9 Situations Where A Hostelite's Life Is Completely Different From A Day Scholar's!

Updated on
9 Situations Where A Hostelite's Life Is Completely Different From A Day Scholar's!

గర్వించదగ్గ తెలుగు సినిమా అంటే మనకి general గా బాహుబలి గుర్తొస్తుంది . Discovery channel లో మాంచి ప్రోగ్రాం ఏదైయ్యా అంటే Man vs. Wild గుర్తొస్తుంది. శ్రీమంతుడు సినిమాలో హీరోయిన్ ఎవరంటే శృతి హాసన్ గుర్తొస్తుంది . మనం tenth క్లాస్ ఎక్కడ చదివామంటే మన school గుర్తొస్తుంది .

అవన్నీ ఎలా నిజమో , మనకి Graduation మిక్స్డ్ Enjoyment అంటే బహుశా B.Tech ఏ గుర్తొస్తది . ఎక్కడైతే చదువూ , enjoyment సమానం గా ఉంటాయో దానికే B.Tech అని పేరన్నమాట ! చదువు... Classroom లో సరే ........ మరి enjoyment సంగతి ? హా దాని పేరే Hostel అన్నమాట .

Power Star సినిమా కి first day వెళ్లి చుస్తే ఎంత ఆనందం గా ఉంటదో , అదే ఆనందం హాస్టల్ లో ఉంటున్న ప్రతీవాడికీ ఉంటుంది . ఒక పది సంవత్సరాల తర్వాత వాడు కాలేజీ చూడటానికి కనుక వస్తే కచ్చితం గా వాడు హాస్టల్ కే వెళ్తాడు .

ఒక Day Scholar (D.S) కీ Hosteller కీ తేడా ఏంటంటే మొదటి వాడు నాలుగు గోడల మధ్య జీవిస్తాడు . రెండవవాడు నాలుగు స్వభావాల మధ్య జీవిస్తాడు . వీరిద్దరి variations ఈ article లో సరదాగా చూద్దామ్. ఈ article మొత్తం Hostel లో ఉన్న పరిస్థితుల Ideal case మాత్రమే చూపిస్తది . అంటే , maximum బయట ఎలా ఉంటుందో అలా అన్నమాట !

1. పొద్దున్న లేవడం :

D.S : అమ్మ నాన్న , ఓ తమిళమ్మాయి సినిమా లో లాగా వీళ్ళు ఇంట్లో 7 దాటాక కూడా పడుకుంటే మొహం మీద నీళ్లు పోసేస్తారు parents . మరీ అంత కాదనుకోండి ..... situation అర్థమైంది గా మీకు ?!

HLvsDSL-1A

Hos : వీరు పొరపాటున పొద్దున్న లెగిస్తే కనుక కనీసం 8:30 దాటుతుంది . వీరు బ్రష్ చేస్తారు . కానీ ఆ తర్వాతవి లైట్ తీసుకుంటారు టైం లేక :P ఇంకొందరు 8:45 కి లేస్తారు ., వీరిలాంటి వాళ్ళ కోసమే బయట మెడికల్ shops లో Mouth Cleaners ఉంటాయి . హహ్హ just saying !!!

HLvsDSL-1B

2. Class కి వెళ్లడం :

D.S : వీరు పొరపాటున కానీ one minute కూడా late గా రారు . "Time is Time" ఇక్కడ .

HLvsDSL-2A

Hos : వీరు general గా హాస్టల్ లోనే 9 కి college అంటే 9 కే హాస్టల్ లో start అవుతారు కాబట్టి వీళ్ళకి "Time is just Time" అనే Quotation వాడొచ్చు .

HLvsDSL-2B

3. Lunch :

D.S : ఇందులో వీరికి ఏ మొహమాటం లేదు . వీరి పద్దతి వేరు . Descent గా classroom లో కూర్చొని లాగించేస్తారు .

HLvsDSL-3A

Hos : వీరు మెస్ కి భోజనం చేయడానికి వచ్చారనుకుంటే మీరు ఎండాకాలం వర్షం వల్ల వచ్చే బురద లో కాలు వేసినట్టే . వీరు mess కి వచ్చేది...... Class లో lessons దగ్గర్నుంచి ఇంకో నాలుగు రోజుల తర్వాత ఆడబోయే క్రికెట్ match వరకు discuss చేస్తారు . మధ్యమధ్యలో అన్నం తింటుంటారు అంతే !

HLvsDSL-3B

4. Games (Mostly Cricket) :

D.S : వీరు కూడా ఆడతారండోయ్ . కానీ కాలం కలిసి వస్తేనే . లేదంటే ఇంటిదగ్గర్నుంచి ఫోన్లు మోగుతుంటాయ్ !

HLvsDSL-4A

Hos : ఇక్కడ situation చెప్పక్కర్లేదు . ఎలాగంటే ......... "మామా ! ఈరోజు ఆ E.C.E వాళ్ళకి చుక్కలు చూపించాలి రా ! Last match just two runs తో పోయింది !"

HLvsDSL-4B

5. Parties :

D.S : వీరికీ parties కీ చాలా వరకు పడదు . కొంచెం దూరం గా ఉంటారు ! కానీ వీరిని కూడా తక్కువంచనా వెయ్యకూడదండోయ్ !

HLvsDSL-5A

Hos : "మామ ! ఈరోజు బిందాస్ గా enjoy చెయ్యాలి . నైట్ హాస్టల్ లో తోటకూర అంట . కాబట్టి మనం Centre కి పోయి dum biryani తెచ్చుకుందాం "..... ఇదీ situation ikkada .

HLvsDSL-5B

6. Games (Now in Lappy):

D.S : వీరు ఇలాంటి గేమ్స్ "ఆడుతారు" అని చెప్పడం కంటే "ఆడుతుంటారు" అని చెప్పడం correct ఏమో !

HLvsDSL-6A

Hos : వీరికి ఫోన్ లో ఉన్న Mini Militia , Clash of Clans తో సహా laptop లో ఆడే Counter Strike , Battle Field వరకూ వేరే branches తో teams ఏస్కోని మరీ ఆడతారు . ఒక్కోసారి night 10 కి అవ్వాల్సిన గేమ్ Early morning 4 వరకు కొనసాగొచ్చు .

HLvsDSL-6B

7. Movies : ఇక్కడ మీకు అర్థంకావడానికి ఒక చిన్న example తీసుకుందాం !

D.S : "అరేయ్ ! ఇంట్లో కుదరదు రా ! first show ite నే వెళదాం రా !"

HLvsDSL-7A

Hos : "అరేయ్ ఓ సాటి లేని రోజు పండితుడా (Day Scholar)! మా బాధలు నీకు అర్ధం కావట్లేదు రా ! Morning Show ఐతే మనకి క్లాస్ ఉంటుంది . మాట్నీ ఐతే మెస్ లో లేట్ అవ్వుద్ది . First show ఐతే రాత్రి మాకు మెస్ లో food ఉండదు. Second show ఐతే , బిందాజ్ గా ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు . నువ్వు మాలాగా second show కి వాస్తవంటే రా ! లేదంటే Dabaang !"

HLvsDSL-7B

8. Wardrobe :

D.S : ముందే చెప్పినట్టు "padhati follows them " అన్నమాట ! అలా కనుక లేకపోతే , ఇంట్లో వీరు parents యొక్క మాటల తూటాలకి ready గా ఉండాలి !

HLvsDSL-8A

Hos : వీరికి ఇలాగ ప్రత్యేకం గా ఏమీ ఉండవు . shirt ఒక రూమ్ లో , pant ఒక రూమ్ లో , shoes ఒక రూమ్ లో ...... అలాగ ఒక పది రూములు కలిపితే వీరి wardrobe అవ్వుద్ది .

HLvsDSL-8B

9. Nightouts :

D.S : valentines day కి మన Chai Bisket లో Suhas పెట్టినట్టు వీరు కూడా ఆ రోజు నైట్ (Exam ముందురోజు ) ఆ పార్టీ పెడతారు . పార్టీ పేరు "ఒంటరి పోరాటం పార్టీ".

HLvsDSL-9A

Hos : ఇది మాత్రం చాలా interesting . బాహుబలి climax లో Prabhas మీద ఒక ఇరవై మంది కాలకేయ సైన్యం పడతారు చుడండి ., Room లో నాలుగు beds ఉంటే వాటి Centroid లో ఒకడు కూర్చుంటాడు . వాడు topper అన్నమాట . వాడి చుట్టూ 360 degrees లో ఇంకో ఇరవై మంది కూర్చొని lesson చెప్పించుకుంటారు . పొరపాటున మీరు B.Tech లో one day batting అన్న పదం వినుంటే ., అది ఇదే అని మీకు అర్ధమయ్యే ఉంటుంది ఈపాటికి !

HLvsDSL-9B

Day Scholars gurinchi ఏదో సినిమా చూసినంత easy గా చెప్పేసాను కానీ ..... వీరి situation కూడా సినిమా తీసినంత కష్టం ! ఇక పోతే అది day scholar అయినా , Hosteller అయినా , వాళ్ళు college లో ఉన్నన్నాళ్ళు అనురాగం ఉంటుంది , college వదిలి వెళ్లాకే అనుబంధం ఏర్పడుతుంది college తో .

ఏమైనా points miss చేసుంటే Comment చెయ్యండి !!!!!!!