This Small Village In Guntur Is Famous For Jasmine Flowers & Here's Everything About It
Shopify API
Updated on
ఇంట్లో పండుగ రోజు లేదంటే మరే ఇతర శుభకార్యాలు జరుపుతున్నప్పుడు కాసిన్ని మల్లెలతో దండ అల్లితే ఇల్లంతా దాని పరిమళాలు చుట్టూతా వ్యాపించి ఇంటి వాతావరణాన్నే మార్చివేస్తాయి. రోడ్డుపక్కనే నడుచుకుంటూ వెళుతుంటే ఎదో ఒక ఇంటి ఆవరణలో ఉన్న మల్లె తీగ వల్ల సమీప ప్రదేశమంతా హాయిగా ఉంటుంది. ఆలోచించండి అదే ఒక ఊరు ఊరే మల్లెపూల సువాసనలతో నిండిపోతే ఎలా ఉంటుందో.. ఆంధ్రప్రదేశ్ రాజధానికి దగ్గర్లో ఉన్న గ్రామం పెదవడ్లపూడి గ్రామం మల్లెపూలు సాగు చెయ్యడంలో ది బెస్ట్. పెదవడ్లపూడితో పాటు చుట్టు పక్కల ఉన్న మూడు గ్రామాలు కలిపి దాదాపు 400 ఎకరాలకు పైగా పంట భూములలో పండిస్తున్నారు.
చాలా సంవత్సరాల క్రితం నుండి సొంత భూమి ఉన్న రైతులతో పాటు, భూమిలేని కౌలు రైతులు కూడా కౌలుకు తీసుకుని సాగుచేస్తుంటారు. ఇక్కడి రైతులందరూ మల్లెలను పండించడంలో సిద్ధహస్తులయ్యారు. తక్కువలో తక్కువ కేజీ పది రూపాయల నుండి 200 రూపాయల వరకు ధర ఉంటుంది, కాకపొతే మల్లె పూల మార్కెట్ ధర ఎప్పటికి ఒకేలా ఉండదు. పండుగలు, పెళ్లిళ్ల కాలంలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. మామూలు రోజుల్లో అయితే టన్నుల కొద్ది హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతి మొదలైన ప్రాంతాలకు వెళ్లిపోతాయి. ఇంట్లో, ఇంకా దేవాలయాల కోసమే కాకుండా హెయిర్ ఆయిల్, సబ్బుల కోసం, అగరబత్తీలు, పెర్ఫ్యూమ్ ల కోసం కూడా పెదవడ్లపూడి మల్లెలలు ఉపయోగపడతాయి.
మల్లెలు పండించడానికి 30 నుండి 40 డిగ్రీల మధ్యలో టెంపరేచర్ ఉండాలి. మొక్కనాటి అంటు వేసిన మూడవ సంవత్సరం నుండి ఇది పుయ్యడం మొదలుపెడుతుంది. పువ్వులను కోయడం, వాటిని సరిగ్గా ప్యాకింగ్ చేసి ఎగుమతి చెయ్యడం ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన పద్దతి. ఉదయం 6 గంటల కల్లా సరిగ్గా ఎదిగిన పూలను కోసి ఐస్ క్యూబ్ తో కలిసిన థర్మాకోల్ బాక్స్ లలో నింపి వివిధ ప్రాంతాలకు, రాష్టాలకు, దేశాలకు పంపిస్తారు. ఉదయం 8 గంటలలోపే మార్కెట్ ధర కూడా నిర్ణయించబడుతుంది.
ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రాఫిట్ గురుంచి.. అరెకరం నుండి 10 ఎకరాల భూమి ఉండే రైతులు మల్లె పూలను సాగుచెయ్యడానికి ఇష్టపడుతారు. సంవత్సరానికి ఖచ్చితంగా ఎకరానికి లక్షరూపాయల(అంతకన్నా ఎక్కువ) వరకు నికర లాభం ఉంటుంది. కౌలు రైతులకు కూడా మంచి లాభం ఉంటుంది.