Meet The Heartful Doctor Who Is Providing Prosthetic Limbs For Free To The Under-Privileged!

Updated on
Meet The Heartful Doctor Who Is Providing Prosthetic Limbs For Free To The Under-Privileged!

Article Info Source : Sakshi

నేను(రమణ యశస్వి) తిరుపతి లోని Balaji institute of research rehabilitation for disabled లో పనిచేస్తుండగా అక్కడికి వికలాంగులు కృత్రిమ అవయవాల కోసం వేలసంఖ్యలో వచ్చేవారు. ఆ హస్పిటల్ తిరుమల తిరుపతి దేవస్థానం అధ్వర్యంలో ఉచితంగా నడుపుతుండటం వల్ల ఎంతోమంది పేదవారు దేశమంతటి నుండి వచ్చేవారు. అక్కడి వేలమంది వికలాంగుల తాకిడిని చూసి హస్పిటల్ లో పనిచేసే వారు కోపగించుకుని "ఆరు నెలల తర్వాత రండి, ఇప్పుడు పోండి! అంటూ విసుగు చెందుతూ చీదరించుకునేవారు"(పాపం వారి తప్పు ఏమి లేదు, అక్కడి పరిస్థితి అలాంటిది). కేవలం అక్కడే కాకుండా వివిధ ప్రాంతాలకు వెళ్ళి క్యాంపులు నిర్వహిస్తుంటాం. ఒకసారి మా డాక్టర్ల బృందంతో కలిసి కలకత్తాకు వెళ్ళి అక్కడి వికలాంగులకు కృత్తిమ అవయవాలను అమర్చాము. వాళ్ళందరూ మరొక్కసారి జన్మనెత్తినట్టుగా భావించి మమ్మల్ని మనస్పూర్తిగా దీవించడం, వారి కళ్ళల్లోని తడి కన్నీటి నవ్వు చూసి అప్పుడే నిర్ణయించుకున్నా వీరికోసం ఒక ప్రత్యేక హస్పిటల్ నిర్మించాలని.

mother

నడవలేని పేద వికలాంగులందరూ జైపూర్, తిరుపతికి వెళ్ళేవారు అంతదూరం ప్రయాణం వారికి కష్టతరం అవుతుందని మా స్వస్థలం గుంటూరులోనే 'వాక్' అనే సంస్థను ఏర్పాటు చేశాము. కేవలం వారికి కళ్ళు అమర్చి డిశ్చార్జ్ చేస్తే ఇక అంతే అని అన్నట్టుగా కాకుండా వారి తరువాతి జీవితానికి అవసరమైన ఉపాధి కూడా కల్పిస్తున్నాము. ఒకసారి ఒక వ్యక్తికి సర్జరీ చేసి ఒక కాలు తీసేశాం. కొన్ని నెలల తర్వాత చూస్తే అతను రోడ్డు పక్కన అడుక్కుంటున్నాడు.. అతను అంతకు ముందు లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు. అవయవాలు ఒక జీవితానికి ఎంత అవసరమో, అవ్వి లేనప్పుడు వారి జీవితం ఎంతలా దిగజారిపోతుందో అప్పుడు అర్ధం అయ్యింది. ఈ బాధకర పరస్థితులలోనే అతనికి ఒక షాపు ఏర్పాటుచేసి గౌరవంగా బ్రతికే బ్రతుకు తెరువు మార్గాన్ని చూపించాము.

OLYMPUS DIGITAL CAMERA OLYMPUS DIGITAL CAMERA

ఎవరో ఒకరు ఎపుడో అపుడు మొదటి అడుగు వేస్తే వారిని అనుసరస్తూ ఎంతోమంది ఆ బాటలో నడుస్తారు. నేను ధైర్యంగా తొలి అడుగు వేయడంతో దాతలు ముందుకు వచ్చారు. పేద వికలాంగుల అవస్థలు చూసి హృదయం చలించిపోయి ఒక వ్యక్తి కృత్తిమ అవయవాలను తయారు చేసే యంత్ర పరికరాలను విరాలంగా ఇచ్చారు. ఇలా చాలామంది చాలా రకాలుగా సహాయం చేయడంతో 2006 లో ప్రారంభమైన ఈ 'వాక్' సంస్థ పది సంవత్సరాలలో దాదాపు నాలుగు వేలమందికి పైగా ఉచితంగా అవయవాలను అమర్చి చరిత్ర సృష్టించాం.

394510_482724158407158_1209146582_n

డబ్బుపోతే తిరిగి సంపాదించుకోవచ్చు కాని కాళ్ళు పోతే? వారి జీవితం దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోతుంది, మునపటి లాగ ఏ పని కూడ చెయ్యలేరు. ఈ పరిస్థితికి తగ్గట్టుగా ఇంట్లో పనిచేసుకునే ఉపాధి మార్గాలలో శిక్షణ కూడా ఇప్పిస్తు, టైలరింగ్, సాఫ్ట్ టాయ్స్, అగరువత్తుల తయారి వంటివి నేర్పుతు ఎవ్వరి మీద ఆధారపడి బ్రతకకుండా మంచి అవకాశాన్ని అందిస్తున్న ఈ మంచి మనసున్న డాక్టర్ గారికి సలాం.

427249_575027925843447_396787447_n

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.