Presenting 'Kaalam Cheppina Katha - Episode 3', Subhas Chandra Bose's Rousing Speech!

Updated on
Presenting 'Kaalam Cheppina Katha - Episode 3', Subhas Chandra Bose's Rousing Speech!

రాత్రి 9:౩౦కి బబ్లూ బెడ్ రూమ్ లో అమ్మ బబ్లూ ఆ ట్యాబు లో గేమ్స్ క్లోజ్ చేసి ఇక పడుకో బబ్లూ కొద్ది సేపు ఆగి పడుకుంట అమ్మ అమ్మ నువ్వు ఇప్పుడే పడుకుంటే నీకు ఒక మంచి కథ చెప్తా బబ్లూ ఎం కథ? అమ్మ నువ్వు గేమ్స్ క్లోజ్ చేసి రా చెప్తా బబ్లూ హాన క్లోజ్ చేశా చెప్పు అమ్మ patriotism అంటే దేశ భక్తి,ఇప్పుడు దేశ భక్తి అంటే ఆగష్టు 15th న జెండా ఎగరేసి జాతీయ గీతం తోనే ఆగిపోతుంది కాని..మన స్వాతంత్రం సమయం లో దేశం లో వున్న ప్రతి ఒక్క భారతీయుడు దేశ భక్తి తో ప్రాణాలు కూడ అర్పించడానికి సిద్దంగా వుండేవారు.అలా దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారి కథ బబ్లూ ఎప్పుడు జరిగింది అమ్మ ఈ కథ బబ్లూ తెల్ల దొరలు మన దేశాన్ని వాళ్ళు పాలిన్చిడం మొదలుపెట్టడం నుంచి దేశం లో ఎన్నో అవకతవకలు, అప్పుడే మొదలయ్యాయి ఎన్నో ప్రాణ త్యాగాలు..కాని ఇప్పుడు చెప్పే కథ 1942 నుంచి 1945 మధ్యలో జరిగింది.

january 31 1942 సింగపూర్ లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నపుడు.... (బ్రిటిష్ క్యాంపు కార్యాలయం సింగపూర్) కోలోనల్ రాబర్ట్(బ్రిటిష్ అధికారి) జనరల్, మనకున్న సమాచారం ప్రకారం జపాన్, మలయా(ఇప్పుడు మలేషియా)నుంచి వాళ్ళ సైనిక దళాలను మన వైపు పంపడానికి సిద్ధంగా వున్నారు జనరల్ పెర్సివాల్(బ్రిటిష్ అధికారి) ఎంత మంది వున్నారు జపాన్ సైన్యం కోలోనల్ రాబర్ట్(బ్రిటిష్ అధికారి) సుమారు ముప్పై వేల మంది జనరల్ జనరల్ పెర్సివాల్(బ్రిటిష్ అధికారి) రాబర్ట్ మన దెగ్గర బ్రిటిష్ ఆస్ట్రేలియా ఇంకా ఇండియన్ సైనికులు కలిపి లక్ష మంది పైగా వున్నారు..యుద్ధం ఎటు నుంచి మొదలైన సరే మనం సిద్ధంగా వుంటే చాలు. కోలోనల్ రాబర్ట్(బ్రిటిష్ అధికారి) కాని జనరల్ మన దెగ్గర ఆయుధాలు ఏమి లేవు చేతి తుపాకి తప్ప...జర్మనీ తో జరిగిన యుద్ధం లో మన దెగ్గర ఆయుధాలని కాలి అయ్యాయి..బ్రిటన్ కి కబురు పంపాము ఆయుధాలు కావాలని..కాని అవి రాడానికి ఇంకా సమయం పట్టచు.ఈ లోపు జపాన్ సైన్యం యుద్ధం మొదలు పెడితే వాళ్ళని ఆపడం కష్టం అవుతుంది..మీకు తెలియంది కాదు జాపాన్ బాంబర్ విమానాలు వాడటం లో దిట్ట ఇంకా మనకున్న సమాచారం ప్రకారం వాళ్ళ దెగ్గర 22 యుద్ధ టాంకులు వున్నాయి..మన దెగ్గర బలగం ఎక్కువ వున్నపట్టికి వాళ్ళని ఎదురించడం కష్టం. జనరల్ పెర్సివాల్(బ్రిటిష్ అధికారి) అనవసరంగా భయపడ్తునావు రాబర్ట్ కోలోనల్ రాబర్ట్(బ్రిటిష్ అధికారి) భయపడట్లేదు జనరల్ జాగ్రత్త పడమంటున్న అంతే జనరల్ పెర్సివాల్(బ్రిటిష్ అధికారి) వాళ్ళ దెగ్గర ఎన్ని ఆయుధాలు వున్నా మన సైన్యం చేతిలో కచ్చితంగా వోడిపోతారు..చూస్తూ వుండు రాబర్ట్!!! (జపాన్ తాత్కాలిక సైనిక కార్యాలయం మలయా) జనరల్ యమోషి(జపాన్ అధికారి) మనం ఇక్కడ వున్న విషయం బ్రిటిష్ ఆర్మీ కి తెలిసుంటుంది..వాళ్ళ జాగ్రత్త లో వాళ్ళు వుంటారు..మనకున్న సమాచారం ప్రకారం సింగపూర్ లోని బ్రిటిష్ ఆర్మీ దెగ్గర ఎలాంటి యుద్ధ విమానాలు లేవు..మనం చేయాల్సిందంతా ఒక్కటీ బ్రిటిష్ ఆర్మీ ని మన యుద్ధ పరిధి లోకి తీసుకొని వచ్చి తర్వాత యుద్ధ విమానాలతో ఎటాక్ చేయడం.. సుహు (జపాన్ లెఫ్ట్నంత్) జనరల్ మలయా-సింగపూర్ సరిహద్దు ప్రాంతం జోహోరే నుంచి భరు మధ్యలో ఆకస్మిత దాడులు చేద్దాం..మన దెగ్గర యుద్ధ విమానాలు వున్నాయని తెలిసిన బ్రిటిష్ దానికి తయారీ గ వుంటారు గాని,,ఈ ఆకస్మిత దాడులని ఊహించుండరు..వాళ్ళ సైన్యం సింగపూర్ నుంచి ఇటు వైపు మల్లి నప్పుడు విమానాలతో దాడి చేద్దాం..యెటూ వెళ్ళలేని బ్రిటిష్ సైన్యం కి శరనమే ప్రాప్తి అవుతుంది.. జనరల్ యమోషి(జపాన్ అధికారి) మన సైన్యాని ఆకస్మిత దాడులకు సిద్ధం గ ఉండమనండి. (జపాన్ వ్యూహం ప్రకారమే బ్రిటిష్ సైన్యం ఎనిమిది రోజులు జరిగిన తీవ్ర యుద్ధం లో వోడిపోయింది ..జనరల్ పెర్సివాల్ ఏమి చేయలేక తొంబై వేల మంది సైన్యం తో జపాన్ కి లొంగి పోయాడు) 15 february 1942 సింగపూర్ లో జనరల్ యమోషి(జపాన్ అధికారి) తొంబై వేల మంది మనకి యుద్ధ ఖైధీలుగు లొంగి పోయారు..అందులో భరత్ కు చెందినా సైన్యం ఎంతమంది సుహు (జపాన్ లెఫ్ట్నంత్) నలభై అయిదు వేల మంది జనరల్ జనరల్ యమోషి(జపాన్ అధికారి) భారత్ సైన్యంతో ఒక అత్యవసర సమాచారాన్ని ఏర్పాటు చేయండి..మిగిలిన బ్రిటిష్ ఆర్మీ ని యుద్ధ ఖైధిలుగా ప్రకటించండి జనరల్ యమోషి(జపాన్ అధికారి) భారత్ సైన్యంతో.. మీ దేశం లో బ్రిటిష్ ఆగడాలను అరికట్టడానికి గాంధీజీ లాంటి మహోన్నుల్లు ఒక పవిత్ర యుద్ధం చేస్తున్నారు..మా పగ మీ మీద కాదు బ్రిటిష్ అమెరికా లా మీద.మన అందరిది ఆసియా ఖండం మనమంతా అన్న తమ్ముళ్ళం.వెళ్ళండి వెళ్లి మీ స్వతంత్ర పోరు లో పాల్గొనండి..మా సహాయ సహకారాలు ఎప్పుడు మీతోనే వుంటాయి..కెప్టెన్ మోహన్ సింగ్ ను భారత్ సైన్య అధికారి గా నియమిస్తున్న..అతని నాయకత్వం లో భారత్ లో బ్రిటిష్ పైన యుద్ధం చేసి గెలవాలని కోరుకుంటున్న.. (భారత్ సైన్యం లో ఓటమి నిస్పృహ నుంచి గెలుపు ఆశ కిరణాలూ వెలిగాయి)

జపాన్ క్యాంపు కార్యలం లో సుహు (జపాన్ లెఫ్ట్నంత్) జనరల్ ఎందుకు భారత్ సైన్యాన్ని వదిలేసారు..వాళ్ళు కూడా బ్రిటిష్ సైన్యం లో భాగమే కదా. జనరల్ యమోషి(జపాన్ అధికారి) యుధం అంటే ఆయుధాలతో శత్రువుతో తల బడటం కాదు మానసికంగా శత్రువుని క్రుంగ పరిచి మన అదుపులోకి తెచ్చుకోవడం..మన ఇక్కడ రగిలిచ్చిన చిచ్చు తో భారత్ సైన్యం తో భారత్ లో బ్రిటిష్ ఫై తిరగాపడతారు ..అప్పుడు బ్రిటిష్ కి ఇంట్లో సమస్య విధిలో సమస్య లా తయ్యారవుతుంది.ఎటూ తేల్చుకోలేని సమయం లో యుద్ధం చేస్తే మన గెలుపు తద్యం. ఇంతలో భారత్ సైన్యాన్ని జపాన్ ఆర్మీ చిన్న చూపు చూస్తుందనే విషయం లో కెప్టెన్ మోహన్ సింగ్ కి జపాన్ జనరల్ యమోశికి భేదాభిప్రాయాలు వస్తాయి.దీనివల్ల మోహన్ సింగ్ ని జపాన్ ఆర్మీ అదుపులోకి తీసుకొని జపాన్ కి పంపిస్తారు.ఇప్పుడు భారత్ ఆర్మీని ముందుకు తీసుకొని వెళ్ళే నాయకుడు ఎవరు లేరు...కాని అక్కడున్న నలభై అయుదు వేల మందికి తెలుసు బ్రిటిష్ తో భారత్ లో తలబడలంటే అది కేవలం ఒక్కరి నాయకత్వం లోనే వీలవుతుంది.అతనే సుబాష్ చంద్ర బోస్!!!!!!!!!!!!!!!!!!!!

స్వాతంత్రమే ఊపిరి గా బ్రతికే సుబాష్ చంద్ర బోస్ బ్రిటిష్ కారగారాల్నుంచి తప్పున్చుకొని సహాయం కోసం జర్మనీ వెళ్తాడు.జర్మనీ లో నాజీ ల నాయకుడైన హిట్లర్ పరిపాలనలో వుంది అన్ని తెలిసినప్పటికీ భారత స్వాతంత్రం కావాలంటే భలమైన సైన్య సహకారాలు అవసరమని గ్రహించి హిట్లర్ తో చేతులు కలపడానికి సిద్ధపడతాడు.అక్కడికి వెళ్ళాక అక్కడ దేశ పరిస్థుతులు చూసి బ్రిటిష్ తో భారత్ లో యుద్ధం చేయడానికి జర్మని తో కలవడం తగదు కాదని గ్రహిస్తాడు. ఏం చేయాలో పాలు పడనీ బోసుకు సింగపూర్ లో వున్న భారత్ ఆర్మీ గురించి సమాచారం వస్తుంది.వెంటనే హుటాహుటిగా 8th february 1943 లో జర్మనీ నుంచి జపాన్ బయల్దేరుతాడు బోస్.జపాన్ లో ఇక్కడ సింగపూర్ లో జరిగిన విషయాలన్నీ తెలుసుకొని 2nd జూలై 1943లో సింగపూర్ చేరుకుంటాడు.బోస్ రాకకై ఎదురు చూస్తున్న భారత్ ఆర్మీ లో ఈ విషయం తెలిసిన వెంటనే మల్లి ఉద్యమ స్ఫూర్తి రగులుతుంది.

4 th july 1943 లో సింగపూర్ లోని పెరేడ్ పార్క్ లో బోస్ భారత్ ఆర్మీ తో తొలి ప్రసంగం................ సుభాష్ చంద్ర బోస్ భారత్ ఆర్మీ తో స్వేచ్చ అంటే ఏంటో తెలుసా?స్వాతంత్రం అంటే ఏంటో తెలుసా? మన నెల మీద నవ్వుతూ నడవడటం మన ఇంట్లో హాయిగా నిదుర పోవటం మన జాతీయ గీతం పాడటం మన దేశపు జెండా ఎగురుతూ వుంటే గర్వంతో సెల్యూట్ చేయడం.. అసలు ఓటమి అంటే ఏంటో తెలుసా? శత్రువు చేతిలో చావడం కాదు ..పిరికివాళ్లల వంటరిగా మిగిలిపోవటం ఇక్కడ ఎంత మంది వున్నారో నాకు తెలిదు,మీ బలం ఏంటో నాకు తెలిదు,మీ రంగు నాకు తెలిదు,మీ కులం తెలిదు,మీ వయస్సు తెలిదు,నాకు తెలిసందంతా ఒక్కటే మనం భాతీయులం. చేతిలో తుపాకి వున్న వాడే సైనికుడు కాదు,దేశ భక్తీ రక్తం లో ప్రవహించే ప్రతి ఒక్క భారతీయుడు సైనికుడే... అసలు మనది సైన్యం కాదు సముద్రం మనది కోపం కాదు ఉద్యమం మనది ఆవేశం కాదు ఆరాటం ఇది యుద్ధం కాదు చరిత్ర వాళ్ళ సైన్యం పెద్దది, ఆయుధాలు పెద్దవి ,చస్తమేమో అని భయపడకండి,మనం చచ్చి చాల రోజులు అయ్యింది.మన దేశ స్వతంత్ర పోరాటంలో పోరాడకుండా ఇలా పరాయి దేశం కోసం మనం యుద్ధం చేసినప్పుడే మనప్రణాలకు విలువ పోయింది.ఇప్పుడు మల్లి పుడదాం..అసలైన భారతీయుడిల పుడదాం. బ్రిటిష్ తో తలబడటానికి మన సైన్యం సరిపోదు మన దారిలో కనిపించే ప్రతి భారతీయున్ని మన ఈ ఉద్యమం లో కలుపుకున్ధం.మనం సింగపూర్ నుంచి బర్మా మీదుగా వెల్తునప్పుడు మీకు కనిపించే ప్రతి భారతీయునికి ఈ విషయం చెప్పండి నువ్వు నడవాల్సింది ఇక్కడ కాదు నువ్వు ఊపిరి పీల్చుకోవాల్సింది ఇక్కడ కాదు నువ్వు బ్రతకల్సింది ఇక్కడ కాదు నువ్వు చావల్సింది ఇక్కడ కాదు ఎవడో వచ్చి వాళ్ళ దేశపు జెండాని మన దేశపు నడి బొడ్డున మనతోనే మోయించి పాతిస్తునారు. ఊరుకుందామా??ఉరుముల మీద పడదామా?? వాళ్ళ అధికారానికి అహం వుంది.. వాళ్ళ పాలనలో హేళన వుంది అన్నింటికన్నా వాళ్ళు బ్రతకటానికి చావటానికి వాళ్ళ భూమి వుంది..అక్కడికే వాళ్ళని తరిమి కొడదాం. పిరికి వాడిలా తల దించుకొని చచ్చేకన్న..ధైర్యంతో తల తెగిన పరవాలేదని బ్రతుకుధాం..దేశ స్వాతంత్రం కోసం జైలు గోడలని దేశ సరిహద్దుల్ని దాటుకొని వచ్చా మీ రక్తాన్ని ఇవ్వండి,మీకు స్వేచ్చ ని ఇస్తా మీ రక్తాన్ని ఇవ్వండి,మీకు స్వాన్తంత్రాన్ని ఇస్తా మీ రక్తాన్ని ఇవ్వండి,మీకు గౌరవాన్ని ఇస్తా, మీ రక్తాన్ని ఇవ్వండి,మన భారత దేశాన్ని మీకు ఇస్తా. నేను ఇప్పుడు చెప్పే ప్రతి మాట మనకు స్వేచ్చ వచ్చే వరకు,స్వాతంత్రం వచ్చిన తర్వాత,మన జెండా ఎగిరినప్పుడల్లా,మన జాతీయ గీతం పాడినప్పుడల్లా,దేశం కోసం ప్రాణాలను అర్పించిన ప్రతి భారతీయుడుని తలుచుకున్నపుడల్లా పలేకెల మన నాలుక మీద రాసుకోవాలి.. నా గొంతుతో మీ గొంతుని కలపండి మన దేశం లో వున్నా తెల్ల దొరలకు వినబడేలా అరవండి ప్రతి భారతీయుడి నరం లో దేశ భక్తీ పొంగేల, మనకి ఎదురు వచ్చిన ప్రతి ఒక్కడి తల తెగేల, మన దేశపు జెండా పొగరు కనబడేలా, మన భాద్యత బలం తెలిసేలా.....

ఇన్క్విలాబ్ జిందాబాద్ ఇన్క్విలాబ్ జిందాబాద్ ఇన్క్విలాబ్ జిందాబాద్!!!! చలో ఢిల్లీ చలో ఢిల్లీ చలో ఢిల్లీ!!!!! జై హింద్!!!!!!!!!!

బోస్ ఇచ్చిన స్ఫూర్తి అక్కడున్న సైనికులందరి రోమాలను నిక్కబృచుకునేల చేసింది.బోస్ గొంతుతో గొంతు కలిపి దేశ భక్తిని చాటి చెప్పారు.

ఇంకా ఉంది................