Day 180:
దివ్య ఆనందంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంది.
దివ్య: ఆర్నెళ్ల నాసంఘర్షణ కు ఈ రోజు ముగింపు దొరికింది. అసలు ఇదంతా ఆ రోజు మొదలయింది.
Day 1: దివ్య ఇంట్లో కూర్చొని 'I am the mind' చదువుతుంది. పక్కనే ఉన్న మొబైల్ లో notification, Rajesh wants to be your friend'. దివ్య మొబైల్ చూసి, ఆ నోటిఫికేషన్ reject చేస్తుంది. పుస్తకం పక్కన పెట్టి, బయటకు వెళదాం అని బయలుదేరుతుంది. మెట్లు దిగి బయటకు వచ్చింది.
దివ్య: నేనో అంతర్ముఖురాలిని, ఆ రోజెందుకో మొదటి సారి బయటి ప్రపంచాన్ని చూడాలనిపించింది.
రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే, దూరంగా శివ కనిపించాడు.
దివ్య: అదే మొదటి సారి అతన్ని చూడడం. నాకు తెలిసిన ఓ ఇద్దరు అమ్మాయిలు అతనితో ఉండేప్పటికీ, నేను వాళ్ళతో కలిసాను. ఆ క్షణం నాకు తెలీదు, ఆ తర్వాత ప్రతీ రోజు అతన్ని కలుస్తానని.
దివ్య శివ తనవైపు ఎప్పుడు చూస్తాడా అని వేచి చూడడం, శివ చూడగానే దివ్య తలతిప్పి, నవ్వుకొని శివ వైపు చూడడం... వెనక్కి వచ్చేప్పుడు ఒక్క క్షణం ఆగి
దివ్య: అందరూ ఉన్నారు, ఈ రోజు కాదు. రేపు...
Day 8: దివ్య ఇంట్లోంచి బయలుదేరడం...మొబైల్ లో notification, Rajesh wants to be your friend'. దివ్య మొబైల్ చూసి, ఆ నోటిఫికేషన్ reject చేయడం. దివ్య శివ ని కలవడం, నవ్వడం. దివ్య పక్కనున్న friends తో సరదాగా నవ్వడం. మధ్య మధ్యలో దివ్య శివ తనవైపు ఎప్పుడు చూస్తాడా అని వేచి చూడడం, శివ చూడగానే దివ్య తలతిప్పి, నవ్వుకొని శివ వైపు చూడడం... వెనక్కి వచ్చేప్పుడు ఒక్క క్షణం ఆగి
దివ్య: అడిగేద్దామా ? అప్పుడే అంటే బావోదేమో...రేపు...
Day 24:
దివ్య ఇంట్లోంచి బయలుదేరడం...మొబైల్ లో notification, Rajesh wants to be your friend'. దివ్య మొబైల్ చూసి, ఆ నోటిఫికేషన్ reject చేయడం. దివ్య శివ ని కలవడం, నవ్వడం. దివ్య శివ తనవైపు ఎప్పుడు చూస్తాడా అని వేచి చూడడం, శివ చూడగానే దివ్య తలతిప్పి, నవ్వుకొని శివ వైపు చూడడం... వెనక్కి వచ్చేప్పుడు ఒక్క క్షణం ఆగి
దివ్య: వీళ్ళ ముందు అంటే ఇంకా అంతే. రేపు...
Day 43:
దివ్య ఇంట్లోంచి బయలుదేరడం...మొబైల్ లో notification, Rajesh wants to be your friend'. దివ్య మొబైల్ చూసి, ఆ నోటిఫికేషన్ reject చేయడం. దివ్య శివ ని కలవడం, నవ్వడం. నా పుట్టిన రోజు అని chocolate ఇవ్వడం. దివ్య శివ తనవైపు ఎప్పుడు చూస్తాడా అని వేచి చూడడం, శివ చూడగానే దివ్య తలతిప్పి, నవ్వుకొని శివ వైపు చూడడం... వెనక్కి వచ్చేప్పుడు ఒక్క క్షణం ఆగి
దివ్య: ఈ రోజు ఎందుకులే... negative గా react అయితే... రేపు...
Day 93: దివ్య ఇంట్లోంచి బయలుదేరడం...మొబైల్ లో notification, Rajesh wants to be your friend'. దివ్య మొబైల్ చూసి, ఆ నోటిఫికేషన్ reject చేయడం. దివ్య శివ ని కలవడం, నవ్వడం. దివ్య పక్కనున్న friends తో సరదాగా నవ్వడం. మధ్య మధ్యలో దివ్య శివ తనవైపు ఎప్పుడు చూస్తాడా అని వేచి చూడడం, శివ చూడగానే దివ్య తలతిప్పి, నవ్వుకొని శివ వైపు చూడడం... వెనక్కి వచ్చేప్పుడు ఒక్క క్షణం ఆగి
దివ్య: ఈ రోజైన దైర్యం తెచ్చుకో దివ్యా... ఎన్ని రోజులు ఇంకా... ఉన్న ఈ కాస్త పరిచయం కూడా పోతుందేమో... రేపు...
Day 144: దివ్య ఇంట్లోంచి బయలుదేరడం...మొబైల్ లో notification, Rajesh wants to be your friend'. దివ్య మొబైల్ చూసి, ఆ నోటిఫికేషన్ reject చేయడం. దివ్య శివ ని కలవడం, నవ్వడం. దివ్య శివ తనవైపు ఎప్పుడు చూస్తాడా అని వేచి చూడడం, శివ చూడగానే దివ్య తలతిప్పి, నవ్వుకొని శివ వైపు చూడడం... వెనక్కి వచ్చేప్పుడు ఒక్క క్షణం ఆగి
దివ్య: ఆంటీ వాళ్ళు ఉన్నారు... ఈ రోజు వద్దు... రేపు.
Day 180: దివ్య ఇంట్లోంచి బయలుదేరడం...
దివ్య: ఏది ఏమైనా, ఎవరు ఎదురైనా ఈ రోజు అడుగేయాల్సిందే. Come on దివ్య...
మొబైల్ లో notification, Rajesh wants to be your friend'. దివ్య మొబైల్ చూసి, ఆ నోటిఫికేషన్ reject చేయకుండా... వాడి profile open చేస్తుంది. వాడి cover pic లో 'నీకు కావాల్సింది పొందకుండా నిన్ను అడ్డుకునేది నువ్వే! ఒక్కసారి నిన్ను నువ్వు దాటిచూడు మిత్రమా! '
దివ్య: ఆరు నెలలుగా reject చేస్తున్నా, మొదటి సారి వాడి profile చూసాను. ముందే చూసుంటే ఈ రోజు వేరేలా ఉండేదేమో.
ఆ quote చూడగానే దివ్య మొహంలో ఏదో కొత్త శక్తి. వాడి request reject చేసి... ఇంట్లోంచి బయటకు వస్తుంటే...
అమ్మ: ఏంటే ? ఈ రోజైనా అడిగేస్తావా ? మళ్ళీ వచ్చి నన్ను torture చేస్తావా ?
దివ్య ఈ రోజు పక్కా అన్నట్టు expression ఇచ్చి, మెట్లు దిగి వస్తుంటే... నాన్న తనని cross అయ్యి వెళ్తుంటారు...
నాన్న
దివ్య మొహంలో కొంచం అనుమానం మొదలవుతుంది.
దివ్య: నేనేమైన తప్పు చేస్తున్నానా ? నాన్న కి తెలిస్తే బావోదేమో ? అవసరమా నాకు ?
అలా ఆలోచిస్తూ వెళ్తుంటే... ఎదురుగా తెలిసిన వాళ్ళు వస్తుంటారు. వాళ్ళని చూస్తూ
దివ్య: అందరూ నా గురించి ఏమనుకుంటారో ? Cheap గా behave చేస్తున్నానా ?
అలా ఆలోచిస్తూ శివ దగ్గరికి వస్తుంది... దివ్య శివ ని కలవడం, నవ్వడం. దివ్య శివ తనవైపు ఎప్పుడు చూస్తాడా అని వేచి చూడడం, శివ చూడగానే దివ్య తలతిప్పి, నవ్వుకొని శివ వైపు చూడడం... వెనక్కి వచ్చేప్పుడు ఒక్క క్షణం ఆగి...
దివ్య: అడిగెయ్ దివ్యా... అందరూ చేసేదే ఇది... cheap ఏం కాదు...You can do it... నీకు కావాల్సింది పొందకుండా నిన్ను అడ్డుకునేది నువ్వే!
ధైర్యం తెచ్చుకొని వెనక్కి తిరిగి...
దివ్య: భయ్యా! ఒక మసాలా పూరి free-గా ఇస్తావా ?
దివ్య భయంగా, ఆతురుతగా శివ వైపు చూస్తుంది. వేరే వైపు ఎవరితోనో మాట్లాడుతున్న శివ,
దివ్య నవ్వుతు తినేసి ఇంటికి బయలుదేరుతుంది.
దివ్య: ఆర్నెళ్ల నా నిరీక్షణ ఈ రోజు ఫలించింది. If I can do it, you definitely can.
నీకు కావాల్సింది పొందకుండా నిన్ను అడ్డుకునేది నువ్వే! Go for it.