మన Childhood Friends కలిసినా గాని, లేదంటే ఇప్పటి Friendsని కలిసి మాట్లాడుకుంటున్న సమయంలో గాని ఏ Topicలో విభేదించినా గాని ఈ విషయంలో మాత్రం మన ఆలోచనలో తేడా ఉండదు.. ఏది ఏమైనా చిన్నప్పుడే బాగుంది రా.. "Especially సంక్రాంతి పతంగులు" అని ఇంకా ఎన్నెన్నో చిన్నప్పటి Memories తలుచుకుని 'జీవితంలోని ఆనందమంతా చిన్నతనంలోనే ఉండిపోయింది' అని బాధపడుతుంటాం.. అలా మళ్ళి ఇంకోసారి రాని Situations గురించి ఆలోచించడం కన్నా ఇప్పుడు మనం అనుకుంటే అంతకన్నా ఎక్కువ ఎంజాయ్ చేసేయ్యోచ్చు. కేవలం ఎంజాయ్ మాత్రమే చేయాలనుకుంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎంజాయ్ తో పాటు ఎంతోమంది పిల్లల చదువుకు విరాళం ఇవ్వాలనుకుంటే Hyderabad International Kite Festivalకు వెళ్ళాల్సిందే..
మన తెలంగాణ గవర్నమెంట్ ఇంకా అగా ఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనవరి 12 నుండి 17వరకు ఈ Hyderabad International Kite Festival జరుగబోతుంది. Main గా ఈ Kite Festival Motto ఒక్కటే.. టూరిజమ్ పరంగా మన తెలంగాణ భారతదేశంలోనే మొదటి 5స్థానాలలోకి తీసుకురావాలనే ఉద్దేశం, దాంతో పాటు ఈ Kite Festivalకి వచ్చే వారి నుండి విరాళాలు సేకరించి ఆనాధ, పేద పిల్లలకు చదువునందించడం. ఐదు రోజులపాటు జరుగబోతున్న ఈ ఫెస్టివల్ కు సుమారు 50వేల మంది హాజరుకాబోయే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు.
హైదరాబాద్ లో జరుగుతున్నా గాని మనదేశం నుండే కాక 17 International Kite Flying Teams ఇక్కడికి రాబోతున్నాయి. ఈ Festival హైదరాబాద్ అగా ఖాన్ అకాడెమి ఇంకా వరంగల్, యాదగిరిగుట్టలలో కూడా జరుగుతాయి. పండుగ రోజులు గ్రౌండ్ లో జరుపుకోవడమేంటి అని ఆలోచించాల్సిన అవసరం లేదండి.. మన ఇంట్లో కన్నా ఈ అకాడెమిలోనే ఫ్యామిలితో సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవచ్చు. కేవలం పతంగులు మాత్రమే కాకుండా పుడ్ ఫెస్టివల్, తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, రీజినల్ క్రాఫ్ట్స్, అక్కడికి వచ్చే చిన్నపిల్లల కోసం Fun Activities లాంటివన్నీ కూడా మనం పండుగరోజుల్లో ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.