బబ్లూ: అమ్మ.. నాన్న ఏంటి ఇంకా రాలేదు.. ఈరోజు సినిమాకి వెళ్తున్నాం అని తెల్సు కదా.. అమ్మ: ఆఫీసులో ఆలస్యం అయ్యుండొచ్చు.. లేదా ట్రాఫిక్ లో ఉండుంటారు.. అయిన సినిమాకి ఇంకా చాలా టైం వుంది కదా.. ఎందుకు తొందర.. బబ్లూ: నాన్న ఆఫీసు నుంచి వచ్చి రెడీ అయ్యి మళ్ళి మనం ట్రాఫిక్ లో థియేటర్ దగ్గరికి వెళ్ళేలోపు సగం సినిమా అయిపోతుంది.. ఇంకెందుకు మనం సినిమాకి వెళ్ళడం.
అమ్మ: ఒక 10 minutes వెయిట్ చెయ్యి.. అప్పటికి రాకపోతే అప్పుడు ఫోన్ చేద్దాం. బబ్లూ: అంత సేపు వెయిట్ చేయడం నా వల్ల కాదు.. నేను ఇప్పుడే ఫోన్ చేస్తా, ఫోన్ ఇవ్వు నువ్వు. అమ్మ: చెప్తే వినవు కదా.. అక్కడ బెడ్ రూమ్ లో ఛార్జింగ్ లో వుంటుంది.. నువ్వే వెళ్ళి తెచ్చుకొని ఫోన్ చేస్కో. బబ్లూ: నేనే చేస్తా..
(నాలుగైదు సార్లు ఫోన్ చేసినప్పటికీ నాన్న ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చిరాకుతో..)
బబ్లూ: నాన్న ఎప్పడు ఇంతే.. ఎప్పుడు ఆఫీస్ వర్క్ అంటాడు.. నాన్నే గా సినిమాకి వెళ్దాం అన్నాడు.. నేనేమన్నా అడిగానా.. అంతా రెడీ అయ్యాక ఇప్పుడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు.. నేను ఇక సినిమాకి రాను ఎక్కడికి రాను.. అసలు నాన్నతో మాట్లాడను ఇంకా.!
అమ్మ: డ్రైవింగ్ లో వున్నాడేమో లె.. నాన్న ఎప్పుడు చెప్తుంటాడు కదా.. డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ పని చేయకూడదని.. అందుకే ఫోన్ లిఫ్ట్ చేసుండడు. బబ్లూ: ఏం కాదు.. నాన్న ఇంకా ఆఫీసులోనే వున్నాడు.. నాకు తెలుసు.. ఇంటికి వచ్చి మీటింగ్ లో వున్నా next వీక్ ఖచ్చితంగా వెళ్దాం అని చెప్తాడు.. లేట్ గా వచ్చినందుకు మళ్ళి నాకొక chocolate ఇస్తాడు.. ఎప్పుడు ఇలాగే చేస్తాడు నాన్న.
అమ్మ: జానెడంత లేవు నీకు కూడా అంత కోపమా. బబ్లూ: నాన్న రాకపోతే నన్ను ఎందుకు అంటావు.. ఇప్పుడు నాన్న వచ్చినా నేను రాను సినిమా కి.. నేను నా రూమ్ కి వెళ్ళిపోతున్న టాటా..
బబ్లూ: అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటూ తన పనిలో నిమగ్నం అయ్యింది అమ్మ.. ఇంతలో తన ఫోన్ రింగ్ అయ్యింది.. ఎవరా అని చుస్తే బబ్లూ నాన్నగారు.. అమ్మ: ఏంటండి.. సినిమాకి అన్నారు.. త్వరగా రాలేరా.. అంత పని ఉన్నప్పుడు కొంచెం ముందన్నా చెప్పచ్చు కదా.. వాడు ఇంత సేపు నాతో అరిచి, అలిగి ఇక సినిమాకి రాను అని వెళ్ళిపోయాడు. ఇంతకి ఎక్కడ వున్నారు?? అసలు బయల్దేరారా, లేదా?? నాన్న: బయల్దేరాను.. కాని దారిలో చిన్న accident అయ్యింది.. ఇంటికి రావడానికి కొంచెం లేట్ అవుతుంది.
అమ్మ: ఏంటి accident ఆ?? మీకు ఏమైనా అయ్యిందా?? దెబ్బలు తగిలాయా?? అసలు ఎక్కడున్నారు?? హాస్పిటల్ లోనా?? నాన్న: కాదు.. నాకు ఏమి కాలేదు.. అమ్మ: మరి accident అన్నారు?? ఏమి కాలేదు అంటున్నారు.. నాన్న: అబ్బా.. కొద్ది సేపు నీ interrogation ఆపుతావా.. నాకు ఏమి కాలేదు.. మన కారు కే చిన్న గీతాలు పడ్డాయి అంతే.. show room లో ఉన్నా, ఇంటికి వచ్చాక చెప్తా ఏమైందో.. నువ్వు కంగారు పడకు.. నాకేమి కాలేదు లే.
ఒక గంట తర్వాత ఇంటి బెల్లు మోగింది.. ఏమైందో అని కంగారు పడుతున్న ఇంటి ఆవిడకి ప్రాణం లేచి వచినట్లయ్యింది.. ఆడది కదా ఇంట్లో ఎవరి సమస్య అయిన తన సమస్యే అని భయపడుతుంది పిచ్చిది.. పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ తీసిన వెంటనే.. నాన్న: hello my dear wife.. how is life (అని నవ్వుకుంటూ లోపలికి వచ్చాడు) అమ్మ:(కంట్లో కన్నీరుతో) మీకు ఏమి కాలేదు కదా?? నాన్న: ఒసిని.. ఏమి కాలేదు అని ఫోన్ లో చెప్పా కదా.. మళ్ళి ఆ ఏడుపు ఏంటి?? అమ్మ: ఫోన్ చేశారూ.. accident అని చెప్పారు ఇంకా ఏమి చెప్పలేదు.. మీకు ఏమైందో తెలీదు.. ఇక ఏం చెయ్యను.. నాన్న: ఓయ్.. నాకేం కాలేదు.. కారు కి చిన్న గీతాలు పడ్డాయి అని చెప్పా కదా.. అమ్మ: ఏమో నేను కంగారు పడతానని అల చెప్పారేమో అనుకున్న.. నాన్న: లేదు.. నాకు ఏమి కాలేదు. ఇంతకి మన పుత్ర రత్నం ఎక్కడ?? అమ్మ: వాడు అలిగాడు.. సినిమాకి తీసుకెళ్తా అని టైం కి రాలేదని.. నాన్న: అందుకే గా వాడి కోసం ఈ సారి ice cream తీసుకొచ్చా.. ఆగు నేను పిలుస్తా వాడిని.. బబ్లూ.. బబ్లూ.. నీకోసం ఒకటి తీసుకొచ్చా.. ఒకసారి బయటికి రా.. బబ్లూ:(గది లో నుంచి గట్టిగా) నేను రాను.. నువ్వు ఎం తెచ్చావో నాకు తెలుసు చాక్లెట్ కదా.. నాకు వద్దు నేను రాను నాన్న: చాక్లెట్ కాదు.. నువ్వే వచ్చి చూడు కావాలంటే బబ్లూ: ముందు ఏంటో చెప్పు అప్పుడు వస్తా. నాన్న: ice creammm బబ్లూ: ice cream ఆ వస్తున్నా..
నాన్న:(అమ్మ తో) వాడిని ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు కదా.. అమ్మ: ice cream తెచ్చి బాగానే కూల్ చేసారు లే.. ఇంతకి accident ఏమయ్యిందో చెప్పలేదు అస్సలు.. నాన్న: ఆగు వాడు రాని ఒకే సారి చెప్తా. (ఇంతలో బబ్లూ వస్తాడు) బబ్లూ: ice cream ఎక్కడ?? అమ్మ: బబ్లూ తెలుసా నాన్న కార్ కి accident అయ్యింది బబ్లూ: ముందు ice cream ఎక్కడో చెప్పండి. అమ్మ: వీడికి మన కన్నా ice cream ఎక్కువైంది. నాన్న: సర్లే చిన్న పిల్లోడు కదా.. fridge లో వుంది వెళ్లి తీసుకో.. బబ్లూ: ice cream ని తీసుకొని దానిని ఆస్వాదిస్తూ బబ్లూ: ఏంటి నాన్నకి accident అయ్యిందా.. ఎలా అయ్యింది?
నాన్న: ఇప్పుడు వచ్చాడు మన ప్రపంచంలోకి.. ఏమైందంటే.. నేను ఆఫీసు నుంచి నిన్ను సినిమాకి తీసుకువెళదం అని ఫాస్ట్ గ వస్తున్నా కారు లో.. మా ఆఫీసు నుంచి ఇంటికి రావాలంటే దారిలో ఒక u turn తీసుకోవాలి... నేనేమో u turn దగ్గర వెయిట్ చేస్తున్నా.. అటు వైపు రోడ్ free అయితే వెళ్దాం అని.. మన కార్ వెనుక ఇంకో taxi కార్ ఆగుంది.. అటు వైపు ట్రాఫిక్ free అయ్యాక ఇక నేనేమో మన కార్ turn చేస్తుంటే ఆ రోడ్ కొచెం slope గా వుండటం వల్ల కార్ బాలన్స్ తప్పి వెనక్కి వెనక్కి వెళ్ళి taxi ని గుద్దుకుంది.. బబ్లూ: taxi ని గుద్దిందా???? మన కార్ అద్దం పగిలిపోయిందా?? నాన్న: లేదు మరి అంత గట్టిగ కాదులే.. బబ్లూ: తర్వాత ఏమైంది?? నాన్న: ఏముంది taxi వాడు కార్ లో నుంచి బయటికి వచ్చి గట్టి గట్టి గా అరుస్తున్నాడు.. ట్రాఫిక్ మొత్తం జాం అయ్యింది.. ఇంతలో ట్రాఫిక్ పోలీస్ వచ్చి.. ఎమన్నా వుంటే పక్కకి వెళ్లి చూస్కోండి.. ఇక్కడ ట్రాఫిక్ అంత జాం అయ్యింది.. ముందు రెండు కార్ లను ఇక్కడ నుంచి తీసేయండన్నాడు. నేను సరే అని ఇక కారు ని పక్కకు ఆపి మన కారు కి ఏమైందో అని చూస్తున్న ఇంతలో taxi డ్రైవర్ వచ్చి..
taxi డ్రైవర్: కార్ ముందర bumper అంత పోయింది.. అసలే ఇది కొత్త కారు.! నాన్న: bumper ఎక్కడ పోయిందయ్యా.. bumper ఊరికే కొంచెం పక్కకి వచ్చింది.. దానిని చేతితోనే పెట్టొచ్చు.. ఆగు నేను పెడతా. TAXI డ్రైవర్: అదేం కుదరదు.. bumper పోయింది.. కొత్త bumper వేయాల్సిందే.. 5000 కట్టు.! నాన్న: ఏంటి 5000 ఆ??? అసలు అక్కడ ఏమి అవ్వలెదూ డబ్బులు ఎందుకు ఇవ్వాలి నీకు?? నేను కారు వాడుతున్న నాకు తెలుసు అక్కడ ఏమి అవ్వలేదని.. TAXI డ్రైవర్: 5000 ఇస్తేనే ఇక్కడి నుండి కదులుతాం.. లేకుంటే లె ఇక.! నాన్న: 5000 కష్టం కాని ఒక 1000 అయితే ఇస్తా.. బబ్లూ: ఏంటి 1000 ఇచ్చి వచ్చావా..
నాన్న: లేదు లేదు.. నేను 1000 ఇస్తాను అని అన్నా వాడు వద్దన్నాడు.. ఇక నేను చేసేది ఏమి లేక.. వాడికి ఎం చెప్పానంటే.."సరే కారును show రూమ్ కి తీసుకెళ్దాం, అక్కడ రిపేర్ కు ఎంత ఖర్చు అయితే అంత నేనే ఇస్తా" అన్నా.. వాడు కూడా సరే అన్నాడు.. అలా show రూమ్ కి వెళ్తే అక్కడ కారు కు ఏమి కాలేదు.. నేను చెప్పినట్లే వాడు దానిని చేత్తో సెట్ చేసి.. కొంచెం కలర్ వేసినందుకు 100 తీసుకున్నాడు.. బబ్లూ: బాగా అయ్యింది.. అక్కడే 1000 తీసుకొనుంటే వాడికి లాభమన్న వచ్చేది..
నాన్న: మనం వస్తువు వాడితే సరిపోదు.. దాని గురించి కొద్దో గొప్పో తెలుసుకోవాలి.. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది.. కష్టం వచ్చినప్పుడు భయపడకుండా చాకచక్యంతో తప్పించుకోవాలి..
బబ్లూ: నువ్వు అందుకేనా నాకు ice cream తీసుకోచ్చావ్!