Intermediate రోజుల్లో జరిగిన మరచిపోలేని జ్ఞాపకాల సమాహారం!!

Updated on
Intermediate రోజుల్లో జరిగిన మరచిపోలేని జ్ఞాపకాల సమాహారం!!
ఏదో చేసానని అవార్డు తో పాటు గా ప్రశంశాపత్రం(సర్టిఫికేట్) ఇచ్చారు ఆఫీసు లో, తోడుగా ఇచ్చిన ప్రశంశాపత్రాన్ని ఫైల్ లో పెడదామని తీసాను. ఈ ప్రశంశ పత్రాన్ని పది, ఇంటర్, డిగ్రీ ధ్రువపత్రాల మధ్య చేర్చుతున్నప్పుడు ఇంటర్ కి సంబందించిన పత్రాలు కింద పడ్డాయి. అవి తీసి చూస్తుంటే.. ఎన్నో జ్ఞాపకాలు నా మది లో కదిలాయి. కళాశాల హాస్టల్ లో ఉంటూ ఇంటర్ చదివిన వారందరి మదురమైన జ్ఞాపకాలు మరొక్కసారి గుర్తుచేద్దాం అని ఆర్టికల్ రాస్తున్నాను..
1. బాలుడు కాస్తా..యువకుడు అయ్యే సమయం కదా అది !!! cb1 2. ఏదో అనుకున్నాను.. ఏదో జరిగింది... ఎలా ఉంటుందో ముందే తెలిస్తే పది పాస్ అవుతారా ఒక్కరైన !? cb2 3. నిద్ర విలువ, గొప్పతనం, అవసరం ఏంటో తెలిసింది ఆ రోజుల్లో.... cb3 4. పుస్తకాలు, పెన్నులు, పరిక్షా పత్రాలు, ఫలితాలు తప్ప ఇంకో లోకం ఉండేది కాదు కదా... cb4 copy 5. తీహార్ జైల్లో ఉండే ఖైదీలు విడుదల అయినప్పుడు కూడా మనంత ఆనంద పడేరేమో... cb5 6. పేరుకే ఇంట్లో ఉన్నాం అనే ఆనందం..అసైన్మెంట్ లంటూ ఫిట్టింగ్ పెట్టె వారు కదా.. cb6 7. మీదే ఊరురా..ఇష్టమైన హీరో ఎవరు...మనోడే రా... రేపటినుండి మాతో నే తిరగలి నువ్వు... cb7 8. మురికి లో తామర పువ్వు పెరిగినట్టు..అంత గందర గోళం లోను మిత్రులు దొరికేవారు.. cb8 9. తారక మంత్రం కన్నా గొప్పది, బ్రంహాస్త్రం కన్నా తిరుగులేనిది చదువు అనే మంత్రం... cb9 10. అర్ధం చేసుకోలేనంత మూర్ఖులు కాదు, కాని ఎందుకు అర్ధం చేసుకోరో ఇప్పటికీ తెలీదు... cb10 11. అప్పుడు చెప్పలేదు...ఇప్పుడు చెప్పినా ఉపయోగం లేదు.. cb11 12. దేవుడే దిగివచ్చి..ఏదైనా కోరుకోమంటే .. cb12 ఆర్టికల్ రాసేసాను..ఫైల్ మూసేశాను..మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నాను. ఏదో చిన్న ప్రయత్నం, మీ జీవితం లో కొన్ని అనుభవాలతోనైనా కలిసుంటే షేర్ చేయండి.