మనం ఎంత తొందరగా జీవితంలో పోరాటాన్ని మొదలుపెడితే అంత తొందరగా ఎవరూ అందుకోలేను శిఖరాలను చేరుకోవచ్చు అని అనడానికి జ్యోతి జీవితం ఒక ఉదాహరణ. జ్యోతి కేవలం 5సంవత్సరాల వయసులో ఉండగానే కృష్ణా నదిని ఈది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కేశారు. సరిగ్గా పది సంవత్సరాల క్రితం ఆర్చెరీని పట్టుకున్న తను దేశ, విదేశాలలో ఎన్నో పతకాలను గెలుచుకుంటూ ఇప్పుడు ఏకంగా భారత ప్రభుత్వం నుండి 'అర్జున' అవార్ఢును అందుకొబోతున్నారు.
గేమ్స్ లో మాత్రమే కాదు చదువులోను: కొన్ని సాధించాలంటే ఇంకొన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఆటల్లో Concentration చేసిన చాలామంది గొప్ప ఆటగాళ్ళు వారి Educational Qualifications లలో కాస్త వెనుకబడి ఉంటారు కాని జ్యోతి సురేఖ మాత్రం అలా కాదు. కే.ఎల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేసి ప్రస్తుతం ఎంబిఏ చదువుతూ రెండిటిలోనూ ఉన్నతంగా రాణిస్తున్నారు.
అంతర్జాతీయ వేదికలలో జ్యోతి సాధించిన కొన్ని పతకాలు... 1. 2009 లో టైజునాలో మెక్సికన్ గ్రాండ్ టోర్నీలో, అండర్-19 విభాగంలో ఒలింపిక్ రౌండ్లో స్వర్ణ పతకం, మూడు రజత, ఒక కాంస్యం గెలుచుకున్నారు.
2. 2011 లో టెహరాన్ లో జరిగిన ఆసియా ఆర్చెరీ ఛాంపియన్ షిప్ లో మహిళా కాంపౌండ్ టీం సభ్యురాలిగా కాంస్య పతకం గెలుచుకున్నారు.
3. 2013 లో చైనాలోని "వుక్సి" వేదికగా సాగిన ప్రపంచ యూత్ ఆర్చెరీ ఛాంపియన్ షిప్ పోటీలలో కాంపౌండ్ జూనియర్ ఉమన్ మరియూ కాంపౌండ్ మిక్సెడ్ డబుల్స్ విభాగాలలో కాంస్య పతకాలు సాధించింది.
4. 2015, నవంబరు 7న థాయ్ లాండ్ దేశంలోని బ్యాంకాక్ నగరంలో నిర్వహించిన 19వ ఆసియా ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలలో, మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం సాధించింది.
5. 12వ దక్షిణ ఆసియా పోటీలలో తొలిసారిగా పాల్గొని, వ్యక్తిగత విభాగంలో రజత పతకం మరియు బృంద విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఈ రెండు పతకాలతో కలిసి ఇంతవరకు అంతర్జాతీయస్థాయిలో 15, జాతీయస్థాయిలో 50 పతకాలు గెలుచుకున్నారు.
జ్యోతి సాధించిన పతకాలలో ఇవి కొన్ని మాత్రమే (అది కూడా ఇంటర్నేషనల్ లెవల్లో). ఇంకా జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో ఐతే ఇంకా మరెన్నో.. ఈ విజయంలో తనలోని ఆత్మ విశ్వాసంతో పాటు, ఆంద్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, సి.బి.ఆర్ ఫౌండేషన్ వారు ఆర్ధికసహాయం అందిస్తూ అండగా నిలబడడం కూడా తనకు ఎంతో ఉపయోగపడింది.