'"అన్నా" యునివర్సిటీలో ప్రొఫేసర్ గా ఉన్నప్పుడు నాకు(అబ్దుల్ కలామ్) రాజ్కోట్ బిషప్ రెవరెండ్ ఫాదర్ గ్రేగరీ తను స్థాపించిన Christ కాలేజి Inauguration కోసం నన్ను Chief Guest గా Invite చేశారు. College ఓపెనింగ్ కి ఒకరోజు ముందు నేను వారింటికి వెళ్ళాను. ఒక క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి Home లో అన్ని మతాల దేవుళ్ళ ఫోటోలతో కూడిన ఒక Prayer Hall వారింట్లో ఉంది. భారతదేశంలోని అన్ని పుణ్యక్షేత్రలను తనలో దాచుకున్న ఆ ప్రార్ధన మందిరాన్ని చూస్తే నాకు అనీర్వచనీయమైన ఆనందం కలిగింది. గ్రేగరీ నాకు ఆ మందిరం గురుంచి Explain చేస్తుండగా అదే ఊరిలోని నారాయణ స్వామి దేవాలయం నుండి నాకు ఆహ్వానం అందింది. నా స్నేహితుడు వై.ఎస్ రాజన్ తో వెళ్తుండగా Father గ్రేగరీ కూడా మాతో Join అయ్యారు. నారాయణ స్వామి దేవాలయంలో నేను, గ్రేగరీ, రాజన్ ఇలా మూడు మతాలకు చెందిన ప్రతినిధులుగా శ్రీకృష్ణుడి ప్రతిమ ముందు నిలబడి ప్రణామాలు అర్పించాము. పూజారి మా ముగ్గురి నుదుటిన బొట్టు పెట్టారు నా కళ్ళు ఆనందంతో తడిచి తాండవించింది. అది ఒక అద్భత దృశ్యం. మన భారత దేశంలో వివిధ మతాల మధ్య అల్లుకున్న అనుబంధం ఎలాంటిదో, అది ఎంతటి అధ్యాత్మిక అనుభూతిని ప్రసాదిస్తుందో ఆ దృశ్యం నిరూపిస్తుంది.
ఇంకొసారి బెంగుళూరులో ఓ సభకు హాజరవుతూండగా పిల్లలకు ఏమైన Motivational గా Speech చెప్పడం కోసం నా మిత్రుడిని సలహాలు అడిగాను అతను కళ్ళుమూసుకొని నన్ను Motive చేయడం మెదలు పెట్టాడు. అతను ఇలా... నువ్వు ఏం మాట్లాడినా సత్యమే మాట్లాడు, మాట మీదనే నిలబడు, నీ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టు, సాద్యమైనంత వరకు ఎదుటివానికి సంతోషాన్ని ఇవ్వు అని నన్ను Inspire చేస్తున్నాడు కాని ఇదంతా ఖూరాన్ లోని మహ్మద్ ప్రవక్త సూక్తులు ఇదంతా నాకు చెప్పింది ఒక వేదపండితుడు ఒక బ్రహ్మణుడు అయిన ముత్తుస్వామి దీక్షితార్.
ఇలాంటి విశాలభావన ఒక్క భారతదేశంలోనే సాధ్యమనిపిస్తుంది. మన దేశంలో వర్ధిల్లిన ఎన్నొ సంస్కృతులు, సంప్రదాయాల వల్ల ఈ ప్రపంచం అంతా మనుషులు తమ మతాన్ని దాటి ఎదుటి మతాల్లో మంచిని కూడా పాటిస్తారు అంతటి గొప్పతనం నా భారతదేశ ఘనతది.'