15 Masterpieces Of Jandhyala Siva Subrahmanya Sastry Garu That Every Generation Youth Must Watch

Updated on
15 Masterpieces Of Jandhyala Siva Subrahmanya Sastry Garu That Every Generation Youth Must Watch
నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. ఇది జంధ్యాల గారి సిద్ధాంతం. ఆ సిద్ధాంతాలని ఆయన ప్రతి సినిమాలో తూచా తప్పకుండా పాటించారు కాబట్టే, ఇప్పటి ఆయన సినిమాలని చూసి ఆనందంగా ఇంటిల్లిపాది నవ్వుకుంటున్నాం. ఆయన సంబాషలని మన నిత్య జీవితం లో ఎక్కడో ఒక చోట ఉపయోగిస్తునే ఉన్నాం. ఆయన తీసిన ఎన్నో సినిమాలలో తప్పకుండ చూడాల్సిన, చూసి కాసేపు నవ్వుకోవాల్సిన సినిమాలు, కాస్త ఆలోచింపచేసే సినిమాల ఒకసారి చూద్దాం రండి. 1. శ్రీవారికి ప్రేమలేఖ 100 వ సారి అంతే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతాం. ఒక పక్క నవ్విస్తూనే, అప్పట్లో కట్నాల గురించి జరిగే అకృత్యాల గురించి చాలా బాగా discuss చేసారు ఈ మూవీ లో. 2. రామ గోపాల రావు అతి సర్వత్రా వర్జయేత్ అంటారు పెద్దలు. జ్ఞానం విషయం లో కూడా అది వర్తిస్తుంది. ఈ సినిమా అప్పటి కాలానికి కాస్త forward గా ఉంటుంది. రావు గోపాల రావు గారి నటన గురించి ఈ సినిమా చూడచ్చు.. 3. బాబాయి అబ్బాయి వద్దంటే డబ్బు అనే పాత NTR గారి సినిమా కి, జంధ్యాల గారి హాస్య చతురత తోడైతే వచ్చే నవ్వుల జల్లు ఈ సినిమా. బాలయ్య, వీరభద్రం గారి జోడి మనల్ని మామూలు నవ్వించదు. 4. రెండు రెండ్లు ఆరు జంధ్యాల mark confusion comedy. శ్రీ లక్ష్మి, వీరభద్రం గార్ల కోసం ఎన్ని సార్లైనా చూడచ్చు. 5. చంటబ్బాయ్ చిరంజీవి + జంధ్యాల = 100% entertainment 5. పడమటి సంధ్యా రాగం "సంధ్య నేను అందంగా సచ్చాను కదూ". చాలా మంది NRIs నటించిన సినిమా ఇది. https://youtu.be/Dx24LKe09AY 6. వివాహ భోజనంబు ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక mannerism ఇస్తారు జంధ్యాల గారు. ఆ mannerism నుండి హాస్యాన్ని రాబట్టటం ఆయన నేర్పిన పాఠం ఎందరో దర్శకులకి. 7. ఆహా నా పెళ్ళంటా ఈ సినిమా ద్వారా "బ్రహ్మానందం" అనే తెలుగు సినిమా కి ఒక నవ్వుల వరాన్ని ఇచ్చినందు. ధన్యవాదాలు జంధ్యాల గారు. 8. చూపులు కలిసిన శుభవేళ ఈ చలన చిత్రములో హాస్యము, పాత్రధారులు బహు చక్కగా ఉండును. ఒకసారి తప్పకుండ వీక్షింపుడి. 9. హై హై నాయక కొత్తరకమైన తిట్ల కోసం నేడే చుడండి ఈ ఆరోగ్య హాస్యభరిత సినిమాని. 10. జయమ్ము నిశ్చయంబురా బాబు.. చిట్టీ... ఇవన్నీ మనల్ని నవ్వించే సినిమాలు అయితే, జంధ్యాల గారు కొన్ని ఆలోచింపచేసే సినిమాలు. అప్పటి సమాజాన్ని అద్దం పెట్టె సినిమాలని కూడా తీశారు. వాటిలో కొన్ని ఇవి. 1. ముద్ద మందారం Teenage లో love గురించి చాలా హృద్యంగా చెప్పిన సినిమా ఇది. దర్శకుడిగా జంధ్యాల గారి మొదటి సినిమా. 2. నాలుగు స్తంభాలాట ప్రేమ, స్నేహం, వీటి మధ్య నడిచే కథ ఈ సినిమా. జంధ్యాల గారి సినిమాల్లో పాటలు చాలా బాగుంటాయి. వాటిలో నాకు మొదట గుర్తొచ్చే పాట ఈ సినిమాలోని "చినుకులా రాలి" 3. రెండు జెళ్ళ సీత ఈ సినిమా కొంత వరకు సరదాగా ఉన్న. అనుమానాలా గురించి చాలా బాగా discuss చేసిన సినిమా ఇది. 4. ఆనంద భైరవి కళల కి, ప్రేమ కి ఏవి అడ్డంకి కాదు, ఏది అదుపు చేయలేదు అని జంధ్యాల గారు తనదైన శైలి లో చెప్పిన సినిమా. 5. మల్లె పందిరి Teenage love గురించి, "ముద్ద మందారం", "నాలుగు స్తంభాలాట" సినిమాలలో చెపితే, పెళ్లి అయ్యాక భార్య భర్తల మధ్య ఉండే నమ్మకం గురించి. ఈ సినిమా లో చెప్పారు. జంధ్యాల గారి ఎన్నో సినిమాలలో మచ్చుక్కి ఒక 15 సినిమాలు తీసుకున్న వాటి గురించి చెప్పా అంతే.. మర్చిపోయినవి, మిగిలిపోయినవి ఉండే ఉంటాయి. వాటి గురించి కామెంట్ చేయండి మరి..