'Auto Cleaning' e-Toilets Launched To Combat Hyderabad's Open Defecation Problem!

Updated on
'Auto Cleaning' e-Toilets Launched To Combat Hyderabad's Open Defecation Problem!

ఇంటర్నేషనల్ స్థాయిలో బెస్ట్ సిటీస్ లో ఒకటిగా ఉన్న మన హైదరాబాద్ లో టాయిలెట్స్ కోసం భయంకరమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం.. ఉన్న కొన్ని అయినా బాగున్నాయా అంటే దాని లోపలికి వెల్తే కళ్ళు తిరిగిపోతుంటాయి. తెలంగాణ రాష్ట్రం రాక ముందు నుండి హైదరాబాదీలు ఎదుర్కున్న అతి ప్రధాన సమస్యలలో ఇదీ ఒకటి. నిత్యం లక్షల్లో తిరిగే హైదరాబాద్ రోడ్ల మీద అతి తక్కువ సంఖ్యలో టాయిలెట్స్ ఉండడంతో చాలా ఇబ్బందులను నగరవాసులు ఎదుర్కుంటున్నారు.. మగవారి పరిస్థితే కష్టంగా ఉంటే ఇక మహిళల పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.. "ఇప్పుడివన్నీ ఒకప్పటి మాట, ఇక ఈ ఇబ్బందులు ఒకప్పుడుండేవి" అనే రోజులలోకి మనం వెళ్తున్నాం. కొన్ని ప్రైవేట్ సంస్థల సహకారంతో GHMCవారు ఈ - టాయిలెట్స్ ని స్థాపించుతున్నారు. మొదట రద్దీ ఎక్కువగా ఉండే 15 ప్రదేశాలలో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు.

ఇంట్లోనే వాటర్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటుంది ఇంకా పబ్లిక్ టాయిలెట్స్ గురించి చెప్పనవసరం లేదు.. కాని ఈ - టాయిలెట్స్ వాటర్ తక్కువ వినియోగించుకుంటుంది. క్లీనింగ్ కోసం ఎవరి అవసరం లేకుండా ఇది పనిచేస్తుంది. ప్రత్యేకంగా ఆటో క్లీనింగ్ సదుపాయం ఉండడం వల్ల ఎప్పటికప్పుడు వాటిని అవే పరిశుభ్రంగా ఉంచుకుంటాయి. ప్రస్తుతం పాతబస్తీలో ప్రారంభించిన ఈ - టాయిలెట్స్ త్వరలోనే నగరమంతటికి విస్తరించనున్నాయి. పురుషుల టాయిలెట్స్ ని "హీ-టాయిలెట్స్ గా, స్త్రీలవి షీ-టాయిలెట్స్ గా పరిగణిస్తారు.

Anaerobic Bio-degradation ద్వారా నిత్యం ఈ టాయిలెట్ పరిశుభ్రంగా ఉంచుకుంటుంది. పరిస్థితిని బట్టి సెప్టిక్ ట్యాంక్ కు వ్యర్ధాలు మళ్ళించేలా ఏర్పాటు చేయడంతో ప్రతిరోజు ఏ ఇబ్బంది ఉండే అవకాశం ఉండదు. LED Indication Facility ఉండడం మూలంగా టాయిలెట్ లోపల ఎవరైనా ఉంటే బయట రెడ్ లైట్ వెలుగుతుంది, ఎవరూ లేకుంటే గ్రీన్ లైట్ వెలుగుతుంది. 225లీటర్ల నీటి సామర్ధ్యం ఉన్న ట్యాంక్ దీనికి అటాచ్ చేసి ఉంటుంది. ఇన్ని సధుపాయాలున్న ఈ - టాయిలెట్ నిర్మాణానికి ఒక్కో టాయిలెట్ కు సుమారు 7లక్షల వరకు ఖర్చవుతుంది. Corporate Social Responsibility ద్వారా వీటికి ఆర్ధిక సహాయాన్ని అందించడానికి కొన్ని ప్రైవేట్ సంస్థలు ముందుకొచ్చాయి.