This Short Story Explores The Common Question We All Have In Our Minds, 'Job Or Passion?'

Updated on
This Short Story Explores The Common Question We All Have In Our Minds, 'Job Or Passion?'

Contributed By Masthan Vali.K

ఇంటి డాబా పైనున్న పార్పేట్ గోడ కు ఆనుకుని కూర్చుని ఉన్నాడు ప్రశాంత్. గర్జిస్తున్న మెరుపులకు వణుకుతూ వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి కమ్ముకున్న మేఘాలు. తుఫాను సూచనలుగా గాలులు బలంగా వీస్తున్నాయి. అలాంటి వాతావరణం కూడా ప్రశాంతంగా కనిపిస్తోందతనికి. ప్రస్తుతానికి తన లోపల చెలరేగుతున్న తుఫాను కంటే రాబోయేది అంత తీవ్రమైనది కాదనిపిస్తోంది.

తన ఇష్టానికి, తాను చేస్తున్న పనికి లేని పొంతన వలన ఇలా బాధపడుతూ కూర్చోవడం అతనికి రుచించడం లేదు. ‘నా ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ముందుగా చేరుకునేదే నన్నే అంటారు. మరి నా ప్రాబ్లమ్ ని ఎందుకు సాల్వ్ చేసుకోలేకున్నాను..!’ ఇలా ఆలోచనల్లో ఉండగా...

"ఎరా మళ్ళీ కుర్చున్నావా ఇక్కడ..." అంటూ ఓ గొంతు వినబడింది. తలెత్తి చూసి ఏ బదులు ఇవ్వకుండా మళ్ళీ తలొంచుకున్నాడు ప్రశాంత్.

"నిన్నే అడిగేది, ఇసారేమైంది.?" అంటూ అతని పక్కనే కూర్చున్నాడు. "నాకు ఈ ఉద్యోగం చేయాలంటే ఇష్టం లేదు, కానీ చేయాల్సిన అవసరం ఉంది, ఎం చెయ్యాలో తోచట్లేదు" ఈ సారి సమాధానమిచ్చాడు

"కొత్త విషయాలేమైనా ఉంటె చెప్పారా బాబు... ఇదెప్పుడు ఉండేదా గా... !" వెటకారంగా వినబడింది ప్రశాంత్ కి "..........." ప్రశాంత్ మౌనాన్ని గ్రహించి, "లేకపోతె ఏంట్రా... మనమెన్నిసార్లు దీని గురించి మాట్లాడుకున్నాం. ప్రతి సారి నువ్వేడవడం, నేనూరుకోబెట్టడం,. చిరాకేయట్లేదా రా నీకైనా.!" ప్రశాంత్ కళ్లల్లోకి చూస్తూ అన్నాడతను.

"మరేం చేయమంటావ్ రా... కనీసం బాధ కూడా పడకూడదా..!" "బాధ పడటం 'కనీసం' అని నువ్వే అంటున్నవ్ గా... అంటే చేతగాక చేసే పనని ఒప్పుకుంటున్నావ్, పని కూడా కాదది, పనికిరాని తత్త్వం.!" కళ్ళిన్ని చేసి ఉరుముతూ అన్నాడతను . “………” ప్రశాంత్ కి ఎం చెప్పాలో తెలీట్లేదు.

"బాధ అవసరం. ఆ బాధే అసలైన నిన్ను బయటపెడుతుంది . అందుకే ఇన్నాళ్లు బాధపడుతుంటే ఊరుకున్నా, ఊరడించా. ఇప్పుడు నువ్వా బాధనే జీవితం అనుకుంటున్నావు. అసలేంటి నీ బాధ? నచ్చని ఉద్యోగం అంటున్నావ్, ఈ ఉద్యోగం కోసం కాదా రెండేళ్ల క్రితం లెక్కలేనన్ని ఇంటర్వ్యూలిచ్చావ్..?" " అప్పుడు, ఇప్పుడు ఉద్యోగం అవసరమనే అంటున్నా, కానీ ఈ పని జీవితాంతం చేయడం ఉహించలేకున్నాను..." "రాయాలనుకుంటున్నావు, అంతే గా..?"

"రాయడాన్నే బ్రతుకుతెరువు కోసం ఎంచుకోవాలనుకుంటున్నాను, దానికే జీవితం లో ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాను.." "బ్రతుకు తెరువు నువ్వెంచుకోవడం కాదు, నీ రాత బాగుంటే... రాతంటే తల రాత కాదు, నువ్వు రాసే రాత బాగుంటే ఓ గొప్ప బ్రతుకే నీకెదురవుతుంది.."

"అంటే, ఇలా మెషిన్ లా పనిచేయాల్సిందేనా, నాకిష్టం అయినా పని కోసం వీకెండ్ వరకు వెయిట్ చేసి ఖాళి దొరికినప్పుడు టైంపాస్ కోసం రాసుకోవాలా, అది కాదు నేను కోరుకునేది ..?"

"ను కోరుకునేది తెలుసు, మళ్ళీ మళ్ళీ దొబ్బకు. ఉద్యోగం మానలేవు. ని Passion ను వదులుకోలేవు. రెండిటి మధ్య నలుగుతున్నావ్. ఇప్పుడు నేను చెప్పేది విను. చెవులు కాదు మనసు తెరచి విను. Passion అనేది నువ్వెంత దూరం విసిరేసినా నిన్ను వీడిపోనిది. నీలో ఒక భాగం లాంటిది. ఉద్యోగం ప్రస్తుతానికి నీకవసరమైనది, ఒక వేళ నువ్వోదులుకుంటే నిన్ను వెతుక్కుంటూ వచ్చేదికాదు, నువ్వెళ్ళిబ్రతిమిలాడినా మళ్లీ నీకు సులభంగా దక్కేదీ కాదు. "

"అలాగని..." మధ్యలో కలుగజేసుకున్నాడు ప్రశాంత్. "నన్ను పూర్తిచేయనివ్వు... ఆ తర్వాత నువ్వు మొదలెడుదువు గాని, ఒక రచయితకు కావలసింది Inspiration. అది ఎలాగైనా కలగొచ్చు. నువ్వు నీ పనిని ఇన్స్పిరేషన్ గా తీసుకో. నీ మేనేజర్ , నీ కొలీగ్స్, నీ ఆఫీస్ పాలిటిక్స్ , ఆఫిస్ లో జరిగే గాసిప్స్ ని మార్నింగ్ 9 to ఈవెనింగ్ 5 వరకు జరిగే అన్నింటిని Observe చేస్తూ వాటినాధారంగా చేసుకుని ఏదైనా రాయాలని ఒక టైం లైన్ పెట్టుకో. అప్పుడు నీ Profession నీ Passion కు ఎంతలా ఉపయోగపడుతుందో అనిపిస్తుంది, బోనస్ గా నీకు ఆఫీసుకెళ్ళడం ఇష్టం లేదనే కష్టం ఉండదు.!, ఏమంటావ్..?"

". . . . . . . . . " "నువ్వున్న పరిస్థితుల్లో ఇంతకు మించిదేమన్నా చేయగలిగిందేమన్నా ఉంటే చెప్పు, వింటా. మళ్ళీ పాత పాట మొదలెట్టకు .!" ". . . . . . . . . "

ఇంతలో వర్షం మొదలయ్యింది. సన్నని చినుకులతో మొదలయ్యి నెమ్మదిగా పెరిగే వర్షం కాదది. ఒక్క సారిగా మేఘాలకు చిల్లు పడిందా అన్నట్టు పెద్ద పెద్ద నీటి బొట్లు ఒంటి మీద పడుతుంటే చిన్నపాటి గులక రాళ్లు తీసుకుని విసురుగా కొట్టినట్టు అనిపిస్తోంది ఇద్దరికి. కానీ కదలకుండా అలానే కూర్చున్నారు. ఏ సమాధానమివ్వాలో తెలియక ఒకరు, ఏం చేప్తాడో విందామని మరొకరు...

"రేయ్ ప్రశాంత్, వర్షం లో అలా తడుస్తూ కుర్చున్నావేంట్రా.. రా ఇటు." గంట నుంచి అతను డాబా పైనే ఉండి , వర్షం పడుతున్నా కిందకు రాకపోయేసరికి అమ్మే పైకొచ్చి కేకేసి పిలిచింది ప్రశాంత్ ను.

లేచి మెల్లగా అడుగులు వేస్తూ రూఫ్ కిందకు చేరాడు. "ఏంట్రా నువ్వు, వర్షం లో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నావు... " తెచ్చిన టవల్ తో ప్రశాంత్ తల తుడుస్తూ అడిగింది అమ్మ.

"ఒంటరిగా ఆలోచించుకోట్లేదమ్మా, ఏకాంతంగా మాట్లాడుకుంటున్నాను... " అని మనసులో అనుకుంటూ అక్కడ ఇంకా వర్షం లో తన జవాబు కోసం ఎదురు చూస్తున్న తనను చూస్తుండిపోయాడు. తుఫాను తీవ్రత దాల్చింది.