How To Crack A Perfect Job Interview? Meet Ujwal And His Website

Updated on
How To Crack A Perfect Job Interview? Meet Ujwal And His Website

2014 విశాఖపట్టణం ఆంధ్ర యూనివర్సిటీ. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ కు campus interview లు జరుగుతున్నాయి. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం విద్యార్థుల భయం, టెన్షన్ ఊపిరులతో వేడెక్కిపోయింది. ప్రతిష్టాత్మక విప్రో లో జాబ్ సాధించడానికి ఐదు దశలు దాటాల్సి ఉంటుంది. ఈ ఐదు దశలు దాటి "ఉజ్వల్" హాయిగా ఉద్యోగం సాధించాడు. మిగిలిన తన తోటి మిత్రులు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అందులో కొందరు తన కన్నా టాలెంటెడ్, చాలామంది మంచి నాలెడ్జ్ ఉన్నవారు కూడా ఉన్నారు. ఈ సంఘటనే Interview buddy పుట్టకకు కారణం అయ్యింది. తర్వాత కొంతకాలం ఉద్యోగం, ఆ తర్వాత జర్మనీలో మాస్టర్స్ చేసినా కాని అతనికి జాబ్ చెయ్యాలని లేదు, జాబ్ ఇవ్వాలని కూడా లేదు, "జాబ్ తెచ్చుకునేందుకు సామర్ధ్యాన్ని పెంచాలని" కలలు కన్నారు. అలా 2015 నుండి ప్రారంభమైన రీసెర్చ్ 2017 కు పూర్తీ స్థాయికి చేరుకొని మాక్ ఇంటర్వ్యాలు తీసుకోవడం మొదలుపెట్టి వేలమందికి ఇంటర్వ్యూ ఇచ్చే సామర్ధ్యాన్ని పెంచారు ఉజ్వల్. ఉజ్వల్ చిన్నతనం నుండి ప్రత్యేకమైన వాడు. ఉజ్వల్ నాన్న గారు ఇండియన్ నేవి లో పనిచేశారు, అమ్మ గారు LIC లో పనిచేస్తున్నారు. వారి కుమారుడికి వ్యక్తిత్వానికి తగ్గ పేరు ముందుగానే పెట్టామని ఇప్పటికీ వారిద్దరూ సంతోషపడుతుంటారు.

Experts మాత్రమే: ఇందులో ఇంటర్వ్యూ తీసుకునేది ఆయా రంగాలలో ఉన్న నిష్ణాతులు మాత్రమే. ఐటి రంగంలో ఉద్యోగానికి ఐటి రంగంలో ఉన్న experts, మెడిసిన్ ఐతే మెడిసిన్ రంగంలోని విలువైన అనుభవం ఉన్న వ్యక్తులు ఇలా..

Interview buddy రెండు విభాగాలుగా పనిచేస్తుంది. మొదటిది ఫైనల్ ఇయర్ లో ఉన్న విద్యార్థుల కోసం, మరొకటి జాబ్ చేస్తూ మంచి పొజిషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికోసం.. ఇప్పటివరకు దాదాపు రెండు సంవత్సరాలలో 14,000 మంది యూజర్స్ తో వారి స్థాయికి తగ్గ ఇంటర్వ్యూలను కండెక్ట్ చేసి కొత్త జీవితాలను ఇస్తున్నారు. Interview buddy లో లాగిన్ అవ్వడం, interview ఇవ్వడం కూడా చాలా తేలిక. ఇందుకోసం ఏ Software నో, ఏ app నో install చేసుకోవాల్సిన పనిలేదు. అంతా వెబ్ సైట్ లోనే జరిగిపోతాయి. Auto record ఉండడం వల్ల Playback చేసుకొని మన ఇంటర్వ్యూ ను, experts ఇచ్చిన సజెషన్స్ మరల తెలుసుకోవచ్చు.

ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ సంఘటన గురుంచి.. సెప్టెంబర్ లో వైజాగ్ గీతం యూనివర్సిటీ నుండి సుమారు 600 మంది విద్యార్థుల ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఇక్కడ కూడా విద్యార్థులు ఎందులో స్ట్రాంగ్ గా ఉన్నారు.? ఎందులో వీక్ గా ఉన్నారు.? ఎలా ఐతే ఇప్పుడు ఉన్న స్థాయి కన్నా ఉన్నత స్థాయికి చేరుకోగలరు లాంటి వాటిని చెబుతూ సూచనలు ఇచ్చారు. 600 మంది ఇంటర్వ్యూ తీసుకుంటే వీళ్ళల్లో 500 మంది TCS, Accenture సెలెక్ట్ అయ్యారు..

మొదటి జాబ్: M.B.B.S పూర్తిచేసిన ఆసిఫా (పేరు మార్చాము) గారు TATA Institute of social service లో పీజీ చేస్తున్నారు. ఫైనల్ ఇయర్ లో ఉండగానే campus interview లు జరుగుతున్నాయి.. ఆసిఫా గారిలో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నాగాని తడబాటు, anxiety కారణంగా చెప్పాల్సిన సమాధానాలు సరైన విధంగా చెప్పలేకపోయేవారు. తన ప్రాబ్లమ్ ను Interview buddy కి వివరించిన తర్వాత హెల్త్ కేర్ రంగంలో expertతో ఒక ఇంటర్వ్యూ చేయించారు. తనలోని అద్భుతమైన నాలెడ్జ్ ని గ్రహిస్తూనే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఆసిఫా గారి తప్పులను, లోపాలను కూడా వివరించి విలువైన సూచనలు ఇచ్చారు. ఫలితం ఆసిఫా గారు ఒక పెద్ద హాస్పిటల్ లో జాబ్ సాధించారు.

అదే కంపెనీలో ఉన్నత స్థానం కోసం: British multinational investment bank and financial services companyలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి అదే కంపెనీలో సీనియర్ పొజిషన్ కోసం అప్లై చేశారు. కాని ఆ ఉద్యోగి ఆశించింది జరగలేదు. Interview buddy గురుంచి తెలిసిన తర్వాత వారిని websiteలో లాగిన్ అయ్యి ఒక expertతో ఇంటర్వ్యూ తీసుకున్నారు అతనికి technical knowledge విషయంలో, attitude, team ని lead చేసే విషయంలో కొద్దిపాటి లోపాలు ఉన్నాయని గ్రహించి అందుకు తగిన సజెషన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఉద్యోగి సీనియర్ పొజిషన్ కు చేరుకుని UK లో జాబ్ చేస్తున్నారు.

ఇలా కొన్ని స్టోరిస్ కాదండి చెప్పుకుంటూ పొతే వందలు, వేలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఏది అత్యధికంగా భయపెడుతుందని ఈ మధ్య ఒక రీసెర్చ్ చేస్తే అందులో మొదటి స్థానంలో వచ్చింది "స్టేజ్ ఫియర్". మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా వాడుకోకపోతే వ్యర్ధం, మనలో టాలెంట్ ఎంత ఉన్నా దాన్ని వ్యక్తీకరించకపోతే కూడా అంతే వ్యర్ధం. మనలోని అంతర్గతంగా ఉన్న గనులను వెలికితీసి మనకే ఉపయోగపడేలా చేస్తున్న ఉజ్వల్ మన పాలిట ఒక కొలంబస్ లాంటివాడు! Official Site of Interview Buddy CLICK HERE Email : hello@interviewbuddy.in Mobile : +91 8500990101