Everything About Gunnam Gangaraju & Why Tollywood Needs More Producers Like Him

Updated on
Everything About Gunnam Gangaraju & Why Tollywood Needs More Producers Like Him

ఇప్పుడున్న డైరెక్టర్లందరిలో లోపాలను పసిగట్టిన వాడు, ఈ డైరెక్టర్లందరి కన్నా నేనే గొప్ప సినిమా తీయగలను అని బలంగా నమ్మి కష్టపడే వాడే ఒక గొప్ప డైరెక్టర్ కాగలడు" -రాం గోపాల్ వర్మ గారు."

ఏమ్ లేదు తెర ఎత్తగానె Flash Back Episode హీరో ఫ్యామిలీకి లేదా అతని లక్ష్యనికి సంబందించినది/ లేదంటే విలన్ ఎంట్రీ.. ఈ అన్యాయాన్ని ఆపేవాడు లేడా.? అనగానె ఇక్కడ హీరో Entry.. పక్కన చెంచగాళ్ళ భజన, హీరో వాడి గురించి అతని వంశం గురించి సొంత డబ్బ.. Fight, Intro Song, Next Heroin Entry, నాలుగు Double Meaning Dialogue లు, ఒక Teasing Song, వీడు ఏదొ మంచి పని చెయ్యగానే Heroin పడిపోద్ది.. Song.. హీరోయిన్ నాన్న విలన్, వీడికి హీరోకి ఏదొ పాతకాలం పగ Suspense తో ఒకరికొకరి Warning.. Interval..!! ఒక బకరతొ అదేనండి జంబల్ హాట్ రాజ ఉరఫ్ జప్ఫతో విలన్ ఇంట్లోకి వచ్చి తిమ్మిని బమ్మి చేసి హీరోయిన్ నాన్న కంటె పెద్ద విలన్ తొ పెళ్ళి ఆపేసి చెమ్క బట్టలేసుకొని హీరోయిన్ తో లేదా ఫ్లాంతర్ పగిడితో ఐటెమ్ సాంగ్.. Climax లొ Fight, Ending లొ ఒక జోకు/ నాలుగు మంచి మాటలతో రెండు కుటుంబాలను కలపడం... తిప్పి పెట్టి, మడత పెట్టి, అటుతిప్పి, ఇటు తిప్పి ఇవే స్టోరిస్ తో ఎన్ని సినిమాలు రా బాబు.. ఇలాంటి సినిమాల ఎడారిలో గంగరాజు గారి సినిమాలు, సీరియల్స్(మరికొంతమందివి కూడా) ఒయాసిస్ లాంటివి. భయంకరమైన పొల్యూషన్ సిటిలో ఓ ఆహ్లాదకరమైన పార్క్ లాంటిది. 20 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ లో 32 నంది అవార్దులు(సినిమాలు, సీరియల్స్ వివిధ విభాగాలలో కలిపి) అందుకోవడం అంటే మాటలు కాదు. ఎంతో శక్తి ఉంటే తప్ప ఇది సాధ్యపడదు. గంగ రాజు గారంటే మనందరికి ఎందుకింత ఇష్టమో అనే అంశం మీద మనకందరికీ తెలిసిన ప్రత్యేకతలనే మరొక్కసారి నెమరువేసుకుందాం..

"నీ దృష్టిలో ప్రేక్షకులు ఎలాంటి వారో అలాంటి సినిమాలే తీస్తావు. నీ దృష్టిలో ప్రేక్షకులు అంత తెలివైనవారు కాదు వాళ్ళ మొహాలకి ఇదే ఎక్కువ అని అనుకుంటే ఓ నిఖార్సయిన దిక్కుమాలిన సినిమా తీస్తావు, నీ దృష్టిలో ప్రేక్షకులు గొప్పవారు, తెలివైన వారు అని అనుకుంటే గొప్ప సినిమాలు తీస్తావు. "

Story: ఒక్కసారి గంగరాజు గారి సినిమాలు పరిశీలిస్తే అంతవరకు చూసినా సినిమాలా కాదు కదా, ఇంతకు ముందు అతను తీసిన సినిమాలా కూడా ఉండదు. లవ్ స్టోరి ఉన్నా అదే లవ్ స్టోరిస్ ఉండదు. కుటుంబ విలువలు ఉన్నా అవ్వే రెండు కుటుంబలను కలుపడాలుండవు, పగ ప్రతీకారం లాంటివి అసలుకే ఉండవు. మరేం ఉంటాయి అంటే దేశం కోసం తన కొడుకుని ప్రాణ త్యాగం చేసిన అమ్మ కథ ఉంటుంది, సరిగ్గా స్కూల్ బ్యాగ్ కూడా మోయలేని పిల్లలు ఎలా విలన్లను ఎదురించి బయటపడ్డారో అనే పిల్లల కథ ఉంటుంది, తన జీవితంలో ఒక రోజు మిస్సైన దాని గురుంచి ఓ శోధించే అమ్మాయి కథ అంటుంది. కుళ్ళు కుతంత్రాలు కాదు ప్రేమను ఆత్మీయతను నేర్పించే ఓ గృహిణి కథ ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.

No Stupid Sentiments: ఇవ్వాల ఎలా ఉందంటే జ్యోతిష్యులు కూడా కథలు వింటున్నారు.. దిక్కుమాలిన సెంటిమెంట్స్ కూడా సినిమాను అత్యంత ప్రభావితం చేస్తున్నాయి. దర్శకుల మాటల కన్నా జ్యోతిష్యులు హీరో హీరోయిన్ల జాతకాలు అన్ని పరిశీలించి సినిమాలు తీస్తున్నారు.. "ఆ రోల్ కు ఈ హీరోయిన్ పనికిరాదు చేయదు అన్నా గాని ఆమె జాతకం బాగుంది సినిమాలో పెట్టుకోండి" అనే దగ్గరి నుండి రకరకాల కాంబినేషన్స్, ఫలానా లోకేషన్ లోనే షూటింగ్, ఫలానా వ్యక్తితోనే మ్యూజిక్, డైలాగ్స్.. అనే ఈ సెంటిమెంట్స్ తో దిక్కుమాలిన కిచిడి చేసి ప్రేక్షకుల అసహనానికి పరీక్షలు పెడుతున్నారు. అమృతం సీరియల్ ఏ రోజు ప్రారంభం ఐయ్యిందో తెలుసా అశుభంగా భావించే అమావాస్య రోజు. రాధ మధు సీరియల్ లోని హీరో క్యారెక్టర్ చేసిన వ్యక్తిని ఓరోజు కార్లో వెళ్తుంటే రోడ్డు మీద నడుచుకుంటు వెళుతున్నప్పుడు చూసి సెలెక్ట్ చేసుకున్నారు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో.. నన్ను నేను మభ్యపెట్టుకుంటూ ప్రేక్షకులను మభ్యపెట్టాలనుకునే మనస్తత్వం గంగరాజు గారిది కాదు కాబట్టే ఓ స్పష్టమైన నిజాయితి ఆయనలో, ఆయన మేకింగ్ కనిపిస్తుంటుంది.

"సినిమాకు పుట్టుక ఉంటుంది కాని మరణం ఉండదు.. అందుకే కథ మాత్రమే కాదు పాత్ర తాలుకు వ్యక్తిత్వం కూడా ప్రేక్షకుడికి చిరకాలం గుర్తుండిపోవాలి"

No Star Hero: కథ అంతా హీరో చుట్టు తిరగాలనుకుంటే, బలం ఉన్న హీరో 10 మందిని ఏంటి 100మందిని కూడా తుక్కు తుక్కుగా ఎగిరేసి కొడతాడు.. అదే బలం లేని వాడి సంగతి.? ఈ కథా ప్రపంచంలో కేవలం ఒక పాత్రగా ఉంటే వాడు ఈ విశ్వంలో ఎలా మనగలడు.? సమస్యను ఎలా చూడగలడు.? ఎలా ఎదురించగలడు.? అని గంగరాజు గారి సినిమాలలో ఉంటుందే తప్పా వాస్తవానికి ఏమాత్రం కూడా దూరంగా ఉండదు. లిటిల్ సోల్జర్స్ నుండి మొన్నటి చందమామలో అమృతం వరకు అన్ని సినిమాల్లోనూ కథే హీరో, అందులో ఉన్న పాత్రదారులే మిగిలిన నటులు. అంతేందుకండి అమృతం సీరియల్ నే చూస్తే అమృతం దాదాపు ప్రతి ఏపిసోడ్ లో అజ్ఞాణంతో ఓడిపోతున్నాడు ఇలా ప్రతిసారి ఓడిపోయే క్యారెక్టర్ లో కామెడిని తీసుకువచ్చి, 5సంవత్సరాలు నిర్విరామంగా తీశారంటే అది కేవలం కథా బలం వల్లనే..

Versatility: ఒక ఫిల్మ్ మేకర్ కు ప్రతి ఒక్క అంశం మీద నిర్ధిష్టమైన అవగాహన ఖచ్చితంగా ఉండాలి. అది 24క్రాఫ్ట్స్ మీద కానివ్వండి బయటి ప్రపంచంలో జరుగుతున్నవి కానివ్వండి అప్పుడే తాను తీసే సినిమాలో ఒక Maturity కనిపిస్తుంది. గంగరాజు గారు డైలాగ్ రైటర్ గా, స్క్రీన్ ప్లే రచయితగా, ప్రొడ్యూసర్ గా, దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా(ఐతే లో విలన్ కు) మిగిలిన అంశాలమీద ఎంతటి అవగాహన ఉందో వ్యక్తుల భావోద్వేగాలు, ప్రపంచం, భారతదేశం, సాహిత్యం మిగిలిన వాటన్నీటి మీద ఓ అవగాహన ఉండబట్టే సినిమాలు, ఆఖరికి సీరియల్స్ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి..

ఇలా చెప్పుకుంటూ పోతే పాటలు, మాటలు, లోకేషన్స్, నటుల ఎంపిక, సోషల్ మీడియాలో వివిధ సినిమాలపై రాసే రివ్యూలు ఇలా ప్రతి విభాగానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. "ఆయనలో ఉన్న ఆ ప్రత్యేకతే మనకు గంగరాజు గారికి ఓ వారధిలా ఉన్నాయి". గంగరాజు గారి సినిమాలా నేను కూడా ఈ ఆర్టికల్ మరింత సాగదిద్దాం అనుకోవడం లేదు.

గంగరాజు గారు చేసింది తిప్పికొడితో పది సినిమాలు కూడా లేవు, ఇంకా ఓ ఎనిమిది సీరియల్స్ అంతే.. ఐన కాని 100 సినిమాలు నిర్మించిన నిర్మాతకు ఉన్నంత గౌరవం ఉంది మనలో, 100 సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకునికి ఉన్నంత ఆదరణ ఉంది మనలో. వీటన్నీటికి మించి ఆయన రూపొందించిన క్యారెక్టర్ల ద్వారా పంచుకున్న జ్ఞాపకాలు ఇప్పటికి కాదు మనకు జ్ఞాపక శక్తి ఉన్నంత కాలం ఆ పాత్రలు గుర్తుండిపోతాయి, జీవితం కోసం ప్రాణాలను పణంగాపెట్టిన నలుగురు యువకులు(ఐతే) గుర్తుంటారు, నిత్యం ఓడిపోయే అమృతం గుర్తుండి పోతారు, బోస్ గుర్తుండి పోతాడు(అమ్మ చెప్పింది), లిటిల్ సోల్జర్స్ గుర్తుంటారు ఇంకా మరెందరో.. గంగరాజు మా కోరిక ఒక్కటే ఇలాంటి మరెన్నో జ్ఞాపకాలు మరింత తొందరగా మీ సినిమాల ద్వారా అందివ్వండి సార్..