Contributed By Sai Ram Nedunuri
నిన్ను వేరే పేరుతో పిలిస్తే వింతగా చూస్తావు నువ్వు తన పేరు మార్చుకోవడానికి సిద్ధపడిపోయింది తను
ఎక్కడికెళ్ళినా చివరికి ఇంటికి వచ్చేద్దాం అనుకుంటావు నువ్వు ఇకపై తన ఇంటికి వెళ్ళేది చుట్టపు చూపుకి మాత్రమే అని తెలిసి కూడా నీ వెంట వచ్చేసింది తను
కొత్త వాళ్లతో మాట్లాడటానికి జంకుతావు నువ్వు నీ ఇంట్లో ఉండే నీ వాళ్ళందరినీ తన వాళ్లు అనేసుకుంది తను
నీ అలవాట్లు మానుకోవడానికి ఇష్టపడవు నువ్వు నీ ఇంట్లో మెలగడానికి ఎన్నో అలవాట్లను మార్చుకుందేమో తను
కొద్దిపాటి బరువుని మోయడానికి ఆయాస పడతావు నువ్వు తొమ్మిది నెలలు నిన్ను చూస్తూ ఆనందంగా మోసేస్తుంది తను
ఏమని కీర్తించగలవు తన గొప్పతనాన్ని ? ఏమిచ్చి తీర్చుకోగలవు తన ఋణాన్ని ?