Here's The Successful Tale Of An MBA Grad Who Returned From London To Hyderabad And Started A Unique Food Truck!

Updated on
Here's The Successful Tale Of An MBA Grad Who Returned From London To Hyderabad And Started A Unique Food Truck!

ఇంతకుముందంటే కొన్ని రకాలైన బిజినెస్, జాబ్స్ చేయాలంటే నామోషిగా ఉండేది, అలా ఉండడానికి పరిస్థితులు కూడా ఒక కారణం కావచ్చు. కాని ఇప్పుడు పరిస్థితులు అలా లేవు.. ఇంకొకరిని మోసం చేయకుండా న్యాయంగా ఏ బిజినెస్ చేసినా అది ట్రెండ్ ఐపోతుంది. ఉదయశ్రీ కూడా అదే నమ్మి లండన్ లో ఎం.బి.ఏ చేసొచ్చాక ఏ మల్టీ నేషనల్ కంపెనీలో జాబ్ చేయకుండా తనకెంతో ఇష్టమైన ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేసేశారు.

Why Dessert Truck?: "Necessity Is The Mother Of Inventions".. ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ ఏదో కొత్తది వస్తుంది. టిఫిన్స్, మీల్స్ కోసం చాలానే ట్రక్స్ ఉన్నాయి కాని ఐస్ క్రీం, కేక్స్ కోసం ఏ ట్రక్ లేదు అందుకే దీనిని స్టార్ట్ చేద్దామని తనే ప్రత్యేకంగా తయారుచేయించారు.

Starting Trouble: జాబ్స్ లో మాత్రమే కాదు.. ఏ బిజినెస్ కైనా ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందులను సమర్ధవంతంగా ఎదుర్కున్నప్పుడు మాత్రమే సక్సెస్ అందుకోవచ్చు. ఉదయశ్రీ కూడా స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కుని సమర్ధవంతంగా ప్రతిరోజు సమస్యలను అదిగమిస్తున్నారు. ఇక్కడ కప్ కేక్స్, బ్రౌనీస్, కుకీస్, ఇంకా కొన్ని రకాల ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి. ఇవన్నీ కూడా ఉదయ శ్రీ తయారు చేయిస్తున్నారు. మిగిలిన వాటిలా ఒక రెస్టారెంట్ స్థాపిస్తే వాటికి నిర్వహణ ఖర్చులు, పవర్ బిల్, ఇంకా రకరకాల ఖర్చులుంటాయి. అదే ఫుడ్ ట్రక్ ఐతే Investment, Maintenance Expenditure తక్కువగా ఉండడం వల్ల ఫుడ్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది ఇలాంటి ఫుడ్ ట్రక్స్ వల్ల ఇద్దరికి లాభమే ఉంటుంది.

You can find Ciel Dessert Food Truck near Maharaja Chaat at Madhapur and Rd. no 45 Jubilee Hills.