ఇరవై ఏళ్ళు తెలుగు సినిమా కి తిరుగులేని నెంబర్ వన్ మెగాస్టార్ చిరు గురించి కొన్నిఆసక్తికరమైన విషయాలు!

Updated on
ఇరవై ఏళ్ళు తెలుగు సినిమా కి తిరుగులేని నెంబర్ వన్ మెగాస్టార్ చిరు గురించి కొన్నిఆసక్తికరమైన విషయాలు!
ఇప్పుడు నెంబర్ వన్ ఎవరో చెప్పటం చాలా కష్టం, ఎవ్వడి సినిమా హిట్ అయితే ఆడే నెంబర్ వన్ ఇప్పుడు. కాని దాదాపు ఇరవై ఏళ్ళు తెలుగు సినిమా కి తిరుగులేని నెంబర్ వన్ గా కొనసాగిన మెగాస్టార్ చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. 1. సినిమాల్లోకి రాక ముందు చిరంజీవి NCC మెంబెర్ గా ఉండేవారు. 1970 లలో స్వాతంత్ర్య వేడుకల్లో డిల్లి లో జరిగే పెరేడ్ లో పాల్గొన్నారు. 1 2. మొదట నటించిన సినిమా పునాది రాళ్ళూ కాని విడుదల అయిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు. పునాది రాళ్ళు సినిమా చిరంజీవి 7వ సినిమాగా విడుదల అయ్యింది. 2 3. నందమూరి తారక రామారావు గారితో చిరంజీవి నటించిన ఒకే ఒక్క చిత్రం తిరుగులేని మనిషి. అది కూడా రెండో హీరోగా. 3(1) 4. రజినీకాంత్ చిరంజీవి కలిసి రెండు సినిమాలు చేసారు. ఒకటి కాలి(1980) తెలుగు సినిమా కాగ ఇంకోటి రానువ వీరన్(1981) అనే తమిళ్ సినిమా. రెండిట్లో చిరంజీవి విలన్ గా చేసాడు. 4 5. మూడు హిందీ సినిమాల్లో నటించారు. మూడూ రీమేక్ లే. అవి ప్రతిబంద్(అంకుశం), ఆజ్ కా గుండా రాజ్(గ్యాంగ్ లీడర్), ది జెంటిల్మెన్(జెంటిల్మెన్) సినిమాలు. 5 6. మూడు తమిళ సినిమాల్లో నటించారు. రానువ వీరన్(1981) లో విలన్ గా, 47 నాతుక్కల్(1981) లో హీరో గా, మాపిల్లై(1989) లో ప్రత్యేక పాత్రలో. 6 7. రెండు కన్నడ సినిమాల్లో నటించారు. సిపాయి(1996) లో ప్రత్యేక పాత్ర లో, శ్రీ మంజునాథ(2001) లో శివుడు గా. 7 8. 1992 లో దేశం మొత్తం మీద ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరో చిరంజీవి. అమితాబ్ బచన్ కి కూడా అంత ఇవ్వలేదట. జాతీయ THE WEEK Magazine ఫ్రంట్ పేజి లో Bigger Than Bachchan అని చిరంజీవి ఫోటో వేసారు. 8 9. ఒకే హీరో సింగల్, డబుల్, ట్రిపుల్ రోల్స్ లో చేసిన కమర్షియల్ చిత్రాలు 100 రోజులకు పైగా ఆడిన ఏకైక హీరో. 9 10. ఆస్కార్ అవార్డు ల కార్యక్రమానికి "Guest of Honor" గా ఆహ్వానం అందుకున్న తొలి సౌత్ ఇండియన్ హీరో. 1987 ఆస్కార్ అవార్డ్స్. 10 11. భారతీయ భాషల్లోకె కాదు, రష్యా బాష లోకి కూడా చిరంజీవి సినిమాలు రెండు డబ్ అయ్యాయి. అవి స్వయం కృషి, పసివాడి ప్రాణం. pasivadi pranam 12. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు లక్ష మందికి పైగా రక్తం అందించబడింది, వెయ్యి మందికి పైగా కంటి మార్పిడి జరిగింది. Blood banks in Hyderbad ఇవ్వండి మన చిరంజీవి గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ....మెగా స్టార్ అని ఊరికే అనేస్తారెంటి మరి !! మీకు తెలిసిన అరుదైన విషయాలు కామెంట్ చేయండి.