To Dear అమృతరావు, An Actor, Writer, Music Director & Our Childhood's Favorite Character

Updated on
To Dear అమృతరావు, An Actor, Writer, Music Director & Our Childhood's Favorite Character

ఒకప్పుడు అమృతరావుగా తన నటనతో అలరించారు, ఈ మధ్య గుండె జారి గల్లంతయిందే ద్వారా తన రచనతో ప్రేక్షకుల గుండెలు కొల్లగొట్టారు, ఇప్పుడు Good Bad Ugly తో తనలోని దర్శకుడిని మనకు పరిచయం చేయబోతున్నారు. ఆయనే “హర్షవర్ధన్”. ఒకవైపు బుల్లితెర లో అలరిస్తూనే మరో వైపు వెండి తెరకు అడుగులు వేశారు. బుల్లి తెర వాళ్ళు వెండితెర లో రానివ్వలేరు అనే ఒక బూటకాన్ని తొలగించి , టాలెంట్ ఉంటే ఎక్కడ ఉన్న రాణించొచ్చు అని రుజువు చేసారు. విజయనగరంలో పుట్టిన ఆయన స్కూలింగ్ అంతా అక్కడే అయింది. తర్వాత డిగ్రీ వైజాగ్ బుల్లయ్య కాలేజీ లో చేసారు.

మొదటి పర్వం : సంగీతం హర్షవర్ధన్ గారికి చిన్నపటినుంచి మ్యూజిక్ అంటే పిచ్చి. అదే interest తో సింగర్ అవుదాం అని హైదరాబాద్ పయనమయ్యారు. వైజాగ్ లో తన ఫ్రెండ్ తో కలిసి సినిమాల్లో ప్రయత్నం మొదలు పెట్టారు. మొదట అవకాశం వచ్చిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఓడిపోయి ఇంటికి తిరిగి వెళ్ళటం ఇష్టం లేక ఎదో ఒకటి సాధించే వరకు ఇక్కడే ఉందాం అని డిసైడ్ అయ్యారు. అక్కడే ఉంటూ సింగర్ గా తన trails చేస్తూ ఉన్నారు.

రెండవ పర్వం: నటన ఇలా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో, చాలా మంది నటుడిగా try చేయొచ్చు కదా అని సలహా ఇచ్చేవాళ్లు. అప్పుడు అది సీరియస్ గా తీసుకోలేదు. కానీ అదే టైం లో ఋతురాగాలు డైలీ సీరియల్ start అవుతుంది. దానికి రచయిత అయిన ఒకరు ఒక character ఉంది చేస్తే బాగుంటుంది అని అన్నారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని సరే చేస్తాను అని చెప్పారు. ఇలా 6 episodes అని అనుకున్న character ప్రేక్షకులకు నచ్చటంతో ఆలా 200 episodes దాక వెళ్ళింది. అలా మొదలయిన ఆయన నటనా పర్వం, ఆయన చేసిన ఆ చిన్న క్యారెక్టర్ తో మరిన్ని అవకాశాలను తెచ్చి పెట్టింది. “నా కోసం ఎప్పుడూ ఎవరు characterలు రాయలేదు. నాకు వచ్చిన charecters అన్ని ఎవరో కాదంటే వచ్చినవే ” అని అంటుంటారు . ఋతురాగాల తో మొదలయిన అయన ప్రయాణం, అమృతం, కస్తూరి, శాంతి నివాసం అని చాలా మంచి సీరియల్స్ తో మనల్ని ఆకట్టుకున్నారు . జనాలకి హర్షవర్ధన్ కంటే అమృత రావు గానే ఎక్కువ పరిచయం.

మూడవ పర్వం : రచన బుల్లి తెర అంటే చాలా మంది సినిమా వాళ్ళకి చిన్న చూపు ఉందని అంటారు, ఎక్కువ అవకాశాలు రావు అంటారు. కానీ కష్టాలని అధికమించి అటు బుల్లి తెర లో చేస్తూనే సినిమాల్లో కూడా చిన్న చిన్న characters చేసారు. ఐతే, పౌర్ణమి, డేంజర్, అనుకోకుండా ఒక రోజు సినిమాల్లో కొన్ని మంచి పాత్రలు చేసారు. లీడర్ లో CM P.A గా అయన చేసిన నటన చాలా మంది ప్రశంసలు అందుకుంది. ఇలా ఒక వైపు నటిస్తూనే తనదైన కథలతో మళ్ళీ ఒక రచయిత గా మన మందికి వచ్చారు. గుండె జారి గల్లంతయ్యిందే, మనం సినిమాలకి కథ, స్క్రీన్ ప్లే అందించారు.

నాలుగవ పర్వం : దర్శకత్వం అన్ని రంగాల్లో తనదైన శైలితో అందర్నీ ఆకట్టుకున్న హర్షవర్ధన్ గారు, దర్శకుడిగా “Good Bad Ugly” అనే చిత్రంతో మన ముందుకి వచ్చారు. సినిమా కి కథతో పాటు మ్యూజిక్ కూడా ఆయనే compose చేసారు. ఒక మ్యూజికల్ narrative గా వచ్చిన ఈ మూవీ ఒక కొత్త కాన్సెప్ట్.

అన్నిట్లో తానేంటో prove చేసుకున్న మన అమృతరావు ఇంకా మరిన్ని కొత్త కథలతో, తన రచన తో, నటన తో, అలరిస్తారు అని ఆశిద్దాం.