Contributed By Gireesh Raman
ఆమె ! తన కూతురికి 13 ఏళ్ళ వయస్సులో రెండో కాన్పు ఇస్తూ ఆ తల్లి మరణించింది ఇప్పుడు ఆ బిడ్డకు తాను తల్లి అయ్యింది, తాళి లెని తల్లి అయ్యింది, పుష్పవతి కాకుండానే అమ్మ అయ్యింది . ఎప్పటి లాగే సగం తెలిసిన లోకం వెక్కిరించింది .
ఏడాదికి ఆమె యెడ ఎడారి అయ్యింది. వొణికి బాగా మరకలు పడ్డాయి కొత్తది కొనిపించమని తాగుబోతు తండ్రిని అడిగింది . చంటోడిని చంకనేసుకొని తండ్రితో సంతకెళ్లింది . అక్కడ ఆమెని ఎండలో పీటవేసి కూర్చోబెట్టి పలక మీద నా కూతుర్ని అమ్ముతున్నాను అని రాసి పట్టుకొని నిల్చున్నాడు .
పాపం తనకేమో చదువు రాదు, కొత్త వోణి వస్తుందేమో అని నవ్వుతు కూర్చుంది . ఇంతలో ఒక ముసలి అతను "నాకు పిల్లలు లేరు నీ కూతురిని నేను కొన్నుకుంటాను" అన్నాడు . ఆ మాట విని ఆమె గుప్పెటిలో గట్టిగ పట్టుకున్న చింత గించాలు నేల రాల్చింది . అష్టాచెమ్మా కోసం పోగుచేసింది అవి. అష్టా పడింది. సొమ్ము తీసుకొని చంటోడిని లాక్కుని సారాయి దుకానికి చేరాడు కసాయివాడు .
25 సవంత్సరాల తరువాత ఈ కథను ఓ వేశ్య గృహానికి వోచిన ఓ రచయిత పడక మీద కూర్చొని రాస్తున్నాడు . పైట జార్చిన ఆమె ఏడుస్తూ తన కథను చెప్తుంది . ఓ వ్యభిచార గృహం లో కలిసిన అక్క-తమ్ముళ్ల కథ పైవాడు రాస్తున్నాడు .
"మనం ఒక్కసారే చస్తామా ?"అని ఆ రచయత కథ ముగించాడు .