ఒక కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు అంతా మంచే జరగాలి, మమ్మల్ని చల్లగా చూడాలని భగవంతుడిని ప్రార్ధిస్తాం. ఒక కొత్త జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు ఎస్.పి.విశాల్ గారు మాత్రం అక్కడ రౌడి షీటర్లందరిని ఒకచోటుకు పిలిచి ఓ స్వీట్ వార్నింగ్ ఇస్తారు. అంతేకాక వారిలో సమాజంపై ప్రేమ కలగాలని పలు సందర్భాలలో రక్తదానం కూడా చేయించి వారి బాధ్యతలను గుర్తుచేస్తారు. ఓ సినిమాలో చెప్పినట్టు "ఊరికి ఒక్కడే రౌడి ఉండాలి వాడు పోలీసోడై ఉండాలి" అని ఇక్కడ మాత్రం తూర్పు గోదావరి జిల్లాకు హీరో ఎస్.పి. విశాల్ గున్ని గారు.
నెల్లూరులో.. 2010 ఐపిస్ బ్యాచ్ కు చెందిన విశాల్ గారు విశాఖపట్నం, నెల్లూరు లాంటి జిల్లాలో పనిచేశారు. ఎక్కడ పనిచేసినా గాని ముందు ప్రజలకు అందుబాటులో ఉండడమే తన మొదటి లక్ష్యంగా ఉండేది. రౌడి షీటర్లకు జాగ్రత్తగా బ్రతకండి అని వారికి కౌన్సిలింగ్ ఇస్తునే తన పర్సనల్ వాట్సప్ నంబర్ ప్రజలకు ఇచ్చి 24గంటలు నేను అందుబాటులోనే ఉంటాను అని భరోస ఇస్తారు.
ఫుడ్ కూపన్స్: నెల్లూరులో ఎస్పిగా పనిచేస్తున్నప్పుడు హోం గార్డుల కష్టాలను చూసి కలతపడి జిల్లాలో పనిచేస్తున్న సుమారు 700 హోం గార్డులకు ఫుడ్ కూపన్లను అందజేశారు ఈ కూపన్ల వల్ల వారి సబ్సీడి ప్రాతిపదికన భోజనం తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకున్నారు.
హాస్టల్స్ దత్తత: ఒక పక్క నేరాలను అరికడుతూనే మరోపక్క తన తోటి సిబ్బందితో సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. జిల్లాలో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళను దత్తత తీసుకుని ఉన్నత వసతులు కల్పిస్తూ పుస్తకాలు, స్పోర్ట్స్ కిట్, మినరల్ వాటర్, మారుమూల పల్లెల్లో ఎల్.ఈ.డి బల్బులను కూడా అందిస్తున్నారు.
డ్రగ్స్ పై యుద్ధం: హైదరాబాద్ లాంటి సిటీలలో మాత్రమే ప్రతి జిల్లాలోనూ గంజాయి ఎలాగొల దొరుకుతుంది. ఎప్పుడో పై నుండి ఆర్డర్స్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అని కాకుండా జిల్లాలో విపరీతంగా తణీఖీలు చేసి ఇప్పటికి కోట్లు విలువచేసే గంజాయిని పట్టుకుని అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకుని "ఆ తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం మనం డ్రగ్స్ అమ్మలేము" అనే భయాన్ని డ్రగ్స్ రవాణా చేసే వారిలో కల్గించారు.
సిబ్బందికి సెలవులు: మిగిలిన జాబ్స్ లో కూడా టెన్షన్స్ ఉంటాయి కాని పోలీస్ జాబ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన రక్షణ కోసం వారి సొంత పనులను, శుభకార్యాలను వదులుకుని మరి ఉద్యోగం చేస్తున్న వారికి సెలవులను తీసుకునేందుకు వీలుగా ఈ మధ్యనే ఉత్తర్వులు కూడా జారీచేశారు.
సోషల్ మీడియా, LHMS App: చాలామంది పోలీస్ స్టేషన్ కు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోలేరు ఇది గుర్తించిన విశాల్ గారు తన వాట్సప్ నంబర్ (9494933233)ఇచ్చారు. చాలామంది ఈ వాట్సప్ ద్వారా ఫొటోలను, వీడియోలను పంపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇచ్చినంత అలర్ట్ గా ఈ వాట్సప్ మేసేజిలకు ఆయన స్పందిస్తారు. వ్యక్తిగత కంప్లైంట్స్ మాత్రమే కాదు జిల్లాలో ఏదైనా సామాజిక సమస్యలు కూడా పరిష్కరిస్తున్నారు. ఈ మధ్యనే LHMS అని ఒక కొత్త యాప్ ఒకటి లాంచ్ చేశారు. దీనిని ప్లే స్టోర్ లో డౌన్ లోడ్ చేసుకుని ఎప్పుడైన ఊరికి వెళ్తున్నప్పుడు యూజర్ ఐడితో యాప్ లో పోలీసు వారికి రిక్వెస్ట్ పెడితే వెంటనే సి.సి కెమరాలు ఏర్పాటు చేస్తారు. అప్పటి నుండి తిరిగి వచ్చే వరకు కూడా వారి ఇల్లు పోలీసుల నిఘాలో ఉంటుంది.
యుద్ధం చేయడమంటే నేరస్థులను అదుపులో పెట్టడం మాత్రమే కాదు జిల్లాలోని అన్ని రకాల సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించడం కూడా.. ఈ రెండు దారులలో విశాల్ గారు తన తోటి సిబ్బందితో సమస్యలపై యుద్ధం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.