This Story Behind Making Of 'Gamyam' Tells The Struggle Behind Every Filmmaker

Updated on
This Story Behind Making Of 'Gamyam' Tells The Struggle Behind Every Filmmaker

కొన్ని ప్రయాణాలు కొన్ని గమ్యాలు మనల్ని మనమున్న చోటు నుండి ఇంకో చోటు కి చేర్చడమే కాదు మన ఆలోచలని మన వ్యక్తిత్వాన్ని కూడా ఒక చోటు నుండి ఇంకో చోటు కి చేరుస్తాయి.. అలాంటి ఒక ప్రయాణాన్ని చేసి తాను కోరుకున్న గమ్యాన్ని చేరుకునే లోపు తాను ఊహించని మంచి మార్పు ని సాధించిన అభిరామ్ అనే వ్యక్తి కథ గమ్యం . ఈ కథ కేవలం దర్శకుడు క్రిష్ రాసుకున్న అభిరామ్ అనే పాత్రదే కాదు.. ప్రతి మనిషి కథ.., సాటి మనిషిని నవ్వుతూ పలకరించడం కూడా మర్చిపోతున్న ప్రతి మనిషి కథ.., మనిషి ని బాగా చదివిన ఒక దర్శకుడిని మనకు పరిచయం చేసిన కథ..,

ఈ కథ సినిమా గా మారడం వెనుక కూడా ఒక కథ ఉంది.. ఆ కథని పులగం చిన్న నారాయణ గారు సినిమా వెనుక స్టో'రీలు' అనే పుస్తకం లో రాసారు...

డ్రైవర్ తో జరిగిన సంభాషణ తో మొదలయ్యిన కథ.. డైరెక్టర్ క్రిష్ తన ఫార్మసీ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పటి నుండి సినిమాలు అంటే పిచ్చి.., తన ఆలోచలని వెండి తేర మీద చూడాలన్న తపన.., ఎన్నో కథలని తన రూమ్మేట్ కి చెప్పవేరు.. వాళ్ళు ఆసక్తి గా వినేవాళ్ళు.., ఎంతోమంది లాగ యుఎస్ లో ఎంఎస్ అయ్యాక ఇండియా కి వచ్చి ఒక కన్సల్టెంట్ కంపెనీ స్టార్ట్ చేశారు కానీ సినిమా ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేశారు.., యుఎస్ లో ఎన్నో ప్రయత్నాలు ఇక్కడ ఎన్నో ప్రయత్నాలు ఏది వర్కౌట్ కాలేదు. "ఒకరికి ఒకరు" అనే సినిమా కి అసిస్టెంట్ గా తన సినీ జర్నీ స్టార్ట్ చేశారు.

కొన్ని రోజుల తరువాత అశ్వినిదత్ గారి బ్యానర్ లో హిందీ సినిమా "గాంధీ - గాడ్సే" మీద తీయాలని ఆ సినిమా కి కావాల్సిన రీసెర్చ్ కోసం ఎన్నో ఊర్లు తిరిగారు.., గాడ్సే తమ్ముడిని కలిసి మాట్లాడారు. ఈ ప్రయాణం లో అతని డ్రైవర్ గా ఉన్న బుజిద్ తో ఎన్నో మాటలు కలిసాయి. సాంగ్లీ అనే చోట క్రిష్ దాహం వేసింది కానీ ఎక్కడ మినరల్ వాటర్ దొరకలేదు. కానీ బుజిద్ దాహం వేసిన వెంటనే కనిపించిన బోర్ వాటర్ లో నీళ్లు తాగి మీరు తాగండి అని క్రిష్ కి చెప్పాడు.., క్రిష్ కి కోపం వచ్చి "ఈ నీళ్లలో ఎన్నో క్రిములు ఉంటాయి ఇది తాగమంటావ్ ఏంటి" అని అడిగితె., "బాటిల్ వాటర్ లేనిదే నడవని జీవితం అదే జీవితం సార్" అని బుజిద్ అనే మాటలు క్రిష్ కి ఎన్నో ఆలోచనలని పుట్టించాయి.., ఒకే కారులో ఇద్దరు మనుషులు, గమనం ఒక్కటే గమ్యాలు ఆలోచనలు వేరు.., క్రిష్ - ఎవర్ని కలవాలి ఎం పుస్తకం చదవాలని ఆలోచిస్తుంటే.., బుజిద్ - కార్ ఎక్కడ ఆపాలి ఎక్కడ భోంచేయాలి ఇవి ఆలోచిస్తున్నాడు. "కారు అద్దాల్లోంచి చూసేది అసలైన ప్రపంచం కాదు" అని ఒక ఆలోచన క్రిష్ కి మొదలయ్యింది. ఆ ఆలోచనలని ఒక కథ గా మలిచాడు.., అలా రాసుకున్న కథ, గమ్యం సినిమాకి తొలి వెర్షన్.

ఎన్నో స్ఫూర్తులు, ఎన్నో స్మృతులు, సిరివెన్నెల గారి "పెన్ను"దన్ను తాను రాసుకున్న కథలో తన నిజ జీవితం లో కలుసుకున్న ఎంతో మంది వ్యక్తులని స్ఫూర్తి గా తీసుకున్నారు. "ఈజీ డ్రైవర్" "మోటార్ సైకిల్ డైరీస్" లాంటి సినిమాలను, బుద్ధుడి కథని ఆధారం చేసుకున్నారు.., అవన్నీ కలిపి "ఆజ్ జాయేంగే" అని పేరు తో బాలీవుడ్ లో ఈ మూవీ ని తీయాలని నిర్ణయించుకున్నారు.., కానీ కొన్ని కారణాల వాళ్ళ ఆ ప్రయత్నాలకు కామ పడింది.. వేరే సినిమా కోసం చేసిన కొన్ని ప్రయాత్నాలు ఏవి వర్కౌట్ కాకపోవడం తో ఈ "ఆజ్ జాయంగే" కథ ని బయటకు తీసి ఈ సినిమా ని తెలుగు లో తీయాలని నిర్ణయించుకుని.., బుద్ధుడిలా మారిన సిద్ధార్థుడి లా హీరో కూడా ప్రయాణం లో మనుషుల గురించి తెలుసుకుంటాడు కాబట్టి.., ఈ సినిమాకి "సిద్ధార్థ" అని పేరు అనుకుని.., ఈ కథ ని సిరివెన్నెల గారికి వినిపించారు.., ఆయన చెప్పిన కొన్ని సూచనలతో 7 వెర్షన్స్ రాసి 9 నెలల తరువాత మళ్ళీ సిరివెన్నెల గారి దగ్గరికి వెళ్లి కథ చెప్పి పాట రాయమని అడిగితే "ఒక మనిషి గురించి ఇంకో మనిషి గురించి చెపుతున్న కథ ఇది. ఈ కథ కి మొత్తం పాటలు నేనే రాస్తాను.. నాకు డబ్బులెం వద్దు" అని "వన్ వె" "ఎంతవరకు" లాంటి అద్భుతమైన పాటలని ఈ సినిమా కోసం రాశారు..

ఆ కథ తో సినిమా తీయడానికి ఏ నిర్మాత ఒప్పుకోలేదు.., చివరికి క్రిష్ గారి నాన్నే సినిమా తీయడానికి ముందుకువచ్చారు, గాలిశీను అనే పాత్ర కి "అల్లరి నరేష్" ని తప్ప ఇంకెవర్ని ఊహించుకోలేక పోయారు..,ఎంతో మంది హీరోలని సంప్రదించిన తరువాత అభిరాం గా శర్వానంద్ ని తీసుకున్నారు.. కమలిని హీరోయిన్.., రావు రమేష్, ఎల్.బి శ్రీరామ్ లాంటి నటీనటులతో సినిమాని 57 రోజులలో పూర్తి చేశారు. సినిమా క్లైమాక్స్ లో కనిపించే నక్సలైట్ కారెక్టర్ కి ఎవరు కుదరకపోయే సరికి క్రిష్ ఆ పాత్ర ని చేశారు. సిద్ధార్థ పేరు నుండి చివరికి సినిమాకి గమ్యం అనే టైటిల్ ఫిక్స్ అయ్యింది. తక్కువ థియేటర్స్ లో విడుదలైన సినిమా మౌత్ పబ్లిసిటీ తో మంచి హిట్ అయ్యింది. అల్లరి నరేష్ పాత్రకి చాలా మంచి పేరు వచ్చింది.. అల్లరి నరేష్ కి నంది అవార్డ్, సినిమాకి నంది తో పాటు ఇంకెన్నో అవార్డ్స్, "ఎంతవరకు" పాటకి గాను సిరివెన్నెల గారికి అవార్డ్స్.., అలా ఎంతో పేరు డబ్బులు, ఈ సినిమాకి దక్కాయి. ఎవరో ఒక సగటు ప్రేక్షకుడు ఆర్టీసీ క్రాస్రోడ్స్ థియేటర్ నుండి బయటకి వస్తు.."ఈ నా కొడుకెవడో పుస్తకాలు బాగా చదివాడ్రా.. మనిషంటే ఎవడో భలే చెప్పాడు" అని అన్నారంట.. ఆలా మాస్ లోకి వెళ్లిన క్లాసిక్ మూవీస్ లో ఒకటి గా గమ్యం కి తెలుగు సినిమాలలో ఒక ప్రత్యేక స్థానం ఉంది..