These Beautiful Lines About Father From The Book "నాన్న పచ్చి అబద్ధాల కోరు" Will Let You Know Hardships Of Father

Updated on
These Beautiful Lines About Father From The Book "నాన్న పచ్చి అబద్ధాల కోరు" Will Let You Know Hardships Of Father

అమ్మ జన్మనిస్తే.. నాన్న జీవితాన్ని ఇస్తాడు... జీవించటం నేర్పిస్తాడు... జీవితంలో ఎన్ని ఆటు పోట్లు వచ్చినా... అండగా ఉంటాడు, అర్థం చేసుకుంటాడు. మనకు సుఖాలను ఇవ్వటం కోసం తాను కష్టాలు పడుతుంటాడు... ఇన్ని చేసిన నాన్న మనకి కొన్ని అబద్ధాలు కూడా చెబుతాడు... ఎలాంటి అబద్ధాలు అంటే... ( రచయిత సురేంద్ర రొడ్డ గారి "నాన్న పచ్చి అబద్ధాల కోరు" కవితా సంకలనం నుంచి ) బట్టల కొట్టులో నాకు కొత్త బట్టలు కొని తనకు పడవని నూలు బట్టలు కొన్నప్పుడు నాకు తెలియలేదు నాన్న అబద్ధమాడుతున్నాడని ! నాకు కొత్త చెప్పులు కొని నా పాత చెప్పులు తను వేసుకుంటూ కొత్త చెప్పులు తనను కోరుకుతయన్నప్పుడు నాకు తెలియలేదు నాన్న అబద్ధమాడుతున్నాడని ! నాకు లడ్డూలు కొనిచ్చి తను పిడికెడు పప్పులు తింటూ తీపి తనకు పడదన్నప్పుడు నాకు తెలియలేదు నాన్న అబద్ధమాడుతున్నాడని ! ఉన్న ఒక్క పరుపును నాకు పరిచి నడుము నొప్పికి నేల పడకే మంచిదన్నప్పుడు నాకు తెలియలేదు నాన్న అబద్ధమాడుతున్నాడని ! నన్ను ఆటో ఎక్కించి షుగర్ కు నడక మంచిదని తను నడిచినప్పుడు నాకు తెలియలేదు నాన్న అబద్ధమాడుతున్నాడని ! నా ట్యూషన్ ఫీజు కోసం ఓవర్ టైమ్ చేసి లేటుగా వచ్చి స్నేహితులతో పిచ్చాపాటీ అన్నప్పుడు నాకు తెలియలేదు నాన్న అబద్ధమాడుతున్నాడని ! తిరనాళ్ళలో గుర్రం ఎక్కించమంటే కళ్లు తిరుగుతాయని తన భుజాలెక్కించుకున్నపుడు నాకు తెలియలేదు నాన్న అబద్ధమాడుతున్నాడని ! నన్ను చదివించి కోటీశ్వరుడుకి అల్లున్ని చేసి కోడలి మాటలు దాచి సొంతింటిపై ఆశంటూ తనేల్లినప్పుడు నాకు తెలియలేదు నాన్న అబద్ధమాడుతున్నాడని ! నాకు అన్నింటినీ ఇవ్వడానికి తను ఎన్నింటిని కోల్పోయాడో నాన్న డైరీ చదివే దాకా నాకు తెలియలేదు నాన్న అబద్ధమాడుతున్నాడని ! అవును... నాన్న పచ్చి అబద్ధాల కోరు !!