మనలో చాలామందికి వ్యవసాయం చెయ్యాలనే తపన ఉంటుంది. ఐతే వ్యవసాయ భూమి లేకపోవడం, ఉన్నా.., వర్షాలు నీటి సమస్యలుండడం లాంటి రకరకాల సమస్యల మూలంగా వ్యవసాయం చెయ్యాలనే తపన మధ్యలోనే కార్యరూపం దాల్చడం లేదు. బహుశా మన బాధలను, ఇష్టాలను ప్రకృతి ముందుగానే గమనించి ఉంటుంది అందుకే భూమి లేకపోయినా ఉన్న నీటిని పూర్తిగా ఉపయోగించుకుంటూ చేసే హైడ్రోఫోనిక్ వ్యవసాయ పద్ధతులను తీసుకువచ్చేసింది. ఈ పద్ధతి వ్యవసాయం విదేశాలలో ఇప్పటికే చేస్తున్నారు. మన దేశంలో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతుంది అలా అవగాహన పెరగడానికి కారణమవుతూ హైడ్రోఫోనిక్ కు అవసరమయ్యే వస్తువులను తయారుచేస్తున్న తరుణ్ జర్నీ ఈరోజు.
మట్టి అవసరం లేకుండా కేవలం కొద్దిపాటి నీరు, ఇతర పోషకాల సహాయంతో ఫార్మింగ్ చేయడమే హైడ్రోఫోనిక్ వ్యవసాయం. మాములు వ్యవసాయంలో మొక్కకు ఇవ్వాల్సిన నీరు కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చేది, ఇక్కడ అలా నీరు వృధా కాదు. ఒక్కసారి నీటిని అందిస్తే 30 రోజుల వరకు మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు 10 నుండి 50ml(మొక్కను బట్టి) చొప్పున 99% శాతం నీరు పూర్తిగా మొక్కకే చేరుకుంటుంది. అకాల వర్షాలు వస్తాయని, లేదంటే రాకపోతే అనే దిగులే ఉండదు. హైడ్రోఫోనిక్ ద్వారా ప్రత్యేకంగా ఖాళీ స్థలంలో ప్లాస్టిక్ పైపులలో, ఇంటి డాబా పైన, గోడలపైన ఇలా రకరకాల అనువైన చోట్లలో ఈ ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఐతే ఇప్పటి వరకు ఇలాంటి ఫార్మింగ్ చేస్తున్న ఎక్కువమంది తమ వస్తువులను తామే తయారుచేసుకుంటున్నారు. కొత్తగా చేయాలనుకునే వారికి మాత్రం ఇబ్బందులు తగ్గబోతున్నాయి తరుణ్ వల్ల. తరుణ్ ఈ పరికరాల కోసం ప్రత్యేక మెటీరియల్స్ ను కలిపారు. రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్ తో ప్లాస్టిక్ పైపులు, అరటిబొందు, కొబ్బరిపీచు, ప్రత్యేకమైన న్యూట్రీషన్స్ కలిపి తయారుచేసిన ఎరువును కూడా తయారుచేశారు. ఇవి మొక్క ఎదుగుదలకు కృషిచేస్తుంది.
తరుణ్ జీవనయానం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. ఎప్పుడు చదువును కొనసాగుతుందో ఎప్పుడు ఆగిపోతుందో తనకు తెలియదు. చిన్నప్పుడే నాన్న చనిపోయాక వాస్తవ ప్రపంచంలోకి వచ్చి పడాల చారిటబుల్ ట్రస్ట్ వారి విలువైన సహాయంతో చదువు కొనసాగించాడు. అలాగే మంచి మార్కులు రావడం వల్ల కాలేజ్ వారు ఫీజు కూడా తగ్గించారు. ఆ తర్వాత ఏ కాలేజ్ లో ఐతే చదువుకున్నాడో అదే తరుణ్ తూర్పుగోదావరి జిల్లాలోని ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. రైతుల కష్టాన్ని చూసి రైతుల పిల్లలు కూడా ఆ రంగానికి రాకపోవడం చూశాడు. ఈ స్టార్టప్ వల్ల తనకు ఇంకా సమాజానికి ఉపయోగం అని మొదలుపెట్టారు. ఈ స్టార్టప్ మొదలుపెట్టిన కొంతకాలంలోనే అమెరికాలోని బోస్టన్ నార్త్ ఇస్ట్రన్ యూనివర్సిటీ నుండి బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డును కూడా అందుకున్నాడు.
20 రోజుల్లో ఆకుకూరలు, టొమాటో, క్యారెట్, ఆలు, మొదలైన అన్నిరకాల వెజిటేబుల్స్ తో పాటు సీజనల్ ఫ్రూట్స్ ను అనుకూలమైన టెంపరేచర్ ను కలిగించి ఈ హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ లో పండించుకోవచ్చు. అలాగే తరుణ్ పశువుల మేత కోసం ఏడు లేయర్లతో ప్రత్యేకమైన ర్యాక్ ను కూడా తయారుచేశారు. ఇందులో నాలుగు రకాల పశువుల మేత ద్వారా దాదాపు రూ.50,000 వరకురైతు లాభం పొందవచ్చు.
For more details: CLICK HERE Phone: 94928 59634