ఈ వ్యాసం గుడిపాటి వెంకటాచలం అనబడే ఒక తెలుగు రచయిత గురించి రాయబడినది. మీకు ఆయన గురించి తెలిసినా, తెలుసుకోవాలన్న ఆశ ఉన్నా-లేకున్నా, అసలు తెలుగు చదవటం అంతత మాత్రమె వచ్చినా కూడా..మన చాయ్ బిస్కెట్ స్టూడియో లో, మీ విలువైన సమయాన్ని, ఈ వ్యాసం కోసం కొంచెం వెచ్చించండి. వ్యాసం చదవటం పూర్తయ్యాక "అరె.. కిర్రాక్ ఉన్నడు ఈన" అని మీకు అనిపించకపోతే చూడండి.
ఏంట్రా ఈడు..వ్యాసం చదవమని బతిమాలుతున్నాడు అనుకుంటున్నారా. తప్పదు గురూ..కోలా తెచ్చినట్టు తెలిస్తే చాలు, పిల్లోడు ఖాళీ చేస్తాడు, బతిమాలి తాపించాల్సిన పని లేదు. అదే ఔషదం తాపించటానికి, ఎన్ని తంటాలు పడాలి? ఇదీ అంతే. సరే విషయానికి వస్తే...
అధ్బుతమైన వర్ణనలు, అర్ధం కాని పదజాలం, అంతుచిక్కని వ్యాకరణం, అవసరాన్ని మించిన ప్రాసలు కలగలపిన, సొంతంగా అనిపించని, మనసుని కదిలించని, మెదడుకు పని చెప్పని, అసలు మనకోసమేనా..అనిపించే విషయాలు గురించి కాదు చలం గారు రాసింది. పాశ్చాత్య సంస్కృతిని పిచ్చిగా పాటించే ఈ తరాన్ని కూడా ఆలోచింపచేసేలా రాయబడిన రచనలు అవి.
ప్రేమకు కామానికి, శృంగారానికి సంభోగానికి, వాస్తవానికి విశ్వాసానికి, అనుభావానికి ఆచరణకి మధ్య వ్యత్యాసం తెలియని వాళ్ళు..ఆయన పై సంఘ విద్రోహి అన్న ముద్ర వేసారు. ‘ఆయన చూపుల లోతు, ఆలోచనల ఎత్తు, ఆశయాల వైశాల్యాన్ని’ అర్ధం చేసుకోలేని మనుషులు..ఆ రచనల్ని బూతులుగా, అవినీతికి రీతులుగా, అర్ధం లేని కోతలు గా చిత్రీకరించారు.
చీకటే జీవితం అని నమ్మి నడిచే వాడు, ఒక్కసారిగా వెలుగుని ఎలా తట్టుకోలేడో..ఆయన రచనల్ని మొదటి సారి చదివే వాళ్ళు కూడా, ఆ నిజాయితీని తట్టుకోలేరు. కాని వెలుతురిని వెతుకుతూ నడిచే వాడికి ఎంత ఆనందం కలుగుతుందో, అర్ధం చేసుకొని చదివిన వాళ్ళకు అంతే ఆనందం ఆ రచనలు.
బంగినపల్లి మామిడి రుచిని ఎంత వర్ణించినా, దాన్ని కొరికి తిన్నప్పుడు కలిగే అనుభవం తీసుకురాలేం. అలానే ఆయన రచన శైలి గురించి ఎంత చెప్పినా, ఆయన రచనలు చదవిన తరువాత కలిగే అనుభూతిని అర్ధం అయ్యేలా చెప్పలేం. ఆయన రచనల్లోని మంచి లైన్స్ అందిస్తున్నాం, మీకు ఆసక్తి ఉంటె పూర్తి వివరాల కోసం గూగుల్ తల్లి ఉంది గా.
జీవితం గురించి
ఆయన రచనలు అర్ధం చేసుకోలేక, ఆయన్ని విమర్శించే వారి గురించి
తనకు ఎప్పుడు ఉత్ప్రేరకం లా ఉన్న స్త్రీ గురించి
తన రచనలు అర్ధం చేసుకోలేని వారికి సమాధానం గా
ఆనాటి ప్రజల్లోని కరుడుగట్టి పోయిన అంధవిశ్వాసాల గురించి వ్యంగ్యంగా
ప్రేమంటే ఏమిటో తెలీక, అర్ధం లేని విషయల గురించి వెంపర్లాడే వారికోసం
ఆ కాలంలో స్త్రీల దయనీయ పరిస్తితి గురించి
నిజమైన ప్రేమకు నిర్వచనం
ఊర్వసి పరూరవ నాటకం లో, ఇద్దరు మనుషుల ప్రేమ కలయిక గురించి
చుట్టూ ఉన్న ప్రకృతిని విడిచి పుస్తకాల్లో ఆనందాన్ని వెతికే వారి గురించి...
ప్రకృతి ని స్త్రీ ని కలగలిపి
స్త్రీ పురుషుల స్వభావాల్లో భేదాన్ని ఒక్క మాటలో
సినిమాలను పిచ్చిగా ఆరాదిస్తూ, ఏ పని చేయని వారిని ఉద్దేశించి
గతి తప్పుతున్న మనిషి ఆలోచనల గురించి
ప్రేమ గురించి
ఇష్టం లేకుండా జరిపించే పెళ్ళిళ్ళు గురించి
ఆయన ఆనాటి కాలంలోని స్త్రీల సమస్యల గురించి, వ్యక్తిగత స్వేచ్చ గురించి, స్వచ్చమైన అనుభవాల గురించి, ఆచారాల తప్పిదాల గురించి, అర్ధం కాని వ్యవహారాల గురించి, అర్ధం లేని కట్టుబాట్ల గురించి అర్ధమయ్యేలా రచనలు చేసారు. అత్యంత క్షుణ్ణంగా చదివితే కాని, ఆయన ఉద్దేశం ఏమిటో అర్ధం చేసుకోవటం చాలా కష్టం. ఒక్క సారి ఆయన శైలి అర్ధం అయితే, ఆయన రాసిన ప్రతి అక్షరం ఎంత సత్యమో అనుభవం అవుతుంది.