40 Rare & Lesser Seen Pics Of Nandamuri Harikrishna Garu That Are Pure Gold

Updated on
40 Rare & Lesser Seen Pics Of Nandamuri Harikrishna Garu That Are Pure Gold

నందమూరి హరికృష్ణ గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడటానికి నా వయస్సు నా అనుభవం రెండూ సరిపోవు, అందుకే ఆయన మనస్తత్వానికి అద్దం పట్టేలా మాజీ డీజీపీ హెచ్.జె.దొర ' ఎన్టీఆర్ తో నేను' అనే పుస్తకం లో హరికృష్ణ గారి గురించి రాసుకున్న కొన్ని వాక్యాలు మీ కోసం :

" తెలంగాణా వీథుల మీదుగా బయల్దేరిన ఎన్టీఆర్ చైతన్యరథం రాయలసీమ రాదారుల్లో తిరిగి తిరిగి అక్కడినుంచి ఆంధ్రా వైపు మళ్లి చివరిగా ఉత్తరాంధ్రలో రెస్ట్ తీసుకుంది. ఇక్కడో విషయం తప్పకుండా ప్రస్తావించితీరాలి. హనుమంతుడి గురించి చెబితే కానీ రామకథ సంపూర్ణం కాదన్నట్టు ఎన్టీఆర్ వేళా కిలోమీటర్ల ప్రయాణానికి సారధ్యం వహించిన ఆయన కుమారుడు హరికృష్ణ గురించి ఇక్కడే చెప్పి తీరాలి. ఆ టూర్లలో నేనతన్నిచాలా నిశితంగా పరిశీలించేవాణ్ణి. ఎంతసేపూ అతని దృష్టి వాహనం నడపడం పైనే...పగలల్లా తండ్రిగారు అధిరోహించిన రథాన్ని పరుగులు తీయించడం, రాత్రి ఆయన విశ్రమించాక మెకానిక్లతో కూర్చుని వ్యాన్ కు అవసరమైన మరమ్మత్తులు చేయించడం...ఇదీ ఆయన దినచర్య. ఇందులో ఏనాడూ పెద్ద మార్పేదీ ఉండేది కాదు. నాన్నగారు ప్లస్ వ్యాన్ మినహా హరికృష్ణకు మరింకేదీ పట్టేది కాదు. ఎక్కడికి వెళ్తున్నారో, ఏ నియోజకవర్గంలో ఎవరి ప్రచారానికి వెళ్తున్నారో...ఇవేమీ బొత్తిగా తెలియవతనికి. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడు. ఎందుకంటే తన ధ్యాసంతా తండ్రిగారిని సురక్షితంగా గమ్యానికి చేర్చడం మీదనే. రాజకీయం అస్సలు వంటబట్టేది కాదతనికి..."

వినయవిధేయతలు కల్గిన కొడుకుగా, ఒక రధసారధిగానే కాదు నమ్మిన దానికోసం ప్రాణం పెట్టి పనిచేసిన ఆయన ఈరోజు మనమధ్య లేకపోయినా..మన జ్ఞ్యాపకాల్లో ఎప్పటికీ నిలిచేవుంటారు.

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.

14.

15.

16.

17.

18.

19.

20.

21.

22.

23.

24.

25.

26.

27.

28.

29.

30.

32.

33.

34.

35.

36.

37.

38.

39.

40.