This Contrasting Change In The Perspective Of Society Towards This Guy Is Totally Relatable!

Updated on
This Contrasting Change In The Perspective Of Society Towards This Guy Is Totally Relatable!

St.John’s Auditorium - Feliciation To Mr.Ram

15 ఏళ్ళ క్రితం - Ram, You are fit for nothing . Arent you ashamed of yourself?? You need not be, Your Parents should be ashamed of You . Cant even solve a small Trigonometry problem,Cant memorise basic mathematic formulae,What will you do in future.You are Zero. Get Out of My Class . Don’t ever Dare to enter into my Class again .

ప్రస్తుతం – I Take the Pleasure in Inviting The Pride of St.John’s ,Inspiring Personality to the youngsters present here ,Mr. Ram .The Author of Best Selling Book of this year . Join Your hands and welcome the Hero of St.John’s.

చుట్టాలు ఆరోజు – ఏరా?ఎలా ఉన్నావ్ ??ఇంటర్మీడియట్ కి వోచేసావ్ ఇంకా బుద్ది రాలేదేంట్రా నీకు, చిన్న పిల్లోడివా చందమామ కథలు చదువుతున్నావ్,IPE లో మార్కులు తగ్గితే ఎంసెట్లో ర్యాంకు ఎక్కడికో వెళుతుంది, బుద్దిగా చదువుకోరా.మన ఫ్యామిలీ లో నువ్వోకడివే ఇలా ఉన్నావ్ ,అందరూ క్లాసు టాపర్స్, నువ్వేమో పాస్ మార్కుల కోసం ముక్కి ములుగుతున్నావ్. ఇలానే ఉంటె ఎందుకు పనికి రాకుండా పోతావ్ .

చుట్టాలు ఈరోజు – మా వాడు అని చెప్పడం కాదు కాని ఇలాంటి వాడు ప్రతీ కుటుంబంలో ఒక్కడు ఉన్నా చాలు. మా కుటుంబంలో రామ్ ఇప్పుడొక హీరో . నేను పిల్లలందరికీ చెబుతుంటాను పెద్దయ్యాక మా రామ్ లా అవ్వాలని . మా వాడు ఈ స్థాయికి చేరుకుంటాడని నాకు ఎప్పుడో తెలుసు . అప్పట్లో - రేయ్ లైఫ్ ని సీరియస్ గా తీస్కోరా, అడ్డీ మే గుడ్డీల ఎదో పాస్ ఐనవ్ కదా ఇంజనీరింగ్ ,నా మాట విను,నాతోటి రా ఆ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుందాం. ఎదో ఓ జాబ్ ఒస్తది . అప్పుడు నీ ఇష్టం ఒచ్చినట్లు ఎమన్న కథలు పడొచ్చు.మనోళ్ళు అందరూ లైఫ్ లో సెటిల్ ఐపోయి బిందాస్ ఉన్నారు. నా మాట విను . ఇవన్నీ కాదు నా తోవ నాదే అంటవా , నువ్వెవరో నేనెవరో ఇగ,బయట నా దోస్తుని అని చెప్పకు రా,నాకున్న ఇజ్జత్ పోతది .

ఇప్పట్లో – చందు అనే నేను రామ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకునేందుకు చాలా చాలా గర్వపడుతున్నాను . ఎప్పటి నుండో రామ్ చాలా క్లియర్ గా ఉన్నాడు తన గోల్ గురించి ,ఇలాంటి రోజు వస్తుందని నాకెప్పుడో తెలుసు.ఈరోజు రామ్ గురించి మాట్లాడుతుంటే ఎంత సంతోషంగా ఉందొ మాటల్లో చెప్పలేను.

ఇంజనీరింగ్ పరీక్షల్లో తప్పినప్పుడు చుట్టాలు – వీడికి ఇంక చదువు ఎక్కదు,ఎదో ఓ పనిలో పెట్టేయాలి,నువ్వు చెప్పు అన్నయ్యా మాట్లాడమంటావా?? అరె ఇక్కడ వీడి గురించి ఇంత మంది భాధ పడుతుంటే ఎలా మాట్లాడకుండా కూర్చున్నాడో చూడు .ఎం చూస్కొని రా ఇంత పొగరు నీకు . ఒక్క సబ్జెక్టు పాస్ అవ్వలేవారా . ఎం సాదిస్తావ్ రా జేవితం లో నువ్వు ??? అసలు ఎట్లా బతుకుతావ్ . ?? చదువులో మార్కులు రావు,వేరే పని ఏది చేతకాదు ఇలానే ఉంటె చివరికి చప్రాసి పనికి కూడా పనికిరావు నువ్వు చూస్తుండు ..

ఇప్పుడు – ఈరోజు ఇందరి ఆనందానికి కారణం అయ్యాడు , మా అన్నా వదినల మోహంలో గర్వం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది . ఇంత సాదించినా అసలు ఏమి తెలియనట్టు మౌనం గా ఉన్నాడు,ఆ వినయమే ఈరోజు ఇక్కడి నిలబెట్టింది . సమాజం ఆప్పుడు - వీడొక పనికిమాలినోడు ఏ పనీ చేతకాక గాలి కబుర్లు చెబుతూ తిరుగుతాడు,ఏవేవో కథలు అంటూ వాడి టైం,వాళ్ళ నాన్న సంపాదన అంతా నాశనం చేసేస్తున్నాడు ,అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అయినా ఉండొద్దూ పిల్లాడి భవిష్యత్తు గురించి .

సమాజం ఇప్పుడు – ఇంట్లో వాళ్ళు పూర్తిగా వెన్ను తట్టి ప్రోత్సహించారు ,వాడు కూడా పూర్తిగా వాడి లక్ష్యం కోసమే ప్రయత్నించాడు వేరే ఏ పక్క దారి చూడకుండా చివరికి సాదిన్చేసాడు . మాంచి భవిష్యత్తు ఉంటుంది ఇక వాడికి అదే సమాజం ఆరోజు – ఇంత మూర్ఖత్వం ఏంటి వీడికి,ఎవరు చెప్పినా వినకుండా గుడ్డిగా ముందుకి వెళ్తా అంటాడు,ఎంత మందిని చూడట్లేదు . అయినా చెప్పిన మాట వినక పోతే చెడంగా చూస్తాము అనే సామెత ఉండనే ఉంది కదా

అదే సమాజం ఈరోజు – వీడి పట్టుదలే గెలిపించిది , అందరూ ఏదేదో చెప్పినా అవేమి పట్టించుకోకుండా నమ్మకంతో అనుకున్నది సాదించాడు .

సమాజం ఆనాడు – వీడిది పూర్తిగా పిచ్చి,అంత కష్టపడి చదివిస్తే ఉద్యోగం చేయక సోమరిపోతులా తిని తిరుగుతున్నాడు . రేయ్ చక్కగా చదువుకోకపోతే పెద్దయ్యాక అదిగో వాడిలా ఎందుకూ పనికి రాకుండా పోతారు .

సమాజం ఈనాడు – తపన,ధైర్యం,నమ్మకం ఉంటె ఏదైనా సాదిచగలడు అని నిరూపించాడు . అంత చదువు చదివినా వాడికి నచ్చిన దారిలో కష్టమని తెలిసినా వెళ్లి గెలిచాడు . రేయ్ మీరు కూడా పెద్దయ్యాక అదిగో ఆ అన్న అంతటి గొప్ప వాళ్ళు అవ్వాలి.

అమ్మా నాన్న - అప్పుడు – చిన్నా,నువ్వేమి ఎక్కువ ఆలోచించకు,మనకి ఏది రాసి పెట్టి ఉంటె అది వస్తుంది,అందరికీ ఒకేలా ఉండదు కదా.అందరూ ఏదేదో అంటున్నారని నువ్వేం భాద పడకు.నువ్వేదో అనుకున్నావ్ కదా,నీ ప్రయత్నం నువ్వు చెయ్, మేమున్నాం కదా.ఒకవేళ అది కూడా అవ్వకపోతే అప్పుడు చూద్దాం.ఎక్కువగా ఆలోచించి నువ్ అనుకున్నది వోదిలేయకు .

అమ్మా నాన్న - ఇప్పుడు – చిన్నా, మొత్తానికి నువ్ అనుకుందే చేసావ్ కదా,ఎక్కువగా ఆలోచించి నేను అంతా సాదిన్చేసా అనుకోకు,ఇది మొదటి అడుగే . ఇప్పుడు అందరూ నిన్ను ఎక్కడో పెట్టేస్తారు అవేవి పట్టించుకోకుండా ఈ పేరు ఎలా నిలబెట్టుకోవలో చూడు,ఇంకా గొప్పగా ఎం చేయగలవో ఆలోచించు .

రామ్ – ఆరోజు భయంతో చెప్పలేకపోయింది – అందరూ ఒకేలా ఉండాలా ఏంటి ?? అరె నాకు రానిది నేనలా రా చేసేది,ఎవరో ఎదో చేస్తే నన్నూ అదే చేయమంటారు,అప్పుడు వాడికీ నాకు తేడా ఏముంటుంది. ఎవరికోసమో కుట్టించిన బట్టలలోకి నా ఆకారం మార్చుకొని మరీ వేసుకోమంటారే౦టి? అందరికీ నా ఫెయిల్యూర్సే కనపడుతున్నాయి నేను చేసే ప్రయత్నాలు ఎవరికీ కనపడట్లేదు.ఎవరేమన్నా అనుకోనీ ,నా జీవితం నాది, అర్ధం చేసుకునే అమ్మా నాన్న ఉన్నారు,నాకు ధైర్యం ఇచ్చి ముందుకెళ్ళమని అంటున్నారుగా.ఆ నమ్మకం నిలబెట్టుకుంటే చాలు.. నా గురించి చెప్పుకోడానికి ఏమి లేదు,ఎదో ఓ రోజు అందరూ నా గురించి గొప్పగా మాట్లాడుకుంటారు, ఈ అవమానలే సన్మానాలు మనకి, ... అవన్నీ కాకపోయినా పర్లేదు, నేను అనుకున్న లక్ష్యం చేరితే చాలు . ఈ మాటలు మాట్లాడాడం ఎందుకు,చేసి చూపించాలి , అసలు నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు కదా ఎవ్వరూ ,ఎదో ఓ రోజు,నాకంటూ ఓ రోజు ఉంటుంది గా అప్పుడు ఈ ప్రపంచమే నా గురించి మాట్లడుకుంటుంది .

రామ్ – ఈరోజు ధైర్యంగా మాట్లాడింది – అందరికీ చాలా చాలా థాంక్స్ ,మీ అందరి ప్రోత్సాహం వల్లే ఇక్కడి దాక వచ్చాను, భాదలో ఉన్నప్పుడు ,ఓటమితో కుంగిపోయినపుడు మాట్లాడడానికి ఎవరూ ఉండరు విజయం సాదిన్చినపుడు ,సంతోషంగా ఉన్నపుడు మాట్లాడడానికి మాటలు ఉండవు ఇక్కడున్న అందరూ నాకు ఎదో ఒక రకంగా నాకు స్పూర్తిని ప్రేరణని ఇచ్చిన వారే.అందుకే అందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుప్తున్నాను . నేను జీవితంలో పడిపోయిన ప్రతీసారి ఓడిపోయినా ప్రతీసారి మీ మాటలే నాకు ఎంతో స్పూర్తినిచ్చాయి అందుకే మీకేన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే . నేను ఇది సాదించాలని అనుకున్నప్పుడు అందరూ నవ్వారు అప్పుడే అర్ధం అయ్యింది నా లక్ష్యం గొప్పదని ఆ వెక్కిరింపులే ఆ అవమానలే ఆ సూటిపోటి మాటలే నాకు స్ఫూర్తి మంత్రాలుగా పనిచేశాయి, నాకెప్పుడు నా మీద చిన్న అనుమానం కలిగినా నేనెప్పుడో రాసుకున్న ఈ మాటలని గుర్తుచేసుకుంటూ ఉండేవాడిని , ఇక్కడున్న వాళ్ళని చూస్తుంటే చిన్నప్పుడు నన్ను నేను చూసుకుంటున్నట్లుగా ఉంది అందుకే మనసులో ఉన్న ఆ మాట చెబుతాను ఎక్కడైతే అవమానం గెలుస్తుందో ఎప్పుడు ఓటమి నీకు ఎదురవుతుందో ఎక్కడ సమాజం నిన్ను వేలివేసినట్లుగా చూస్తుందో ఎక్కడ ప్రతికూలత నీ నీడలాగా వెంటాడుతుందో అక్కడ నీ మనసులో ఒక చిన్న కాంతి ప్రజ్వలిస్తుంది, అది అగ్నిలాగా మారి నిన్ను సూర్యునిలా ప్రకాశించేలా చేస్తుంది . నా మనసులో మాటని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు