవునా.. ఎవరు వెళ్ళకపోతే అక్కడ అవన్నీ వున్నాయని నీకు ఎవరు చెప్పారు?? అమ్మ: మనుషులు ఎవ్వరు వెళ్ళలేదు కాని ఒక రాకెట్ లో satellite ని పంపించారు.. అది ఫోటులు తీసి మనకి పంపింది. బబ్లూ: అక్కడి వరకు వెళ్తుందా రాకెట్.. ఎవరు పంపించారు దానిని అక్కడికి? ఎప్పుడు పంపించారు? అమ్మ: మనమే భారతీయులం.. 2008 లో

భూప్రపంచం మీద మితి మీరి పెరుగుతున్న జనాభా శాస్త్రవేత్తలను కలవరపెడుతుంది. భూమి మీద వుండే వనరులు భవిష్యత్తు తరాలకు సరిపోవనే ఆలోచనే మరో స్థావరాన్ని వెతుక్కునేలా చేసింది, అదే చంద్ర మండలం. భూమికి దగ్గరగా వుండే గ్రహం.. అక్కడ మనవ మనుగడ సాగించవచ్చు లేదా అనే దాని మీద ఇప్పటికి ఇంకా ప్రయోగాలు జరుగుతూనే వున్నాయి. 1999 Indian ACADEMY OF SCIENCES లో ప్ర ప్రధమంగా చంద్రుడి మీద రహస్యాలను తెలుసుకోవాలనే ఆలోచన మొదలయ్యింది భారత్ కి. అప్పటికే 5 దేశాలు రష్యా, అమెరికా, యూరోప్, జపాన్, చైనా చంద్రుడి మీదకు satellite లను పంపి అక్కటి విశేషాలను ప్రపంచానికి తెలిపింది. అప్పటికే ఎన్నో విజయవంతమైన satellite లను అనుకున్న కక్షలలో పెట్టి వాటి నుండి ఎన్నో సేవలను ఉపయోగించుకుంటున్న భారత్, చంద్రుడి మీద రహస్యాలను తెలుసుకునే వేట లో పడింది. Indian ACADEMY OF SCIENCES ఆలోచన నిమ్మితం ISRO శాస్త్రవేత్తలు చంద్రమండలం మీదికి satellite ను పంపే పనుల్లో నిమగ్నం అయ్యారు.. ఎన్నో వ్యూహాలు ఎన్నో ఆలోచనలతో 2002 లో ఒక చివరి రిపోర్ట్ తయారు చేసారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఆ రిపోర్ట్ ని 2003 లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. నవంబర్ 23 2003 లో ప్రభుత్వం 386 కోట్ల రూపాయలని మంజూరు చేసింది.

ఈ మిషన్ కు చంద్రయాన్-1 అని నామకరణం చేసారు ఇస్రో. చంద్రయాన్-1తో ఇస్రో తెలుసుకోవాలనుకున్నది ముఖ్యంగా నాలుగు. 1) Presence of water, ice on polar areas of moon 2) Formation and Evolution of moon 3) Presence of minerals 4) Presence of Helium 3 (fuel used in nuclear reactions)

5 దేశాలు ఇది వరకే చంద్రుడు మిధ విశేషాలను తెలుసుకోవడానికి ప్రయోగాలు చేసారు కాని ఈ విశేషాలు ఎవరు తెలుసుకోలేక పోయారు.1000 శాస్త్రవేత్తల కృషి 400 ప్రభుత్వ ప్రైవేటు సంస్థల పని తనం ఎన్నో గొప్ప విశ్వ విద్యాలయాల ఆలోచనలు 5 సంవత్సరాల సమయంతో 2008 లో చంద్రయాన్-1 పూర్తి అయ్యింది. 22 October 2008 6:12 AM కి విజయవంతంగా చంద్రయాన్-1 ని ప్రయోగించారు ఇస్రో. చంద్రయాన్-1 లో పదకొండు payloads ని సమకూర్చారు. (payload-objects integrated inside a satellite which performs various operations to get the data as directed or programmed) అందులో 5 మన దేశానివి 6 బల్గేరియా, యూరోపే,అమెరికా,స్వీడన్,రష్యా దేశాలవి.అందులో మన payloads ఏంటంటే

1) TMC-Terrain Mapping Camera(Takes black and white pictures of Moons surface) 2) HySi-Hyper spectral Images(Takes color pictures of the moon surface by recording visible and infra red light) 3) HEX-High Energy X Ray spectrometer(It senses the emission of X rays by heavy elements that are radio active) 4) LCRI-Lunar Laser ranging instrument(To sense the reflected IR laser light) 5) MIP-Moon impact probe(The probe to explore moon at a close distance and test for the scope of future soft landing missions)

ఇక మిగిలిన 6 1) C1XS-Chandrayaan-1 Imaging X Ray Spectrometer 2) SIR-Smart near infrared spectrometer 3) SARA-Sub kilo-volt Atom reflecting analysis 4) Mini SAR-Mini synthetic aperture RADAR 5) M3-Moon Mineralogy Mapper 6) RADOM-radiation Dose Monitor

ఇలా ఇంకో 6 payloads ని చంద్రుడి మీద ఎలాంటి minerals దొరుకుతాయి చంద్రుడి మీద వుండే sub atoms గురించి తెలుసుకోవడానికి ప్రయోగించారు.

చంద్రయాన్-1 మొత్తం 3.87 లక్షల కిలోమీటర్ల ప్రయాణించి 312 రోజులు చంద్రుడు చుట్టూ 3400 సార్లు తిరిగి అంతరిక్షంలో కలిగే రేడియేషన్ కారణంగా విద్యుత్ ఉత్పత్తికరణ ఫెయిల్ అవ్వడంతో august 2009 లో చంద్రయాన్-1 ని అధికారికంగా abort చేశారు. ఒక సంవత్సరం గడువులో 70000 ఫోటోలను పంపింది చంద్రయాన్-1. చంద్రయాన్-1 మిషన్ తో ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి శాస్త్రవేత్తలకు. ఈ మిషన్ తో భారతదేశం అంతరిక్ష ప్రయోగాలలో మరో మెట్టు పైకి ఎక్కింది. చంద్రయాన్-1 స్పూర్తి తో చంద్రయాన్-2 ని రూపు దిద్దుతుంది ఇస్రో. సాంకేతిక విజ్ఞానం లో మనం ఎప్పుడు తీసిపోము అని నిరూపించుకుంటుంది భారత్.