Contributed By Ranjith Kumar
ఆగి ఆగి సాగే ప్రయాణమేమిది కాదోయ్,
ప్రళయమే పలకరించినా పోరాడితీరాలోయ్.
కాదు కూడదంటే కాలమే ఆగిపోదోయ్,
కదలకుండా ఉంటే కష్టం రాకుండ ఉండదోయ్.
మంచనేది ఉంటే మనవలనే అనుకోవోయ్,
చెడె మిగిలుంటే జరిగేది జరగకమానదనుకోవోయ్.
మొద్దులా నువ్వుండక,
ప్రవాహంలో జారగ.
తెడ్డులా మారిపో ఇక,
నీ గమ్యాన్నే చేరగ.
ముద్దబంతులో, ముళ్ళకంపలో ,
రెండూ వెళ్ళే దారిలో.
పరుగెత్తే పాదాలకు పట్టింపులా,
పడబోకు స్పర్శల మాయాలో.
ఎగరాలనే ఆశలె,
ఊరిస్తాయి ఊహలె.
రెక్కలె లేవంటాయే,
నిక్కచ్చిగా నిజాలె.
నీరుగారకు ఆ నిజాన్ని చూసి,
కలిసే ఉంది ఆ దివి భువి తోటి.
నడక సాగించు ఆ నింగికేసి,
చేరెదాక ఆ సంగమంతోటి.
దైవవిచ్చిన వరమేలె ఆ ఆకలి దప్పికలు,
కడుపు నిండిన ఆకలె చేసెనే వాటిని శాపాలు.
సంతృప్తే ఇచ్చు సంతోషాలు,
ఆనందాన్ని తెలేవు లక్షల కోట్లు.
మజిలీలెన్నో మైలురాయి లేని రహదారిలో,
జ్ఞాపకాలే ఇంధనంలె, భవిష్యత్తనే బాటలో.
చివరిగా.....
ఈ జీవన ప్రయాణంలో,
అందిపుచ్చుకో ప్రతిక్షణపు ఆనందాలని,
బస్సులో కిటికీ ప్రక్కన సీటు దొరికిన ప్రయాణికుడిలా,
జీవన సారం తెలిసిన ఓ ఋషిలా.