గవర్నమెంట్ స్కూల్ వద్దు, గవర్నమెంటు హాస్పిటల్ వద్దు కాని గవర్నమెంట్ జాబ్ కావాలి ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగంలో సుఖం ఉంటుంది. చిత్తశుద్దిగా పనిచేయనవసరం లేదు, నెల నెలకు మంచి జీతం, ప్రజలను ఇబ్బంది పెట్టి లంచాలు.. ఇది చాల వరకు గవర్నమెంట్ ఉద్యోగి జీవితం నిజమే దాదాపు అందరి జీవితం ఇలానే ఉండొచ్చు.. చాల మంది అదే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రాకులాడుతుంటారు.. కాని జోసెఫ్ దృష్ఠి లో అలా కాదు. విశాఖపట్నం జిల్లా జిమాడుగుల మండలం పెద్దలోచలి పంచాయితి పరిధిలోని బొడ్డాపుట్టు గ్రామంలో జోసెఫ్ ఉపాధ్యాయిడుగా పనిచేస్తున్నాడు. సాధారణంగా మాములు మండలంలో, పట్టణంలో పని చేస్తున్న టీచర్లు అంతగా కేరింగ్ గా విద్యార్ధులను పట్టించుకోరు ఇంకా ఒక మారుమూల గ్రామంలో చేసేవారైతే ఇంకేటి అక్కడి ప్రజలు నిరాక్ష్యరాస్యులు, లోక జ్ఞాణం తెలియని అమాయకులు అని వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటారు.. కాని జోసెఫ్ అలా కాదు సరికదా ఏ ఉపాధ్యాయుడు కూడా సాహసించలేని సాహసానికి నాంది పలికాడు..
తను నివాసముంటున్న ప్రాంతం నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరం ఉన్న ఆ పాఠశాలను చేరుకోవాలంటే కొండలను దాటుతూ, రాళ్ళను తొక్కుతూ కారఅడవిని దాటాలి.. అక్కడికి చేరుకోడానికి ఏ విధమైన రవాణా సదుపాయాలు లేవు ఇందుకోసం గవర్నమెంట్ ను అర్ధించకుండా, నిందించకుండా తన సొంత డబ్బుతో రెండు గుర్రాలను కొని గుర్రపు స్వారీ నేర్చుకొని 3 గంటల్లో 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ ఊరుకు చేరుకుంటున్నాడు. బొడ్డుపురం గ్రామంలోని పాఠశాలకు ఆ లోయలు రాళ్ళల్లోనుండి నడిచి వెళ్ళాలంటే 5 గంటలకు పైగా సమయం పడుతుంది కాని గుర్రపు స్వారి ద్వారా ఆ ప్రయాణాన్ని 3గంటలకు తగ్గించుకున్నాడు. ఇలా వారం రోజుల పాటు విధులు నిర్వహించి శనివారం రాత్రికి తిరిగి స్వంత ఊరికి వస్తాడు
గిరిజనుల ఆవాసమైన బొడ్డాపుట్టు గ్రామంలో "కోదు" అనే గిరిజన తెగ ఉంటుంది వారందరు కోదు భాష మాత్రమే మాట్లాడతారు వేరొక భాష రాదు. దీని వల్ల ఇప్పటి ప్రస్తుత నాగరికతకు, వాస్తవ ప్రపంచంతో సంబందాలు లేవు జోసెఫ్ అకుంటిత దీక్షతో ఇప్పుడు గిరిజన విద్యార్ధులు తెలుగు నేర్చుకోవడం, మాట్లాడటం, చదవడం మొదలుపెట్టారు.. కటిక చీకటిలో ఉన్న వారి జీవితంలోకి బంగారు భవిషత్తును నిర్ధేశించడానికి చీకటి సూర్యుడిలా ఆ మన్యంలో జోసెఫ్ అవతరించాడు.. జోసెఫ్ గారు మీలాంటి టీచర్లు మండలానికి ఒక్కరున్న మనదేశపు స్థాయి అత్యున్నత స్థాయిలో ఉంటుంది.. మీ లక్ష్య చేదనలో భారతదేశం గర్వించదగ్గ పౌరులు మన సమాజానికి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.